
కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము.
మొదటి అంశము (సృష్టి)
భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను.
దీనికి అర్ధమేమి?
దేవుడు నన్నును మరియు సమస్తమును కలుగజేసి, మరియు నాకు శరీరాత్మలను, కన్నులు, చెవులు మొదలైన సకలావయవములను, బుద్దిని, సమస్తే౦ద్రియములను ఆయన నాకు దయజేసెనని నేను నమ్ముచున్నాను.
ఆ దేవుడు నా శరీరము మరియు జీవమును సంరక్షించుటకు అవసరమైన సమస్తమును అనగా వస్త్రములు మరియు పాదరక్షలు, ఆహారము మరియు పానీయము, ఆస్తి మరియు ఇల్లు, భర్త లేక భార్య మరియు పిల్లలు, భూమి, పశువులు మరియు నేను కలిగియున్న సమస్తమును అనుదినము సమృద్ధిగా దయచేయుచున్నాడని నేను నమ్ముచున్నాను. ఇంతేగాక దేవుడు సకలాపాయములనుండి నన్ను తప్పించుచు, కీడులన్నిటినుండి నన్ను కాయుచు సంరక్షించుచున్నాడు. దేవుడు ఇవి యావత్తు నా పుణ్యమునుబట్టియు, నా యోగ్యతనుబట్టియు గాక పరలోకమందున్న తండ్రి తన మంచితనము వలనను, కృపవలనను, మాత్రమే దయచేయు చున్నాడు. కాబట్టి నేనీ సమస్తమును గూర్చి ఆయనకు కృతజ్జ్యతను అగపరచి ఆయనను స్తుతించి, సేవించి ఆయనకు లోబడుటకు బద్ధుడను.
ఇది వాస్తవమే.
రెండవ అంశము (విమోచనము)
ఆయన ఏక కుమారుడును, మన ప్రభువైన, యేసుక్రీస్తు, పరిశుద్దాత్మ వలన గర్భమున ధరింపబడి, కన్యయైన మరియ యందు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడెను. ఆయన నరకములోనికి దిగెను. చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున ఆయన తిరిగి లేచెను. ఆయన పరలోకమునకెక్కి, సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతివైపున కూర్చుండియున్నాడు. సజీవులకును, మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి ఆయన వచ్చునని నేను నమ్ముచున్నాను.
దీనికి అర్ధమేమి?
నిత్యత్వమందు తండ్రి కనిన, నిజమైన దేవుడును, మరియయను కన్య యందు పుట్టిన, నిజమైన మనుష్యుడునైన యేసుక్రీస్తు నా ప్రభువై యున్నాడని నేను నమ్ముచున్నాను.
తప్పిపోయి శిక్షకు విధింపబడిన జీవినైన నన్ను ఈయన వెండి, బంగారంల చేతగాక, వెలలేని తన పరిశుద్ధమైన రక్తము చేతను తాను పొందిన నిరపరాధ శ్రమ మరణములచేతను, సమస్త పాపముల నుండియు మరణము నుండియు సాతాను అధికారము నుండియు విమోచించి, కొని మరియు నన్ను గెలుచుకొన్నాడు.
ఆయన మరణము నుండి లేచి నిరంతరము బ్రదికి యేలుటను బట్టి, నేనును ఆయన వాడనైయుండి ఆయన రాజ్యములో ఆయన క్రింద బ్రదికి మరియు నిత్యమైన నీతిలో, నిర్దోషత్వములో, ధన్యతలో ఆయనను సేవించుటకు ఆయన యిదంతయు చేసాడు.
ఇది వాస్తవమే.
మూడవ అంశము (పరిశుద్ధపరచుట)
పరిశుద్దాత్మను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్దుల ఐక్యమును, పాపక్షమాపణయు; శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నేను నమ్ముచున్నాను. ఆమేన్.
దీనికి అర్ధమేమి?
నేను నా స్వంత ఆలోచన వలనైనను లేక నా స్వంత నిర్ణయము వలననైనను, నా ప్రభువైన యేసుక్రీస్తు నందు నమ్మికయుంచలేననియు లేక ఆయన యొద్దకు జేరనేలేననియు నమ్ముచున్నాను.
కాని పరిశుద్దాత్మ సువార్త వలన నన్ను పిలిచి, తన వరముల వలన నన్ను వెలిగించి, నన్ను పరిశుద్ధపరచి మరియు నిజమైన విశ్వాసమునందు నన్ను ఉంచెను. ఈలాగుననే ఆయన భూమి మీదనున్న సమస్త క్రైస్తవ సంఘమును పిలచి, తన చెంతచేర్చి, వెలిగించి, పరిశుద్ధపరచి నిజమైన ఏక విశ్వాసమందు యేసుక్రీస్తుతో ఉంచుచున్నాడు.
ఆయన ఈ క్రైస్తవ సంఘములో నా యొక్కయు, విశ్వాసులందరి యొక్కయు సమస్త పాపములను అనుదినము సంపూర్ణముగా క్షమించుచున్నాడు.
ఆయన అంత్యదినమందు నన్నును చనిపోయినవారి నందరిని లేపి మరియు నాకును క్రీస్తునందు విశ్వాస ముంచు వారందరకును నిత్య జీవము దయచేయును.
ఇది వాస్తవమే.
విశ్వాస ప్రమాణము
భూమ్యాకాశములను సృజించిన (కీర్తన 33:6; యోహాను 5:17) సర్వశక్తిగల (ఆది 7:1; 2 కొరింథీ 6:18) తండ్రియైన (కీర్తన 89:27; మత్తయి 7:11) దేవుని (ద్వితీయోప 6:4; 1 కొరింథీ 8:6) నేను నమ్ముచున్నాను (హబక్కూకు 2:4; రోమా 4:5).
ఆయన ఏక (జెకర్యా 13:7; యోహాను 1:14) కుమారుడును (కీర్తన 2:7; మత్తయి 16:16), మన ప్రభువైన (యిర్మీయా 23:6; యోహాను 20:28), యేసు (జెకర్యా 9:9; మత్తయి 1:21) క్రీస్తు, (దానియేలు 9:24; యోహాను 3:34) పరిశుద్దాత్మ వలన (దానియేలు 2:45; మత్తయి 1:20) గర్భమున ధరింపబడి (యిర్మీయా 31:22; లూకా 1:31), కన్యయైన మరియ యందు (యెషయా 7:14; లూకా 1:43) పుట్టి (యెషయా 9:6; యోహాను 1:14), పొంతి పిలాతు అధికారము క్రింద (కీర్తన 2:2; లూకా 18:32) శ్రమపడి (యెషయా 50:6; లూకా 23:25), సిలువ వేయబడి (కీర్తన 22:17; యోహాను 3:14), చనిపోయి (దానియేలు 9:26; రోమా 5:8), సమాధి చేయబడెను (యెషయా 53:9; యోహాను 12:24). ఆయన నరకములోనికి దిగెను (కీర్తన 16:10; ఎఫెసీ 4:9). మూడవ దినమున (హోషేయ 6:2; మత్తయి 26:32; అపొ. కార్య 10:41,42) చనిపోయిన వారిలో నుండి ఆయన తిరిగి లేచెను (యెషయా 63:1; 2 తిమోతికి 2:8). ఆయన పరలోకమునకెక్కి (కీర్తన 68:19; కొలొస్సి 2:15), సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతివైపున కూర్చుండియున్నాడు (కీర్తన 110:1; మార్కు 16:19). సజీవులకును, మృతులకును (దానియేలు 12:2; 1 కొరింథీ 15:51) తీర్పు చేయుటకు (సామెతలు 6:6; అపొ. కార్య 17:31) అక్కడి నుండి ఆయన వచ్చునని నేను నమ్ముచున్నాను (యెషయా 66:15; అపొ. కార్య 1:11).
పరిశుద్దాత్మను (జెకర్యా 12:10; యోహాను 15:26), పరిశుద్ధ (కీర్తన 45:14; ఎఫెసీ 5:26) క్రైస్తవ సంఘమును (కీర్తన 22:26; మత్తయి 16:18), పరిశుద్దుల ఐక్యమును (నిర్గమ 19:5; ఎఫెసీ 4:3), పాపక్షమాపణయు (కీర్తన 32:1; అపొ. కార్య. 10:43); శరీర పునరుత్థానమును (యెషయా 66:14; యోహాను 5:28) నిత్య జీవమును (కీర్తన 16:11; 1పేతురు 1:4) ఉన్నవని నేను నమ్ముచున్నాను. ఆమేన్ (కీర్తన 72:19; 2 కొరింథీ 1:20).
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl