యేసు ఎవరి కోసం జీవించి మరియు మరణించాడు?
యేసు ఎవరి కోసం జీవించి మరియు మరణించాడు? రోమా 5:18; 2 కొరింథీయులు 5:19; 1 యోహాను 2:2.
రోమా 5:18, కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.
2 కొరింథీయులు 5:19, అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
1 యోహాను 2:2, ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.
యేసుక్రీస్తు సమస్త మానవాళి కోసం జీవించి మరియు మరణించాడు. ఆయన జీవితం, బోధనలు, మరణం మరియు పునరుత్థానం ఒక నిర్దిష్ట సమూహానికి లేదా దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. కాని మానవ జాతులతో, నేపధ్యాలతో సంబంధం లేకుండా అందరికీ అందించబడ్డాయి. అపొస్తలుడైన పౌలు 1 తిమోతి 2:6లో యేసు “అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను” అని ధృవీకరిస్తున్నాడు.
యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని చెప్తూవుంది. ఈ మాటలు దేవుని ప్రేమ మరియు కృప యొక్క సమగ్ర స్వభావాన్ని ప్రదర్శిస్తూ అందరినీ చేరుకొంటూ ఉన్నాయి మరియు యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా రక్షణ బహుమతిని పొందమని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాయి.
మార్కు 10:45లో యేసు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెనని, చెప్పాడు. ఆయన లక్ష్యం నశించిన వారిని వెతకడం మరియు రక్షించడం (లూకా 19:10, నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను) మరియు లోక పాపాల కొరకు తనను తాను బలిగా అర్పించుకోవడం (1 యోహాను 2:2, ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు).
కాబట్టి, యేసు జీవితం, మరణం మరియు పునరుత్థానం సమస్త మానవాళి యొక్క రక్షణ మరియు విమోచన కోసం ఆఫర్ చెయ్యబడ్డాయి. ఆయనను విశ్వసించే వారందరి పట్ల దేవుని ప్రేమ, దయ మరియు కృపను ప్రదర్శిస్తూ ఉన్నాయి. సిలువపై యేసు త్యాగం దాని ఫలితాలు సార్వత్రికమైనవి. పశ్చాత్తాపపడి, ఆయనను విశ్వసించి, ఆయన ద్వారా నిత్యజీవ బహుమతిని పొందే ప్రతి వ్యక్తికి అవి విస్తరించబడ్డాయి.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl