నాకు ఒక్కడే కుమారుడు. నేను నా కుమారునికి 14 రోజులప్పుడు బాప్తిస్మం ఇవ్వడం ద్వారా క్రైస్తవ తల్లిదండ్రులుగా నా బాధ్యతలన్నింటినీ నేను పూర్తి చేశానని అనుకోవడం తప్పు. నా కుమారునికి బాప్తిస్మం ఇవ్వడం ఒక పాస్టర్ గారిగా నాకు చాలా సులభమైన విషయం. కాని ఆ కుమారుడు తాను ఎదిగే కొలది క్రైస్తవ విద్య ద్వారా ఆ బాప్తిస్మమును అనుసరించడం చాలా ఎక్కువ డిమాండ్‌తో కూడుకున్నది, అది ఎంతో ప్రాముఖ్యమైనది, విలువైనది.

బాప్తిస్మము ఖచ్చితంగా అర్థరహితమైన చర్య కాదు. మార్కు 16:16లోని యేసు మాటలు ఆ విషయాన్ని వక్కాణిస్తూ ఉన్నాయి. బాప్తిస్మము రక్షిస్తుంది (తీతు 3:5-6) ఎందుకంటే అది సృష్టించే క్రైస్తవ విశ్వాసం ద్వారా, ప్రజలు యేసు వారి కోసం గెలిచిన రక్షణను ఆనందిస్తారు. బాప్తిస్మము ప్రజలను యేసు నీతిగా మారుస్తుంది (గలతీయులకు 3:26-27).

అయినప్పటికీ, బాప్తిస్మములో సృష్టించబడిన విశ్వాసం వాక్యము మరియు లార్డ్స్ సప్పర్ లో సువార్తను ఉపయోగించడం ద్వారా పెంపొందించబడకపోతే మరియు సంరక్షించబడకపోతే, విశ్వాసం బలహీనంగా పెరుగుతుంది మరియు చివరికి చనిపోవచ్చు. అలాంటి సందర్భాలలో, ప్రజలు బాప్తిస్మము తెచ్చిన ఆశీర్వాదాలను కోల్పోతారు.

బాప్తిస్మము అనేది శాశ్వత జీవితానికి సంపూర్ణ హామీ కాదు. బాప్తిస్మము పుచ్చుకొన్న పిల్లలు పెద్దలు వారు పెరిగేకొద్దీ, బాప్తిస్మముకు దేవుని వాక్యాన్ని జతచేస్తూ దాని బోధలలో “పెరుగుతూ ఉండడం” అవసరం (మత్తయి 28:19-20).

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl