సమస్త మానవాళి నుండి తన స్వజనులుగా కొందరిని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు?
సమస్త మానవాళి నుండి తన స్వజనులుగా కొందరిని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు?
ఎఫెసీయులు 1:3-14, 3మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. 4-6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 7దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. 8-9కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మన యెడల విస్తరింపజేసెను. 10ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవే గాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను. 11-12మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తికలుగజేయ వలెనని, దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. 13మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. 14దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
రోమీయులు 8:29-30, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.
జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు సమస్త మానవాళి నుండి తన సొంత ప్రజలుగా కొందరిని ఎన్నుకున్నాడు. (ఎఫెసీయులు 1:4-5) ఈ వాక్యభాగం దేవుని ఎన్నిక మరియు విశ్వాసులను తన కుటుంబంలో భాగం చేసుకునేందుకు ఆయన ముందస్తు నిర్ణయం యొక్క శాశ్వత స్వభావాన్ని హైలైట్ చేస్తుంది.
“ఎన్నిక” అనే సిద్ధాంతం, దేవుడు కొందరిని తన సొంత జనులుగా ఎన్నుకున్నాడని, వారి స్వంత యోగ్యత లేదా క్రియల ఆధారంగా దేవుడు వారిని ఎన్నుకోలేదని, ఆయన దైవిక సంకల్పం మరియు ఉద్దేశ్యం ప్రకారం ఆయన వారిని ఎన్నుకొన్నాడని బోధిస్తుంది. దేవుడు తన ప్రజలను ఎన్నుకోవడం అనేది పాపులను రక్షించుట ద్వారా తనకు మహిమ కలుగు నిమిత్తమై ఆయన ప్రేమ, కృప మరియు కోరిక ద్వారా ప్రేరేపించబడింది.
బైబిల్ అంతటా, దేవుని ఎలెక్టీవ్ గ్రేస్ యొక్క ఉదాహరణలను వివిధ వ్యక్తులు మరియు దేశాల జీవితాలలో, అబ్రహం మొదలుకొని మరియు ఇశ్రాయేలు మరియు దేవుని కుటుంబంలోకి అంటుకట్టబడిన అన్య విశ్వాసుల వరకు, మనం చూస్తాం. దేవుడు తన ప్రజలను ఎన్నుకోవడం ఆయన విశ్వాస్యత, స్థిరమైన ప్రేమ మరియు మానవాళి కోసం తన విమోచన ప్రణాళికను నెరవేర్చిన నిబద్ధతకు నిదర్శనం.
విశ్వాసులుగా, మనము ఆయన స్వజనులుగా దేవుడు మనలను ఎన్నుకొనియున్నాడని, ఆయన ప్రియమైన పిల్లలముగా మన స్వాస్థ్యమునకు దత్తతకు ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు దత్తతకు సంచకరువుగా ఉన్నాడని తెలుసుకోవడం ఆదరణను నిశ్చయతను ఇస్తూఉంది. ఎఫెసీ 1:13-14, మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని ద్వారా మన ఎన్నిక అనేది శాశ్వతత్వం నుండి శాశ్వతత్వం వరకు ఆయన మన పట్ల చూపిన అచంచలమైన ప్రేమ మరియు విశ్వాస్యతను బట్టి మన భద్రతకు, ఆశకు మరియు విశ్వాసానికి మూలంగా ఉంది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl