
మనం ఆదికాండములో చదివిన దానితో పాటు, భూమి ఒకప్పుడు మహా జల ప్రళయాన్ని చవిచూసిందన డానికి ఆశ్చర్యకరమైన సాక్ష్యం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులలో ప్రపంచవ్యాప్త జల ప్రళయమును గురించి 270 కంటే ఎక్కువ ఇతిహాసాలను డాక్టర్ డువాన్ గిష్ గుర్తించారు. ఈ కథలు, అనేక వివరాలతో విభిన్నంగా ఉన్నప్పటికీ, ఇవి మొత్తం ప్రపంచం నీటి ద్వారా నాశనం చేయబడి ఉండటాన్ని గురించి తెలియజేస్తూవున్నాయి. ఈ జలప్రళయములో కొద్దిమంది ఓడ ద్వారా జలప్రళయము నుండి రక్షించబడి యున్నారని అవి చెప్తూవున్నాయి.
అన్ని లెజెండ్స్‌లో ఉన్నట్లుగా, ఈ కథలన్నీ వారి పూర్వీకులు అనుభవించిన వాస్తవ సంఘటనపై ఆధారపడి ఉండవచ్చని నిర్ధారించడం సహేతుకమైనది. ఖచ్చితంగా నోవహు పిల్లలు తమ జలప్రళయ అనుభవాలను వారి పిల్లలు మరియు మనవళ్లకు అందజేసి ఉంటారు. మౌఖిక ఖాతాలు తరం నుండి తరానికి అందజేయ బడ్డాయి. చివరికి వారి నుండి వచ్చిన వివిధ వ్యక్తుల ద్వారా అవి వ్రాయబడ్డాయి. అందుకు చాలా టైం పట్టింది. జల ప్రళయము విషయములో ఇన్ఫర్మేషన్ లోని ఖచ్చితత్వము కూడా మార్పుచెందింది. కథలు విభిన్నమైన వివరాలతో క్రొత్తగా పుట్టు కొచ్చాయి.
జల ప్రళయానికి శిలాజాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి. సముద్రం నుండి దూరంగా ఉన్న పర్వత ప్రాంతాలలో అనేక సముద్ర శిలాజాలు కనుగొనబడ్డాయి. వరద నీరు ఒకప్పుడు పర్వతాలను కప్పివేసి, అక్కడి జంతువులను శిలాజాలుగా మార్చిందని అవి సూచిస్తున్నాయి. భూమిపై చాలా శిలాజాలు ఉన్నాయంటే, ప్రపంచ జలప్రళయము వంటి పెద్ద విపత్తు సంభవించి ఉంటుందని అవి సూచిస్తూవున్నాయి. ఎందుకంటే జీవులు అకస్మాత్తుగా ఖననం చేయబడి ఉండాలి. ఆ క్రమములో వాటి శిలాజ అవశేషాలను రాళ్లలో వదిలివేసాయి. మాములుగా జంతువులు చనిపోయి ఉంటే, అవి నేలపై పడుకుని ఉండేవి. స్కావెంజర్లు వాటి అవశేషాలను తినేందుకు వచ్చి ఉండేవి వాటిని తినేసి ఉండేవి. సంపూర్ణ శిలాజాలుగా అవి మారె అవకాశము ఉండెడిది కాదు. వాటి అవశేషాలు ఆసిఫై కావడానికి చాలా కాలం ముందే అవి క్షీణించి ఉంటాయి. భూమి అంతటా ఇన్ని శిలాజాలు ఎలా ఏర్పడ్డాయో నోవహు వరద చాలా సులభంగా వివరిస్తుంది.
గ్లోబల్ వరదకు సంబంధించిన ఇతర సాక్ష్యాలు భూమి పొరలు కోతకు గురికాకుండా వాటి మధ్య అకస్మాత్తుగా వివిధ రాతి పొరలు వేయబడటం గ్లోబల్ వరదను సూచిస్తూవున్నాయి. ప్రామాణిక పరిణామ సిద్ధాంతాల ప్రకారం, మనం చూసే పొరలు (గ్రాండ్ కాన్యన్‌లో వంటివి) ప్రతి పొర మధ్య గ్లోబల్ వరదకు సంబంధించిన సాక్ష్యముంది. అయితే, పొరల మధ్య కోతకు ఎటువంటి ఆధారాలు లేవు. ఆదికాండము వర్ణించినట్లుగా, నోవహు జలప్రళయం వాటిని చాల తక్కువ వ్యవధిలో వేసింది. అగ్నిపర్వత విస్ఫోటనంపై డాక్టర్ స్టీవెన్ ఆస్టిన్ చాలా తక్కువ సమయంలో పాత భౌగోళిక లక్షణాలను ఎలా మార్చవచ్చొ వివరణాత్మకంగా వివరించియున్నాడు.
నోవహు జలప్రళయం కేవలం స్థానిక లేదా ప్రాంతీయ వ్యవహారమని కొందరు నమ్ముతుంటారు. ఈ సిద్ధాంతం లేఖనాలతో ఏకీభవించటం లేదు. దేవుని ప్రణాళిక మొత్తం భూమిని నీటితో నాశనం చేయాలనేది, దానిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే కాదు (ఆదికాండము 6:13-17). నీరు ఎత్తైన పర్వతాలను కూడా కప్పేటట్లు పెరిగింది (ఆదికాండము 7:19) – స్థానిక వరదలకు అసంభవం. స్థానిక వరద సిద్ధాంతం కూడా అసంబద్ధమైనది, ఎందుకంటే నోవహు యొక్క వరద కేవలం స్థానికంగా ఉంటే, నోవహు, అతని కుటుంబం మరియు జంతువులు మనుగడ కోసం చేయాల్సిందల్లా ఎత్తుపైకి సురక్షితమైన ప్రదేశానికి తరలిపోవడమే.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl