Welcome to A voice of a Shepherd! Rev. Kurapati Vijay Kumar M.Th, here, and I am all about help you as a Lutheran Theologian and a Linguistic in Biblical Languages with Videos and Articles and Questions and Answers and Commentaries on the Books of the Bible. It’s not JUST about Video Creation. Answering Basic questions of Christian faith, Scriptural Explanations and Encouraging, Motivating to know the truth. It’s not about opinions exactly.

యేసు పరిచర్య ప్రారంభం నుండి A.D. 27, A.D. 325 వరకు విస్తరించిన ఆదిమ సంఘము, ప్రధానంగా భౌగోళిక ఆధారంగా విభజించబడింది. వివిధ ప్రాంతీయ సంస్కృతులు మరియు ఆచారాల ఆధారంగా యేసు బోధనల యొక్క ఆరాధన శైలులు మరియు వివరణలు మారుతూ ఉండేవి.

ఈ సమయంలో క్రైస్తవ వేదాంతశాస్త్రంలో విభేదాలు కూడా ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన ప్రారంభ విభేదా లలో ఒకటి, నాల్గవ శతాబ్దం ప్రారంభంలో ఏరియన్ వివాదం, ఇది దేవునితో యేసు యొక్క సంబంధంపై చర్చిని విభజించింది. ఈజిప్టు లోని అలెగ్జాండ్రియాకు చెందిన ప్రీస్ట్ ఏరియన్స్, యేసు “జన్మించబడ్డాడు” లేదా దేవునిచే తీసుకురాబడినందున, అతడు  దేవుని కంటే తక్కువ దైవత్వం ఉన్నవాడు అని చెప్పాడు. కాని అలెగ్జాండ్రియన్ వేదాంతవేత్త అయిన అతనేసియస్, యేసు “దేవుడు శరీరధారి అగుట” అని చెప్పాడు.

ఇది రోమన్ సామ్రాజ్యంలో పెద్ద తిరుగుబాటుకు కారణమైంది. ఇది రోమన్ సామ్రాజ్యంలోని క్రైస్తవులను రెండు భాగాలుగా విభజించింది. కౌన్సిల్ ఆఫ్ నైసియా — క్రీ.శ. 325లో కాన్స్టాంటైన్ I చక్రవర్తి సారధ్యములో కూడుకొన్న వేదాంతవేత్తలు మరియు పండితుల సమూహం — చివరికి ఏరియన్స్ కు వ్యతిరేకంగా నిలిచింది. చర్చి యొక్క ఈ అధికారిక అభిప్రాయంను ఏకీభవించని క్రైస్తవులు ఈ అంశంపై విభజించబడ్డారు.

తర్వాత, 1054లో, తూర్పు ఆర్థోడాక్స్ క్రైస్తవులు పాశ్చాత్య రోమన్ కాథలిక్కుల నుండి విడిపోయారు. మతకర్మ లను తీసుకోవ డంపై రెండు సమూహాలు విభేదించాయి (great schism)- మతపరమైన చిహ్నాలు నమ్మినవారికి దైవిక కృపను తరలిస్తా యని నమ్మడం పై మరియు ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, తూర్పు ఆర్థోడాక్స్ క్రైస్తవులు, ప్రిస్ట్స్ బ్రహ్మచారిగా ఉండా లనే నియమాన్ని మరియు తూర్పు చర్చి పై రోమన్ పోప్‌కు అధికారం ఉందనే విషయముపై వారిరువురు విభేదించారు.

ముగ్గురు తామే నిజమైన పాపల్ వారసులమని పేర్కొనుటనుబట్టి 1378లో కాథలిక్ చర్చిలోనే వెస్ట్రన్ స్కిజం అని పిలువబడే తాత్కాలిక విభేదం పుట్టింది. ఈ విభజన దాదాపు 40 సంవత్సరాలు కొనసాగింది మరియు 1417లో పరిష్కరించబడే సమయానికి, ప్రత్యర్థి పోప్‌లు పాపల్ కార్యాలయం యొక్క ప్రతిష్టను గణనీయంగా దెబ్బతీశారు.

ఈ కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, హెరెటిక్స్ పై సైనిక చర్యలను, శిక్షలను అమలుచేయుట ద్వారా కాథలిక్ చర్చి ఇతర సంభావ్య క్రైస్తవ శాఖలను విజయవంతంగా అణిచివేసింది. ప్రజల విశ్వాసాన్ని పరీక్షించుటకు క్రాస్ ఎక్సమినేషన్ (విచారణలు) అనే కొత్త వ్యవస్థను కాథలిక్ చర్చి ప్రవేశపెట్టింది. లౌకిక పాలకుల మద్దతు తో, హెరెటిక్స్ అగ్నికి ఆహుతి చేయబడవచ్చు లేదా వారి నమ్మకాలను తిరస్కరించి చర్చిలో తిరిగి చేరడానికి అవకాశమిచ్చారు.

కాని 1517లో ప్రొటెస్టంట్ సంస్కరణ తర్వాత, డినామినేషన్స్ సంఖ్య గణనీయముగా పెరగడం ప్రారంభ మైంది. సంస్కరణ – అనేక సంఘటనల ద్వారా ప్రేరేపించబడింది, ముఖ్యంగా మార్టిన్ లూథర్ యొక్క 95 థీసెస్ – వ్యక్తిగత విశ్వాసాన్ని నొక్కి చెప్పింది. ఈ ఉద్యమం బైబిల్ యొక్క వ్యాఖ్యానాలకు, కృప, పాప క్షమాపణ మరియు పరలోక ప్రవేశం అన్ని క్యాథలిక్ మతంలో ప్రిస్ట్స్ ద్వారా మధ్యవర్తిత్వం వహించుచుండుటను బట్టి అందుకు ప్రతిస్పందనగా మొదలయ్యింది. లూథర్ మరియు అతని అనుచరులు చర్చి అనేది హైర్ఆర్కి (hierarchy) కాదని, ప్రిస్ట్స్ మరియు పోప్‌తో సహా ప్రజలందరిపై అంతిమ అధికారం లేఖనాలదే అని అనేక మైన మతపరమైన పద్ధతులు మరియు పాప విముక్తి కోసం చర్చికి డబ్బు చెల్లిం చడం (indulgences) అనేవి అనైతికమైనవని పేర్కొన్నారు.

విభేదాలు విభజనగా ప్రత్యర్థి తెగల మధ్య హింసాత్మక సంఘర్షణలకు దారితీశాయి. సంస్కరణలు పాపల్ అధికారాన్ని సవాలు చేసిన తర్వాత, ప్రజలు అవినీతి లేదా సందేహాస్పదమైన ఆచారాల గురించి మతపర మైన అధికారులను ప్రశ్నించడం ప్రారంభించారు.

1534లో హెన్రీ VIII చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను ప్రారంభించినప్పుడు ఇతర ప్రొటెస్టంట్ తెగలు అధికారం కోసం విడిపోయాయి. అతను ఇంగ్లాండ్ యొక్క రాజకీయ స్వయంప్రతిపత్తిని స్థాపించాలనుకున్నాడు. దానికి ఒక మార్గం రోమ్ నుండి మతపరమైన స్వయంప్రతిపత్తి ని తీసుకోవడం. చర్చి మంజూరు చేయడానికి నిరాకరిం చిన విడాకులు కూడా అతను ప్రముఖంగా కోరుకున్నాడు.

ఈ సంస్కరణ మరింత క్రైస్తవ శాఖలకు నాంది పలికింది. 17వ శతాబ్దం నాటికి, సమకాలీన పదం డినామినే షన్ అనేది మతపరమైన శాఖలను వివరించడానికి ఉపయోగించడం ప్రారంభమైంది. ప్రొటెస్టంట్లు రోమన్ కాథలిక్ చర్చిని విమర్శించ డానికి లేఖనాలను ఉపయోగించారు, ఏ విశ్వాసి అయినా లేఖనాలను చదవగల రని మరియు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ ఒక సమస్య ఉద్భవిం చింది: లేఖనాల యొక్క ఎవరి వివరణ సరైనది? అనే ప్రశ్న తలెత్తినది. విశ్వాసులు లేఖనాలను మరియు మతకర్మలను చర్చించడం ప్రారంభించుటను బట్టి అనేక బైబిల్ వివరణలు, ఆరాధన మార్గాలు మరియు సంస్థాగత నిర్మాణాల ఆధారంగా చర్చిలు ఏర్పడ్డాయి మరియు విడిపో యాయి. ఈ చర్చల నుండి, ప్రెస్బిటేరియన్లు, మెన్నోనైట్‌లు, బాప్టిస్ట్‌లు మరియు క్వేకర్‌లు వంటి వర్గాలు రూట్ తీసుకున్నాయి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులలో 45,000 కంటే ఎక్కువ డినామినేషన్లు ఉన్నాయి

బైబులులోని పాత నిబంధనను హీబ్రూ భాషలో క్రొత్త నిబంధనను గ్రీకు భాషలో దేవుడు వ్రాయించి యున్నాడు, ఆ భాషలను దేవుడు ఎన్నుకొన్నాడు. భాషకు వ్యాకరణము కూడా ఉంటుంది. ఠక్కున మీరు బైబులు తీసి మీకు నచ్చిన ఒక వచనాన్ని చదివి దాని వ్యాకరణాన్ని చెప్పండి. అంటే అది వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఏ కాలానికి సంబందించినది? అక్కడ ఉన్న సబ్జెక్టు, ఆబ్జెక్ట్, ప్రిపోజిషన్, ఆర్టికల్, వెర్బ్, ఆక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఏంటి అనే విషయాన్ని, ప్రతి పదానికున్న ప్రాముఖ్యతను వ్యాకరణ సహితముగా చెప్పండి. ఎందుకంటే, ఆ వచనంలో దేవునికి మాత్రమే సంబందించినది (థియోలజి) ఏమన్నా ఉందా? లేక ఏదైనా సిద్ధాంతమును (సిస్టమాటిక్ థియోలజి) గురించి అది మాట్లాడు తూవుందా? ఆ వచనంలో ఉన్న చరిత్రాత్మికమైన (హిస్టారికల్ థియోలజి) సెటప్ ఏంటి? (అంటే, అప్పటి సమాజము ఎలా వుంది? (సంస్కృతిపరంగా, రాజకీయపరంగా, ప్రజల పై అప్పటి ప్రభావము, ఎందుకని ఈ వచనము చెప్పబడింది) అనేది తెలియాలంటే ఇది ప్రాముఖ్యము. ఈ వచనాన్ని నేటి క్రైస్తవ సమాజానికి ఏవిధముగా వర్తింపజేస్తాము (పాస్టోరల్ థియోలజి) అనేది కూడా తెలియాలి, ఇది చాల చాల ప్రాముఖ్యము. మీ బైబిలే ఎన్నోసార్లు చదివి వుంటారు, అంతా మీకు తెలుసు. అయినా సరే ఇబ్బందిగా క్రొత్తదిగా వుంది కదూ!

ఈ రోజు క్రైస్తవత్వము వేలాది డినామినేషన్స్ గా విభజింపబడియున్నది. ఏ మతమైనా తనకు తానుగా సిధ్ధాంతపరంగా వ్యతిరేకించుకొంటూ వేలాది డినామినేషన్స్ గా విభజింపబడి ఉంటుందా? ఈ విభజనలకు కారకులెవరు? ఒక్కొక్కసారి క్రైస్తవత్వములోని ఇన్ని డినామినేషన్స్ ని చూస్తూవుంటే చాలా భాధేస్తు ఉంటుందండి. వాక్యంలో సరియైన శిక్షణ లేకుండా క్రైస్తవ సమాజము ఉండటం, క్రీస్తును క్రీస్తు ప్రేమను ప్రతిబింబించ లేకపోవడం, వాదనలు, బైబిలుకు విభిన్నమైన వివరణలు, మనవల్లనే క్రీస్తుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడటమే కాకుండా మన మతాన్ని మనమే చులకన చేసుకొంటూ దాని బోధలను పలుచన చేస్తూవున్నాం. 

ఒక లూథరన్ వేదాంతవేత్తగా మరియు బైబిల్ భాషలలో భాషావేత్తగా మీకు సహాయపడాలనేదే నా ఉదేశ్యము. ఇది వీడియోలు మాత్రమే కాదండి, ఇది క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలకు సమాధాన మివ్వడం, లేఖనాల వివరణలు, ప్రోత్సహించడం మరియు సత్యాన్ని తెలుసుకొనేటట్లు ప్రేరేపించడం. ఇది ఖచ్చితంగా అభిప్రాయాలు అయితే మాత్రం కాదు. ఆలకించండి, చదవండి. లేఖనాలలో బలపడండి. మీకు మీరు, మీ కుటుంబాలకు, అనేకులకు దీవెనకరముగా ఉండాలన్నదే నా ఆశ. ప్రోత్సహించండి.  

ఇట్లు,

క్రీస్తు దాసుడు, క్రీస్తులో మీ సహోదరుడు, రెవ. కూరపాటి విజయకుమార్ M.Th;