మోషే ధర్మశాస్త్రములోని రెండవ ఆజ్ఞ

రెండవ ఆజ్ఞ: నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.
దీనికి అర్ధమేమి? మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, ఆయన పేరిట శపింపకయు, ఒట్టుపెట్టుకొనకయు, అబద్ధమాడకయు, వంచన చేయకయు, మంత్రతంత్రములు చేయకయు, సకల శ్రమల యందు ఆయనను పేరు పెట్టి పిలిచి వేడుకొని, స్తుతించి మరియు కృతజ్ఞత అగపరచవలెను.

1. దేవుని నామము ఏమైయున్నది?

ఆదికాండము 17:1. నేను సర్వశక్తిగల దేవుడను.

యెషయా 42:8. యెహోవాను నేనే; ఇదే నా నామము.

మత్తయి 1:21. ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.

2 కొరింథీయులకు 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.

1A జవాబు: దేవుడు తన్ను తాను తెలియజేసుకోవడానికి వాడిన ప్రతి భావము దేవుని నామమై యున్నది. (దేవుడు, సర్వశక్తిగల దేవుడు, ప్రభువు, యేసుక్రీస్తు, పరిశుధ్ధాత్మ మొదలగునవి).

నిర్గమకాండము 34:5-7. ( మోషేకు యెహోవా అను నామము ప్రకటించబడినపుడు, ఆయనను గూర్చి ప్రకటించబడిన విషయాలను గమనించండి)

యోహాను 17:6-8. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని ….. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, ….. నీవు నాకు అనుగ్ర హించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు.

1B జవాబు: ఆయన వాక్యమునందు ఆయనను గూర్చి మనకు దేవుడు బయలుపరచినదంతయు దేవుని నామమైయున్నది.

2. ఏ ఉద్దేశ్యము కొరకు దేవుడు తన నామమును మనకు బయలుపర్చాడు?

కీర్తనలు 54:6. యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

నిర్గమకాండము 20:24. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను.

రోమా 10:13. ఎందుకనగా– ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును.

సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.

నిర్గమకాండము 20:7. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు.

2 జవాబు: ఆయన మనలను దీవించి రక్షించుటకుగాను దేవుని నామము ఉపయోగపడులాగున ఆయన తన నామమును మనకు బయలుపర్చాడు.

3. శపించుట అనేది దేవుని నామమును వ్యర్థముగా ఉపయోగించడం ఎలా అవుతుంది?

2 సమూయేలు 16:5-14. (దావీదు అబ్షాలోము నుండి పారిపోతున్న టైంలో షిమీ దావీదును శపించాడు. 11వ వచనమందు, షిమీ శపించుట యొక్క ఉద్దేశ్యము అబ్షాలోము యొక్క ఉద్దేశ్యముతో యెట్లు సరిపోల్చబడుతుందో గమనించండి).

సంఖ్యాకాండము 22:6-12. (బిలాము ఇశ్రాయేలీయులను శపించాలని బాలాకు కోరుకున్నాడు. అందునుబట్టి అతడు దేవుని ప్రజలను జయించవచ్చని తలంచాడు).

యాకోబు 3:10. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

రోమా 12:14. మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.

3 జవాబు: శపించుట అంటే ఎవనికైనను లేక దేనికైనను కీడు జరగవలెనని ఆశిస్తూ దేవుని నామాన్ని ఉపయోగించడం గనుక శపించడం పాపమై యున్నది.

4. దేవుని నామమున ఒట్టుపెట్టుకోవడం అంటే ఏమిటి?

మత్తయి 26:63. అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే.

హెబ్రీయులకు 6:16. మనుష్యులు తమకంటె గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.

4 జవాబు: మనము సత్యమును చెప్పుచున్నామని ఎవరికైనను నిశ్చయతను కలుగజేయడానికి దేవుని నామాన్ని ఉపయోగించడం ఒట్టుపెట్టుకోవడమై యున్నది.

5. దేవుని నామమును వ్యర్థముగా ఉపయోగించి ఒట్టుపెట్టుకోవడం ఎప్పుడు పాపమై యున్నది?

1 రాజులు 21:8-14. (నాబోతునకు వ్యతిరేకముగా ఇద్దరు అబద్ధసాక్ష్యము పలుకునట్లుగా చేసి యెజెబెలు నాబోతును హత్య చేయించింది).

మత్తయి 26:69-75. (74వ వచనాన్ని గమనించండి, పేతురు యేసును నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలుపెట్టెను).

లేవీయకాండము 19:12. నా నామమును బట్టి అబద్ధప్రమాణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు; నేను యెహోవాను.

5A జవాబు: మనము దేవుని నామమును అబద్ధమాడుటకు ఉపయోగించి ఒట్టుపెట్టుకోవడం పాపమై యున్నది. (అబద్ధముగా ఒట్టుపెట్టుకొనుట)

మత్తయి 5:33-37. (అన్ని విషయములను గూర్చి ప్రమాణము చేయక, ఎంత మాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు ….. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది).

యాకోబు 5:12. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడనిగాని భూమి తోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను.

5B జవాబు: అనవసరంగా ఒట్టుపెట్టుకోవడం పాపమైయున్నది.

మార్కు 6:21-28. (అది ఏమైయుండునో అతడు ఎరుగకపోయినప్పటికిని దానిని చెయ్యడానికి హేరోదు ఒట్టుపెట్టుకొన్నాడు).

5C జవాబు: మనము ఏమి చేయుదుమని ప్రమాణము చేయుచున్నామో దానిని గూర్చి మనకు తెలియనప్పుడు ఒట్టుపెట్టుకోవడం పాపమై యున్నది. (అస్పష్టమైన వాటి విషయములో ఒట్టుపెట్టుకోవడం)

6. ప్రజలు దేవుని నామమును ఎట్లు అబద్ధమాడుటకు ఉపయోగించుచున్నారు?

యిర్మీయా 14:14. యెహోవా నాతో ఇట్లనెను–ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.

యిర్మీయా 23:31. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.

మత్తయి 15:9. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.

6. జవాబు: ప్రజలు తమ స్వంత అబద్దపు బోధలను కప్పిపెట్టుకోవడానికి దేవుని నామమును ఉపయోగించినప్పుడు వారు దేవుని నామమును అబద్ధమాడుటకు ఉపయోగించుచున్నారు. (అబద్ద ప్రవక్తలు లేక అబద్ద బోధకులు)

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంలో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl