గుడ్ ఫ్రైడే:
సన్హెడ్రిన్ ముందు విచారణ: యేసును యూదు మత నాయకులు (మహాసభ వారు) విచారించారు. పిలాతు ముందు విచారణ: యేసును రోమన్ గవర్నర్ పొంతి పిలాతు ముందు హాజరుపరిచారు. కొరడా దెబ్బలు మరియు అపహాస్యం: ఆయనను సిలువ వేయడానికి ముందు, యేసును రోమన్ సైనికులు కొరడాలతో కొట్టారు మరియు ఎగతాళి చేశారు. హేరోదు ముందు విచారణ. హేరోదు తిరిగి యేసును పిలాతు యొద్దకు పంపాడు. పిలాతు శిక్షకు యేసును అప్పగించడం. సిలువ వేయడం: యేసును సిలువపై సిలువ వేశారు, ఇది రోమన్ ఉరిశిక్ష యొక్క సాధారణ రూపం, మరియు సిలువపై మరణించారు. మరణం మరియు ఖననం: ఆయన మరణం తర్వాత, యేసు మృతదేహాన్ని సిలువ నుండి దించి సమాధిలో ఖననం చేశారు.
గుడ్ ఫ్రైడే మరియు యేసు సిలువ పై పలికిన ఏడు మాటలు
లూకా 23:34, యేసు– తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.
లూకా 23:43, అందుకాయన వానితో–నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.
యోహాను 19:26-27, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలు చుండుట చూచి–అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి–యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.
మత్తయి 27:46, ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
యోహాను 19:28, అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు–నేను దప్పిగొనుచున్నాననెను.
యోహాను 19:30, యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను.
లూకా 23:46, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను చున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl