యేసు రక్షణ కార్యము యొక్క ఆశీర్వాదాలను మనం ఎందుకని పొందుతాం? ఎలా పొందుతాం?
యేసు రక్షణ కార్యము యొక్క ఆశీర్వాదాలను మనం ఎందుకని పొందుతాం? ఎలా పొందుతాం?
ఎఫెసీయులు 2:8-9, మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.
రోమీయులు 4:2-5, అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను పనిచేయు వానికి జీతము ఋణమేగాని దానమని యెంచబడదు. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.
రోమీయులు 9:30-32, అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు, వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి.
మన ప్రభువు మరియు రక్షకుడిగా యేసుపై విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన రక్షణ కార్యం యొక్క ఆశీర్వాదాలను పొందుతాం. రక్షణ అనేది దేవుని నుండి వచ్చిన బహుమతి అని, యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా కృప ద్వారా అనుగ్రహింపబడిందని బైబిల్ బోధిస్తుంది, (ఎఫెసీయులు 2:8-9).
మనం యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు, మనం దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాం (ప్రకటించబడ్డాం). మన పాపాలు క్షమించబడ్డాయి. మనం ఆయనతో సమాధానపరచబడ్డాం. కాబట్టే రోమా 5:1 విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియున్నామని మరియు యేసుక్రీస్తు నందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులై యున్నారను నిశ్చయతను ఇస్తూ ఉన్నాయి, గలతీయులు 3:26.
యేసు సిలువపై చేసిన రక్షణ కార్యం మన పాపాలకు మూల్యం చెల్లించి మనల్ని దేవునితో సమాధాన పరిచింది. ఆయన త్యాగపూరిత మరణం మరియు విజయవంతమైన పునరుత్థానం ద్వారా మనం క్షమాపణ, రక్షణ మరియు నిత్యజీవాన్ని పొందగలం. అపొస్తలుల కార్యములు 4:12, మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్తూవుంది.
కాబట్టి, యేసు రక్షణ కార్యం యొక్క ఆశీర్వాదాలు ఆయనపై విశ్వాసం ద్వారా పొందుకొంటాం. మనం యేసును మన రక్షకుడిగా విశ్వసించినప్పుడు, మనం రక్షణ అనెడి బహుమతిని మరియు క్రీస్తుతో ఐక్యమవడం ద్వారా వచ్చే అన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందుకొంటాం.
అంగీకరించినా అంగీకరించకపోయినా: విశ్వాసం అంటే యేసును మన రక్షకుడిగా మరియు దేవుని నుండి వచ్చిన బహుమతిగా నమ్మడం.
మత్తయి 18:2-4, ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారిమధ్యను నిలువబెట్టి యిట్లనెను –మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.
అపొస్తలుల కార్యములు 2:38-39, పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl