
మోషే ధర్మశాస్త్రములోని మొదటి ఆజ్ఞ
మొదటి ఆజ్ఞ : మేము తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
దీనికి అర్ధమేమి: మనము సమస్తమైన వాటికంటే దేవుని భయపడి, ఆయనను ప్రేమించి నమ్మి యుండవలెను.
1. మొదటి ఆజ్ఞయందు దేవుడు తన మహిమను గురించి మనకు ఏమి బోధించుచున్నాడు?
యెషయా 42:8, యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చు వాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.
యెషయా 45:21, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు.
మత్తయి 4:10, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.
జవాబు: మనుష్యులకంటే లేక వస్తువులకంటే దేవునికే మహిమను ఇవ్వవలెనని ఆయన కోరుకొంటున్నాడని దేవుడు మనకు బోధించుచున్నాడు.
2. మనము సమస్తమైన వాటికంటే దేవునికి మహిమను ఎలా ఇస్తాం?
దానియేలు 3:1-18. (ముగ్గురు యవ్వనస్థులు నెబుకద్నెజరు నెలకొల్పిన ప్రతిమను పూజించుటకంటె మండుచున్న అగ్ని గుండము లోనికి వెళ్లిరి).
ఆదికాండము 39:1-9. (యేసేపు పోతీఫరు భార్యకు లోబడుటకంటె దేవునికి లోబడెను. 9వ వచనాన్ని ముఖ్యముగా గమనించండి, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును).
సామెతలు 8:13. యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే.
కీర్తన 119:11. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను.
కీర్తన 86:11. యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.
1A జవాబు: మనుష్యుల మాటలకంటే మరియు ఆజ్ఞలకంటే పైగా దేవుని మాటను ఆజ్ఞను ఉంచుట ద్వారా మనము సమస్తమైన వాటికంటే ఆయనకే మహిమను ఇస్తున్నాం. (సమస్తమైన వాటికంటే దేవునికే భయపడుట)
హెబ్రీయులకు 11:24-26. (మోషేకు ఐగుప్తు యొక్క ఖ్యాతికంటె లేక ధనముకంటే దేవుడే బహు ప్రాముఖ్యుడై ఉండెను).
ఆదికాండము 22:1-19. (అబ్రాహామునకు తన ఏకైక కుమారుడైన ఇస్సాకుకంటే దేవుడే ప్రియుడై ఉండెను).
మత్తయి 22:37. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునదియే.
కీర్తన 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకము లోనిది ఏదియు నా కక్కరలేదు.
2B జవాబు: మనుష్యులకంటే దేవునిని బహు ప్రియముగా నెంచుట ద్వారా మనము సమస్తమైన వాటికంటే ఆయనకే మహిమను ఇస్తున్నాం. (సమస్తమైన వాటికంటే దేవునిని అధికముగా ప్రేమించుట).
ఆదికాండము 13, 14. (అబ్రాహాము లోతునకు తాను ఉండవలసిన ప్రాంతమును కోరుకొనుటకు మొదటి అవకాశమును ఇచ్చినప్పుడును మరియు రక్షించినప్పుడును, అబ్రాహాము దేవుని యెడల తన నమ్మకాన్ని చూపించాడు).
దానియేలు 6:1-23. (సింహపు బోనులో నుండి తనను కాపాడుటకు దానియేలు దేవునిని నమ్మాడు. ప్రత్యేకముగా 23వ వచనాన్ని గమనించండి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు).
దానియేలు 3:1-18. (ముగ్గురు యవ్వనస్థులు అగ్ని గుండములో నుండి తమ్మును దేవుడు రక్షించునని నమ్మరు. ప్రత్యేకముగా 17వ వచనాన్ని గమనించండి. మేము సేవించుచున్న దేవుడు ….. మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు).
1 సమూయేలు 17:32-50. (గొల్యాతుపై విజయము పొందుటకు దావీదు దేవునిని నమ్మాడు. ప్రత్యేకముగా 37, 45 వచనాలు గమనించండి).
కీర్తన 37:5, 40. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము ….. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చియున్నారు.
యెషయా 50:10. వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.
కీర్తన 124:8. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
3C జవాబు: మనుష్యులకంటే వస్తువులకంటే ఎక్కువగా సహాయము కొరకు దేవునిపై ఆధారపడటం ద్వారా మనము సమస్తమైన వాటికంటే ఆయనకే మహిమానిస్తున్నాం. (సమస్తమైన వాటికంటే అధికముగా దేవునిని నమ్మియుండుట).