గెత్సేమనే తోటలో యేసుని ప్రార్ధన

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: గెత్సేమనే తోటలో యేసుని ప్రార్ధన

పరిశుద్ధ గురువారం:
చివరి భోజనం: యేసు తన శిష్యులతో చివరి భోజనాన్ని పంచుకున్నాడు, (దీనిని ప్రభువు భోజనం అని కూడా పిలుస్తారు) పవిత్ర కమ్యూనియన్ ని స్థాపించాడు. పాదాలు కడగటం: యేసు తన శిష్యుల పాదాలను కడిగి, తగ్గింపును మరియు పరిచర్యను ప్రదర్శించాడు. గెత్సేమనే తోట: చివరి భోజనం తర్వాత, యేసు తన శిష్యులతో కలిసి గెత్సేమనే తోటకు వెళ్ళాడు, అక్కడ అతను ప్రార్థన చేసి గొప్ప వేదనను అనుభవించాడు. ద్రోహం మరియు అరెస్టు: యూదా ఇస్కరియోతు యేసును మోసం చేశాడు, ఫలితంగా రోమన్ సైనికులు ఆయన్ని అరెస్టు చేశారు.

తన జీవితంలోని చివరి వారంలో “ప్రతి సాయంత్రం” యేసు “ఒలీవల కొండ అనే కొండపై రాత్రి గడపడానికి వెళ్ళాడని” (లూకా 21:37) లూకా మనకు చెబుతున్నాడు. లూకా 22:39, ప్రభువు రాత్రి భోజనం తర్వాత, రాత్రి తొలినాళ్లలో, ఆయన బయలుదేరి, తన వాడుకచొప్పున (లూకా 21:32, ఆ రాత్రి గడుపుటకు) ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయన వెంట వెళ్లిరి. ఒలీవల కొండ తూర్పు యెరూషలేములో ఉన్న ఒక పర్వత శ్రేణి, ఇది యెరూషలేము యొక్క పాత నగరానికి తూర్పున ఆనుకుని ఉంది. ఒకప్పుడు దాని వాలులను కప్పి ఉంచిన ఒలీవ తోటల కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది.

యోహాను 18:1,2, యేసు తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లుచుండు వాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. ఆ తోటలో గెత్సేమనే ఒక చోటుకి వారు వచ్చారు, (మత్తయి 26:36, అంతట యేసు వారితో కూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి.) అరామిక్ భాషలో గెత్సేమనే అంటే ఆయిల్ ప్రెస్ (నూనె గానుగ) అని అర్ధం. ఆ తోట ఒలీవల కొండ పాదాల వద్ద ఉందని జెరోమ్ మనకు తెలియజేస్తున్నాడు. అది యెరూషలేము గోడల నుండి ఒకటిన్నర మైలు దూరం ఉండొచ్చు. ఆ తోట స్పష్టంగా ఒక ఏకాంత ప్రదేశం, క్రీస్తు మరియు ఆయన శిష్యులు జనసమూహాల తాకిడి నుండి తప్పించుకోవడానికి తరచుగా అక్కడికి వెళ్లే వాళ్ళు. యోహాను యూదాకు కూడా ఆ స్థలం తెలుసని చెప్తున్నాడు. ఆ స్థలం శిష్యులందరికి తెలిసిందే కాబట్టి యేసు తన శత్రువుల నుండి దాక్కోడానికి, లేదా తన అరెస్టుని తప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళలేదు.

వారు ఆ తోటకు విశ్రాంతి తీసుకోవడానికి లేదా ఆ తోటలో ఆనందించడానికి వెళ్ళలేదు. ఏదెను తోటలో మనిషి చేసిన పనిని రద్దు చేయడానికి ఆయన వెళ్ళాడు. ఏదెను తోటలో పాపం లోకంలోకి ప్రవేశించింది. ఇక్కడ రెండవ ఆదాము నిజమైన మానవుడు, కాని పాపం లేకుండా, మరియు దేవుని కుమారుడు కూడా – తాను చెల్లించడానికి వచ్చిన భయంకరమైన రుణాన్ని ఎదుర్కోవడానికి గెత్సేమనే తోటకు వచ్చాడు.

మన కాలంలో ఎనిమిది ఆలివ్ చెట్లతో ఉన్న గెత్సేమనే తోట నిజమైన గెత్సేమనే కాదు. క్రీ.శ. 70లో టైటస్ యెరూషలేమును ముట్టడించినప్పుడు, నెలల తరబడి జరిగిన సంఘర్షణ కారణంగా, నగరం చుట్టూ ఒక కంచెను ఏర్పాటు చేయడానికి అతడు యెరూషలేము సమీపంలోని అన్ని చెట్లను నరికివేశాడు.

మత్తయి 26:37, ఆయన –నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి యిద్దరు కుమారులను (మార్కు 14:33, యాకోబును యోహానును) వెంటబెట్టుకొని పోయి, (మార్కు 14:33, మిగుల విభ్రాంతి నొందుటకును) దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ఆయన –నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి యిద్దరు కుమారులను (మార్కు 14:33, యాకోబును యోహానును) వెంటబెట్టుకొని తనతో తీసుకెళ్లాడు. రూపాంతర పర్వతంపై తన ఉన్నత స్థితికి సాక్షులుగా ఉన్న ముగ్గురిని ఆయన మళ్ళీ ఎంచుకున్నాడు, (మత్తయి 17:1–8). వారు ఇప్పుడు ఆయన తగ్గింపును కూడా చూడవలసి ఉన్నారు. వారు దానిని చూడటానికి ప్రత్యేకంగా అర్హులని కాదు, లేదా మిగిలిన వారి కంటే బలంగా లేరు. తన వేదనను ప్రత్యక్షంగా చూడటానికి మరియు వారి ఉనికి తనకు ఇచ్చే కొద్దిపాటి ఓదార్పు కోసం ఆయన మళ్ళీ తన సన్నిహిత మానవ స్నేహితులైన ముగ్గురు శిష్యులను, పేతురు, యాకోబు మరియు యోహానులను తనతో తీసుకెళ్లాడు. అట్లే ఆయన తీవ్రంగా బాధపడినప్పుడు తోటివారి ఉనికిని కోరుకునే విషయంలో కూడా యేసు నిజ మానవుడే. ఆయన తీవ్రంగా దుఃఖపడుటను వర్ణిస్తుంది (λυπεῖσθαι దుఃఖించడం, కలత చెందడం, బాధపడటం), చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. (ἀδημονεῖν ఇది అకస్మాత్తుగా ఏదైనా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు తరచుగా అనుభవించే కడుపులో భయం యొక్క అనుభూతిని వర్ణిస్తుంది. అన్ని సందర్భాలలోనూ, ఈ పదం తీవ్రమైన మానసిక క్షోభ ఒత్తిడిలో ఆత్మ యొక్క గొప్ప వేదనను సూచిస్తుంది, దీని అర్థం తదుపరి వచనంలో చెప్పబడింది.

మత్తయి 26:38, అప్పుడు యేసు – మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి ఆయన ప్రార్దించుటకు వెళ్ళాడు. యేసుకు రాబోయే గంటల్లో ఏమి జరగబోతూ ఉందొ తెలుసు. ఆయన మన స్థానములో మన పక్షాన మరణాన్ని ముఖాముఖిగా ఎదుర్కొబోతూవున్నాడు. ఆయన త్రాగబోయే గిన్నె, ఆ చేదు బాధ మరియు మరణం. దీనిని గురించిన ఆలోచన ఆయన ఆత్మకు గొప్ప బాధను కలిగించింది అది ఆయనను మరణపు అంచుకు తీసుకువెళ్లింది. ఆయన మరణ ద్వారం దగ్గరకు వచ్చేసాడు, ఒక చిన్న అడుగు ముందుకు వేస్తే మరణం అతన్ని తీసుకెళ్లి పోతుంది. అప్పటికే మరణం ఆయనను కమ్మేసింది. ఇక్కడ యేసు మరణ వేదనను అనుభవిస్తున్నాడు.

ఒక ప్రశ్న, పరిశుద్ధుడైన దేవుడు సమీపిస్తున్న మరణం గురించి ఆలోచించి ఎందుకని వణికిపోయాడు? ఈ ప్రశ్నకు జవాబు చాలా కాలం క్రితమే బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా చెప్పబడింది: ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల, యోహాను 1:29. లోక పాపాన్ని మోయడం ఈ బాధకు కారణం, మరణం యొక్క దుఃఖానికి కూడా కారణం. అలాగే యేసు సాధారణ మానవునిగా మరణాన్ని ఎదుర్కోబోతూ ఉండటం మూలాన్న ఆయన వేదన మరింత తీవ్రమైంది. మనం మొదటగా జీవించడానికే సృష్టించబడ్డాం, శరీరం మరియు ఆత్మ మధ్య బంధం విచ్ఛిన్నం కాబడుటకు ఉద్దేశించబడలేదు. పతనమైన తరువాత, మరణం అందరికి సంక్రమించింది. అప్పటినుండి జన్మిస్తూవున్న వారందరు మరణముతో జన్మిస్తూ ఉన్నారు. ఆ బంధం బలహీనపడింది. మన జీవితాలన్నీ క్రమంగా చనిపోయే ప్రక్రియకు లోనయ్యాయి. అయినప్పటికీ, మర్త్యుడైన మనిషి చనిపోవడం భయంకరమైన విషయమే. పాపం లోకంలోకి వచ్చినప్పటినుండి, ప్రతిఒక్కరి ఆత్మలు శరీరాల నుండి వేరు చేయబడుతున్నాయి. ఆ క్రమములో, మరణాన్ని ఎదుర్కొనబోతూ ఉన్న పాపం లేని దేవుని కుమారునికి, మరణం అత్యంత అసహజమైనది, అస్సలు సాధారణమైనది కాదు.

యేసుకు మరణపు వేదన చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఆయనది సాధారణ మరణం కాదు కాబట్టి. మనం చనిపోయినప్పుడు మన స్వంత పాపాల సహజ పరిణామాలను అనుభవిస్తాము. కాని యేసు మరణం ఇతరుల పాపాల యొక్క అసహజ పరిణామం. ప్రజలందరి పాపాల భారం ఆయన భుజాలపై ఉంది. మరణాన్ని ఎదుర్కొంటున్న ఒక పాపిపై అపరాధ మనస్సాక్షి ఎంత భయాన్ని తీసుకురాగలదో ఆలోచించండి. అప్పుడు యేసు స్వచ్ఛందంగా మొత్తం ప్రపంచం యొక్క అపరాధాన్ని తనపై వేసుకున్నాడనే వాస్తవాన్ని పరిగణించండి. యేసు ఒంటరి మరణాన్ని ఎదుర్కొంటున్నాడనే వాస్తవం ఆయన శరీర, ఆత్మ వేదనను మరింత పెంచింది. ఆయన పేతురు, యాకోబు మరియు యోహానులతో, “మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది” అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఆయన మన కోసం భరించిన దానికి మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్తూనే ఉండవలసి యున్నాము.

పాపాన్ని (మొత్తంగా లేదా పాపం అనే గొప్ప పర్వతాన్ని) మోయడం అంటే దాని పరిపూర్ణమైన భారాన్ని భరించడం దాని పర్యవసనాన్ని తీసుకోవడం (పాపము వలన వచ్చు జీతము మరణము, రోమా 6:23). ఆయన దాని పర్యవ్యసనమైన మరణాన్ని మాత్రమే కాదు, మరణ రాజ్యానికి చెందిన ప్రతిదీ తీసుకోవలసియున్నాడు. మరణానికి ముందు జరిగే పరిణామాలన్నింటిని, మరియు మరణాన్ని తెచ్చే ప్రతి దానిని, చివరిగా మరణాన్ని ఆయన అనుభవించ వలసియున్నాడు. ఎందుకంటే మరణం అనారోగ్యం, ఇబ్బంది, శత్రుత్వం మొదలైన ప్రాథమిక చర్యల యొక్క సుదీర్ఘ శ్రేణి యొక్క పరాకాష్ట. యేసు ఇప్పటికే వీటిలో చాలా అనుభవించాడు. ఆయన ఇంకా చాలా అనుభవించాల్సి ఉంది. లోక పాపానికి శిక్షను భరించడానికి శ్రమ మరియు మరణం అవసరం. అందువలన ఆ మొత్తం శ్రమ మరియు మరణం ఆయన కళ్ళ ముందు స్పష్టంగా కనిపించాయి. ఆయన అన్నింటినీ చూశాడు: యూదా ద్రోహం మరియు పేతురు తిరస్కరణ, విచారణ, అపహాస్యం, అవమానం, కొరడా దెబ్బలు, గాయాలు, సిలువ, మరణం.

ఇది మన మానవ అవగాహనకు మించినది. పాపికి మరణం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు, కాని పాపం తెలియని పరిశుద్ధుడికి మరణం అంటే ఏమిటో మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. మనిషి మరణముతో జన్మించాడు, కాని క్రీస్తు కాదు. అయినప్పటికీ, ఆయన అందరికంటే గొప్ప పాపి ఎందుకంటే లోక పాపాలను భరించడం అంటే యేసు ఈ పాపాలను తన స్వంతం చేసుకున్నాడని అర్థం. మనిషికి ప్రత్యామ్నాయంగా, మన పాపాలు ఆయన పాపాలైయ్యాయి, మన శిక్ష, ఆయనకు శిక్ష అయ్యింది, ఇది చేదు వాస్తవం. పరిశుద్ధుడు మన కోసం పాపంగా చేయబడి, లోక పాపాల కోసం చనిపోవడం అంటే ఏమిటో మనం స్వల్పంగా మాత్రమే ఊహించగలం. దీనికి తోడు, అన్ని పాపాలను మోసిన ఆయన పై, దేవుని కోపం మరియు ఆ కోపం యొక్క పూర్తి కొలత కుమ్మరించబడింది. ఇది మరణం కంటే భరించడం కష్టం. ఎందుకంటే మరణం శరీరానికి సంబంధించినది, కాని దేవుని కోపం ఆత్మపై దాడి చేస్తుంది.

ఆయన కోపాన్ని ఎదుర్కోవాల్సి రావడం అనేది చేదు వాస్తవం. దేవుని కోపాన్ని తనపై పడే ఆయన శక్తిని అనుభవించి నప్పుడు క్రీస్తుకు ఆత్మలో ఎంతో బాధ కలిగి ఉండాలి. దేవుడు యేసుకు ప్రేమగల తండ్రి. కాని అది జరగబోతూ ఉన్న వాటిని ఏమాత్రమును మార్చదు. ఆయనకు ఎంతగానో ప్రియమైన కుమారుని పై దేవుని కోపం, శాపం, కుప్పకూలింది. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను, గలతి 3:14, అదెలా? అందుకనే ఆయన ఆత్మ ఎంతగానో కలవరపడింది. దానినుండి బయటపడటానికి మార్గం లేదు. ఆయన పై ఆరోపించబడిన పాపాలపై దేవుని తగిన కోపాన్ని ఆయన భరించాలి. ఆయన భరించాల్సిన భారం ఎంత భారీదో ఆలోచించండి. దేవుని స్వంత కుమారుడిని నేలకు దింపిన దేవుని కోపము ఎంత భయకరమో ఆలోచించండి. దేవుని దృష్టిలో పాపం చాలా ఘోరమైనది.

ఈ వచనంలో యేసు మనకోసం శాపంగా మార్చబడ్డాడని మనం చదువుతాము, మరో మాటలో చెప్పాలంటే, దేవుని చట్టాన్ని ఉల్లంఘించినందుకు మనపై విధించబడిన అదే శాపం ఆయన పై పడింది. ఆయన దేవునిచే శపించబడ్డాడు. శాశ్వత మరణాన్ని బట్టే మనం తాత్కాలిక మరణానికి భయపడతాం. మరణ ఆలోచన నుండి నరకం యొక్క ఆలోచనను తొలగించండి మరణ భయం కూడా తొలగించబడుతుంది. ఇక్కడ క్రీస్తు దుఃఖానికి మరియు ఆశ్చర్యానికి ఈ కారణాలతో పాటు, అపవాదితో పోరాటం కూడా జోడించాలి.

అరణ్యంలో శోధన తర్వాత అపవాది క్రీస్తును విడిచిపెట్టినప్పుడు, అపవాది ప్రతి శోధనను ముగించి, అనుకూలమైన అవకాశం వచ్చినప్పుడు పోరాటాన్ని చేపట్టాలనే ఉద్దేశ్యంతో కొంతకాలము ఆయనను విడిచిపోయెనని చెప్పబడింది (లూకా 4:13). యేసుకు ఈ ఉద్దేశ్యం తెలుసు. సాతాను తనను మోసం చేయడానికి యూదాలోకి ప్రవేశించాడని మరియు ఆయన పై దాడి చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడని ఆయనకు తెలుసు. సాతాను తన బద్ద శత్రువుపై మరొక దాడిని ప్రారంభించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడని మనం నిశ్చయంగా చెప్పొచ్చు. వాడు యేసు చెవులలో ఏమి గుసగుసలాడినది మనకు తెలియదు. యేసు మరణానికి వెళ్లకుండా ఆపడానికి అపవాది ప్రయత్నించాడని కొందరు ఊహించి చెప్తారు. నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె (ఆ గడియ) నాయొద్ద నుండి తొలగి పోనిమ్ము, అని యేసు ప్రార్ధించాడు కదా, ఈ గిన్నె నుండి ఉపశమనం పొందాలనే ఈ ప్రార్థన తప్పని సరిగా సాతాను యొక్క ప్రేరణ అయి ఉండాలి. యేసు దాని ఉచ్చులో పడిపోయి ఉండాలి అని వాళ్ళు వాదిస్తారు.

సాతాను యేసు పతనానికి, తద్వారా లోకము పై శాశ్వత శాపమును ఉంచేందుకు తన వద్ద ఉన్న అన్ని కుతంత్రాలను, వంచనను, శక్తిని ఉపయోగించి ఉండొచ్చు కాని యేసు శోధింపబడలేదు.

మత్తయి 26:39, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి, నేలమీద సాగిలపడి (మోకాళ్లూని)– నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె (ఆ గడియ) నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అని ప్రార్థించుచు అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

రాతివేత దూరము అంటే ఒకడు రాయిని విసరగలిగినంత దూరం కాదు, రాతివేత దూరము అంటే ఆయన మాటలను శిష్యులు వినగలిగేంత తక్కువ దూరం అని అర్ధం. అక్కడ ఆయన నేలమీద సాగిలపడి (మోకాళ్లూని) ప్రార్ధించాడు. హెబ్రీయులకు 5:7, (ఆయన) శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించెనని చెప్తూ ఉంది.

మార్కు మొదటగా ప్రార్థన యొక్క సాధారణ విషయాన్ని, నా తండ్రీ, సాధ్యమైతే (ఆ గడియ) ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అని ప్రార్దించినట్లుగా చెప్తున్నాడు. ఇక్కడ విచారకరమైన అర్థంలో ఉపయోగించబడిన గిన్నె, బాధ మరియు మరణాన్ని మొత్తంగా కలిగి ఉంది, ఇది చేదు గిన్నె.

40ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి వారితో– ఒక గడియయైనను నాతో కూడ మేల్కొనియుండలేరా? –సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయైనను మేలుకొని యుండలేవా? 41మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి పోయి, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని 42మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. 43 ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; వారు దుఃఖముచేత నిద్రించుట చూచి 46మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచ లేదు. 44ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను. 45అప్పుడాయన మూడవ సారి తన శిష్యులయొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి; ఇక చాలును, ఇదిగో ఆ గడియవచ్చియున్నది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు; 46లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl