శిశు బాప్తిస్మ ప్రసంగము
ప్రసంగ అంశము : “చిన్న పిల్లలను నా యొద్దకు రానియ్యుడి”
సువార్త పాఠం : మార్కు 10:13–16, 13తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయన యొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. 14యేసు అది చూచి కోపపడి–చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవుని రాజ్యము ఈలాటివారిదే. 15చిన్నబిడ్డవలె దేవుని రాజ్యము నంగీకరింపని వాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి 16ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.
మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక. ఆమెన్.
క్రీస్తులో ప్రియమైన సహోదర సహోదరీలారా,
ఈ రోజు మనం పవిత్ర బాప్తిస్మం అనే విలువైన బహుమతి వైపు, ముఖ్యంగా, శతాబ్దాలుగా హృదయాలను మనస్సులను కదిలిస్తున్న ప్రశ్న వైపు మన హృదయాలను మళ్లిద్దామ్ : మనం శిశువులకు/ పిల్లలకు బాప్తిస్మం ఎందుకని ఇస్తాం?
మనం శిశువులకు/ పిల్లలకు బాప్తిస్మం ఎందుకని ఇస్తాం?
- బాప్తిస్మం అనేది మన పని కాదు, అది దేవుని పని
ఈ ప్రపంచంలో, ప్రతిదీ మనం చేసే వాటి పై ఆధారపడి ఉంటాయి – మన ఎంపికలు, మన అవగాహన, మన నిబద్ధత. కాని సువార్తలో, ప్రతిదీ దేవుడు చేసిన/ చేసే వాటి పై ఆధారపడి ఉంటుంది.
లూథర్ స్మాల్ కేటకిజంలో “బాప్తిస్మము వట్టి నీళ్లు మాత్రమే కాదు, కాని అది దేవుని ఆజ్ఞ చేత వాడబడి దేవుని వాక్యంతో కలిసిన నీరైయున్నది” అని మనకు గుర్తు చేస్తాడు.
మనం ఆ నీటిని తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామంలో పోసినప్పుడు, రక్షించేది పాస్టర్ చేయి కాదు – అది దేవుని చేయి.
అంటే బాప్తిస్మం అనేది మానవ సమర్పణకు లేదా వాని నిర్ణయానికి సంబంధించిన క్రియ కాదు. ఇది దైవిక చర్య. బాప్తిస్మంలో పనిచేసేది దేవుడే. ఆయన పిలుస్తాడు, క్షమిస్తాడు, కడుగుతాడు, దత్తత తీసుకుంటాడు మరియు కొత్త జన్మనిస్తాడు.
- అందరూ పాపంలో జన్మించారు – పిల్లలకు కూడా కృప అవసరం
కీర్తన 51:5, “నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెనని” చెప్తుంది.
మనం మొదట అవిధేయత చూపినప్పుడు పాపులుగా మారం – మనం పాపంలో జన్మించాము కాబట్టి పాపం మన పతనమైన మానవ స్వభావంలో భాగమై ఉంది.
అందుకే పిల్లలకు కూడా దేవుని కృప మరియు శుద్ధీకరణ అవసరం.
బాప్తిస్మం అనేది వారసత్వంగా వచ్చిన పాపాన్ని కడిగివేయడానికి మరియు కొత్త జీవితం అనే బహుమతిని ఇవ్వడానికి దేవుడు చేసిన మార్గం.
యోహాను 3:5లో యేసు –ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని” చెప్పాడు.
అంటే ఎవరూ కూడా – శిశువులు/ చిన్న పిల్లలు కూడా – ఈ అవసరం నుండి లేదా ఈ వాగ్దానం నుండి మినహాయించబడ లేదు.
- వాగ్దానం మీకు మరియు మీ పిల్లలకు
పెంతెకొస్తు రోజున పేతురు బోధించినప్పుడు, పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో” చెప్పాడు (అపొస్తలుల కార్యములు 2:38–39).
దేవుని వాగ్దానం అందరికీ – పురుషులు మరియు స్త్రీలు, వృద్ధులు మరియు యువకులు, శిశువులు పిల్లలు మరియు పెద్దలు అందరికి.
బాప్టిజం అనేది అర్థం చేసుకోగల లేదా స్వయంగా నిర్ణయం తీసుకొని ఒప్పుకోగల వారి కోసం మాత్రమే అయితే, అది మన హేతువు యొక్క క్రియగా ఉంటుంది – అప్పుడది మనం చేసేదిగా /ఆచరించే క్రియగా ఉంటుంది తప్ప – దేవుడు ఇచ్చేదిగా ఉండదు.
విశ్వాసం కూడా పరిశుద్ధాత్మ బహుమతి అని లేఖనాలు పదే చెప్తున్నాయి. ఎఫెసీయులు 2:8–9, మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు అని చెప్తుంది.
ఆయన ఆ బహుమతిని ఒక బిడ్డకు కూడా ఇవ్వొచ్చు, మరియ స్వరం వినిపించినప్పుడు ఎలీసబెతు గర్భంలో ఉన్న ఆ శిశువులో దేవుడు విశ్వాసాన్ని సృష్టించినట్లుగా ఆ బిడ్డ గంతులు వేసిందని (లూకా 1:41) చెప్తుంది.
- యేసు పిల్లలను స్వాగతించాడు
శిష్యులు పిల్లలను గద్దించినప్పుడు, యేసు కోపంగా, “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు” అని అన్నాడు.
తప్ప “వారు పెద్దవారైనప్పుడు మరియు అర్థం చేసుకున్నప్పుడు వారిని రానివ్వండి” అని ఆయన చెప్పలేదని గమనించండి.
“వారిని ఆటంకపరచవద్దు” అని ఆయన అన్నాడు, ఎందుకంటే దేవుని రాజ్యము ఈలాటివారిదే.
శిశువులకు బాప్తిస్మం ఇవ్వడం అంటే యేసు ఎప్పుడూ ఆజ్ఞాపించని దానిని ఆయన వాక్యానికి జోడించడం కాదు – అది ఆయన మాటలకు లోబడటం.
శిశువులను/ చిన్నపిల్లలను బాప్తిస్మం పుచ్చుకోకుండా ఆపడం అంటే యేసు వారిని తీసుకొని, వారిని ఆశీర్వదించి, వారిని తన సొంతమని పిలిచే ఆయన చేతుల్లోకి ప్రవేశించకుండా వారిని నిరాకరించడమే.
- బాప్తిస్మంలో ఏమి జరుగుతుంది
శిశువు లేదా పెద్దవారి బాప్తిసంలో:
- దేవుడు పాపాన్ని క్షమిస్తాడు (అపొస్తలుల కార్యములు 22:16).
- దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడు (తీతు 3:5).
- దేవుడు ఆ వ్యక్తిని క్రీస్తు మరణం మరియు పునరుత్థానంలోకి తీసుకువస్తాడు (రోమీయులు 6:3–4).
- బాప్తిస్మం తీసుకున్న వారిని దేవుడు తన కుటుంబంలోకి దత్తత తీసుకుంటాడు (గలతీయులు 3:26–27).
ఇది ప్రతీకాత్మకమైనది కాదు — ఇది మతకర్మ.
నిజంగా ఏదో జరుగుతుంది: పాత వ్యక్తిత్వం చనిపోతుంది మరియు దేవుని కొత్త బిడ్డ పుడుతుంది.
- బాప్తిస్మం మరియు విశ్వాసం జీవితంలో కొనసాగుతాయి
బాప్తిస్మం పొందిన బిడ్డ బోధన, ఆరాధన మరియు వాక్యంలో జీవితం ద్వారా విశ్వాసంలో ఎదగవలసి ఉంటుంది.
తల్లిదండ్రులు మరియు సమాజం ఈ బిడ్డ – ప్రార్థించేటట్లు, బోధించేటట్లు మరియు దేవుని ప్రేమకు ఉదాహరణలుగా జీవించేటట్లు ఆ విశ్వాసాన్ని ఈ శిశువులో పెంపొందించాలి.
లూథర్ చెప్పినట్లుగా, ప్రతిరోజు మనలోనున్న పాత ఆదాము మనో దుఃఖము పశ్చాత్తాపము చేత దాని దుష్టక్రియలు మరియు దురేచ్ఛలతో మునిగి చావవలెను. దేవుని సముఖమందు నీతిమంతుడుగాను పరిశుద్దుడుగాను ఎల్లప్పుడూ జీవించుటకు క్రొత్త మనుష్యుడు ప్రతిరోజు లేవవలెను.
బాప్తిస్మం ముగింపు కాదు – ఇది దేవునితో జీవితానికి ప్రారంభం.
- బాప్తిస్మం యొక్క ఓదార్పు
బాప్తిస్మం ఎంతో ఓదార్పునిస్తుంది!
సందేహాలు తలెత్తినప్పుడు, అపరాధం తిరిగి వచ్చినప్పుడు, మనం విఫలమైనప్పుడు – “నేను బాప్తిస్మం పుచ్చుకొన్నాను!” దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. ఆయన నామం నాపై ఉంది. ఆయన కృప నన్ను కప్పివేస్తుంది అని చెప్పుకొందాం.
క్రీస్తులో బాప్తిస్మం తీసుకున్న బిడ్డ ప్రేమించబడటం మాత్రమే కాదు – అతడు లేదా ఆమె ముద్రించబడి, ఎంపిక చేయబడి, శాశ్వత జీవిత వాగ్దానంలో భద్రంగా ఉన్నారు.
ముగింపు
ప్రియమైన సోదర సోదరీమణులారా,
బాప్తిస్మం – శిశు బాప్తిస్మం – మనిషి కనిపెట్టిన సంప్రదాయం కాదు.
ఇది కనిపించే సువార్త: దేవుడు తన పిల్లలను, చిన్నవారి నుండి గొప్పవారి వరకు పొందటానికి దయతో దిగి వస్తాడు.
కాబట్టి మనం మన పిల్లలను నీటి వద్దకు తీసుకువచ్చినప్పుడు, యేసు ఆజ్ఞాపించిన మరియు వాగ్దానం చేసిన వాటిని చేస్తున్నాము.
“చిన్న పిల్లలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు, ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పిన రక్షకుని వద్దకు మనం వారిని తీసుకువస్తున్నాం.
పవిత్ర బాప్తిస్మం బహుమతికై దేవునికి కృతజ్ఞతలు —
అక్కడ ఆయన మనలను తనవారిగా చేసుకుంటున్నాడు, మనలను శుభ్రపరుస్తున్నాడు మరియు మనకు శాశ్వత జీవితాన్ని ఇచ్చాడు.
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును గాక, ఆమెన్.
ఈ రోజు మనం (శిశువు పేరు) ———– బాప్తిసం ఇవ్వడానికి సమావేశమయ్యాం. ఇది ఇక్కడ మరియు పరలోకంలో చాలా సంతోషకరమైన సందర్భం. —————– ఈ బిడ్డ తల్లిదండ్రులు ధన్యులు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.
