
కయీను భార్య ఎవరు?
కయీనుకు భార్య ఉందని బైబిలు మనకు చెబుతుంది (ఆదికాండము 4:17), కాని అది ఆమె పేరునుగాని లేదా ఆమె నేపథ్యాన్ని గురించిగాని స్పష్టంగా చెప్పటం లేదు.
సంశయవాదులు గతంలో క్రైస్తవులకు జ్ఞానం లేకపోవడం వల్ల విశ్వాసులను వెర్రివారిగా చూడడానికి ప్రయత్నించారు, కొన్నిసార్లు విజయం సాధించారు. కయీనుకు భార్య ఉంది. ఆదికాండము 4:17 కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను. ఆదాము హవ్వలకు ఇతర పిల్లలు ఉన్నారని ఆదికాండము చెబుతున్న వాస్తవంలో ఈ పజిల్‌కు పరిష్కారం కనుగొనబడింది. షేతు జన్మించిన తరువాత, అతడు కుమారులను కుమార్తెలను కనెను, ఆదికాండము 5:4. కాబట్టి, కయీను తన సోదరిని లేదా మేనకోడలిని వివాహం చేసుకొనే అవకాశం ఉంది. కయీను తన సోదరిని వివాహం చేసుకుని ఉండవచ్చనే ఆలోచనను కొందరు వ్యతిరేకిస్తారు.
ఆదికాండాన్ని లిటరల్ హిస్టరీగా అంగీకరించని కొందరు, కయీనుకు భార్యను సమకూర్చడం కోసం మరొక జాతి మానవులు లేదా సెమీ మానవులు ఉండి ఉండొచ్చని వాదిస్తారు. మరొక జాతి మానవులు లేదా సెమీ మానవులు అక్కడ లేరు.
ఆదాము హవ్వలు మొదటి మానవులు కాబట్టి, మానవులందరూ వారి నుండే వచ్చారు. మొదటి తరాలలో, భూమిని నింపడానికి తోబుట్టువులు ఒకరినొకరు వివాహం చేసుకోవలసి వచ్చింది. ఆ సమయంలో ఇది తప్పు లేదా జీవశాస్త్రపరంగా ప్రమాదకరమైనదిగా పరిగణించబడలేదు, ఎందుకంటే మానవ జన్యు సమూహం చాలా స్వచ్ఛమైనది, తక్కువ ఉత్పరివర్తనలు లేదా లోపాలు ఉన్నాయి. జీవసంబంధమైన వైకల్యాలతో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉన్నందున నేటి మన కాలపు చట్టాలు దానిని ఖండిస్తున్నాయి. కాని ప్రపంచపు తొలి చరిత్రలో పరిస్థితి అలా లేదు. దగ్గరి బంధువులు వివాహం చేసుకోకూడదని దేవుని చట్టం మోషే కాలం వరకు ఇవ్వబడలేదు (లేవీయకాండము 18-20).
మానవాళి ప్రారంభంలో, అలాంటి కలయికలు అవసరమైనవి మరియు నైతికంగా తప్పు కాదు, ఎందుకంటే: ఆదాము వంశానికి వెలుపల వేరే వ్యక్తులు లేరు. దేవుడు వారిని “మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి” అని ఆజ్ఞాపించాడు (ఆదికాండము 1:28). మానవాళి తొలినాళ్లలో, దేవుడు తరువాత మోషే ధర్మశాస్త్రంలో దగ్గరి బంధువుల వివాహాలను నిషేధించక ముందు ఇది అవసరం.
యుగాలుగా మనుషుల జన్యువులలో లోపాలు ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ జన్యుపరమైన లోపాలు మానవులందరికీ ఒకేలా ఉండవు. తల్లి తండ్రుల బంధం దగ్గరైతే, కొన్ని తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి తండ్రుల జన్యువులలో లోపాలు ఉన్నప్పుడు పిల్లలకు శారీరక వైకల్యాలు సంభవిస్తాయి. అదే దగ్గరి సంబంధము కానట్లయితే అది చాలా తక్కువగా ఉంటుంది. లోపం తల్లిదండ్రుల నుండి వారసత్వంగా సంక్రమించే అవకాశం ఉంది. అది వారి పిల్లలలో కనిపిస్తుంది. ఆదాము హవ్వల వంటి తొలి మానవుల విషయంలో – వాళ్ళు పరిపూర్ణంగా సృష్టించబడినవారు – వారి తక్షణ వారసుల విషయంలో, ఈ జన్యుపరమైన లోపాలు ఉద్భవించడానికి చాలా తక్కువ సమయం ఉంది. చాలా సన్నిహిత బంధువులు వివాహం చేసుకున్నప్పటికీ వైకల్యానికి చాలా తక్కువంటే తక్కువ అవకాశం ఉంది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl