ఆదికాండము 1 అధ్యాయము వ్యాఖ్యానము

మొదటి భాగం
ఆదిమ ప్రపంచంలో మానవాళితో దేవుని దయగల వ్యవహారాల తొలి చరిత్ర (1:1–11:26)

ప్రపంచ సృష్టి (1:1–2:3)
జీవితంలోని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకోని వ్యక్తిని నిజంగా జ్ఞానవంతుడిగా పరిగణించలేము. మీరు ఎవరు? అనుకోని ఒక రసాయన ప్రమాదం మూలాన్న ఉద్భవించిన వారా? అడవి జంతువు నుండి మనిషిగా పరిణామము చెందిన జీవా? జీవిగా మన శరీరం (ఎముక మరియు రక్తం, కండరాలు మరియు నాడి యొక్క అతి ముఖ్యమైన కలయికగా), బాహ్య అంతరిక్షం యొక్క అనంతమైన అపారతతో చుట్టుముట్టబడి ఉందా? నేను ఈ గ్రహం మీద ఎవరి ఆదేశం ప్రకారం జీవిస్తున్నాను? అది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా రూపకల్పన ద్వారా జరిగిందా? నా జీవిత ఉద్దేశ్యం ఏమిటి? మార్క్ ట్వైన్ జీవితాన్ని “చిన్న గ్రహాలలో ఒకదానిపై జరిగిన చాలా అవమానకరమైన సంఘటన” అని చెప్పాడు. అతడు చెప్పింది నిజమేనా?

దేవుడు మన తరపున ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోతే మనం ఎప్పటికీ సరిగ్గా జవాబు చెప్పలేం. బైబిల్ యొక్క మొదటి అధ్యాయంలోనే, మనం ఆయన దగ్గరకు రాలేము కాబట్టి దేవుడే మనిషి దగ్గరకు వచ్చాడు. మిలియన్ సంవత్సరాలలో మనం స్వయంగా ఎన్నడూ తెలుసుకోలేని విషయాలను – తన గురించి, మన గురించి, మనం ఎలా ఉన్నాం, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే ముఖ్యమైన సత్యాలను ఆయన మనకు చెప్పాడు.

తప్పుగా అర్థం చేసుకోకండి. మనం తెలుసుకోవాలనుకునే ప్రతిదాన్ని దేవుడు మనకు చెప్పలేదు. ఎందుకంటే, బైబిల్ ఉద్దేశ్యం మన ఉత్సుకతను తీర్చడం కాదు, కాని మనం ఈ జీవితాన్ని నిజమైన అర్థంతో జీవించడానికి మరియు తండ్రి పక్కన మన స్థానాన్ని కనుగొనడానికి వీలు కల్పించడమే. సృష్టి యొక్క ఆదికాండము యొక్క ఈ కథనాన్ని మనం చదవడం ప్రారంభించినప్పుడు, విశ్వం మరియు మానవ జాతి ప్రారంభం గురించి మనకు ఉన్న ఏకైక నమ్మదగిన సమాచారం ఇదేనని మనం గుర్తుంచుకోవాలి.

ఆదికాండము 1:1
1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

ఆదియందు దేవుడు…” ఆదికాండము యొక్క మొదటి వచనంలో పేర్కొనబడిన వ్యక్తి దేవుడు (కర్త), అది సముచితం. మనం నివసించే ఈ విశ్వానికి ఒక ప్రారంభం ఉంది. ఆ ప్రారంభ బిందువుకు ముందు, విశ్వం లేదు. శూన్యము కూడా లేదు. దేవుడు తప్ప ఏమీ లేదు. సృష్టికి ముందు దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. దేవుడు అని అనువదించబడిన హీబ్రూ పదం “భయపడటం” అనే అర్థం వచ్చే క్రియ నుండి వచ్చినట్లు గుర్తించబడింది. దీనికి, శాశ్వతత్వం నుండి ఉనికిలో ఉన్నటువంటివాడు ఒక సమయంలో సమయం మరియు స్థలాన్ని (శూన్యాన్ని) సృష్టించిన దేవుడు అద్భుతమైనవాడు మరియు తన జీవులచే గౌరవించబడటానికి అర్హుడు అని అర్ధం. మానవ జాతితో సహా ప్రతిదీ ఆయన కోసమే ఉంది. మీరు నేను మన కోసం ఉనికిలో లేము. మనం మహోన్నతమైన సృష్టికర్తను బట్టి ఆయన ప్రణాళికను బట్టి మనం ఉనికిలో ఉన్నాం.

మానవులమైన మనకు పుట్టినరోజులు మరణ దినాలు, ప్రారంభాలు మరియు ముగింపులు ఉన్నాయి. దేవునికి రెండూ లేవు. ఆయన మాత్రమే శాశ్వతుడు. ఎవరూ మరియు మరేదీ శాశ్వతం కాదు. ఆదిలో జీవ బీజాన్ని మండించగల వాయువు బుడగ లేదు, విశ్వ ధూళి లేదు. జీవం యొక్క తొలి రూపాలు ఏదో చరిత్ర పూర్వ చెరువుపై బురద బొట్టులో ఉద్భవించలేదు. మూలకాలు, మన విశ్వం ఏర్పడిన పదార్థాలు శాశ్వతమైనవి కావు. దేవుడు అలా ఆదేశించినప్పుడు మాత్రమే అవి ఉనికిలోకి వచ్చాయి. బైబిల్ యొక్క ఈ మొదటి వాక్యం యొక్క పద క్రమం తెలుగులో పూర్తిగా సాధారణమైనదిగా అనిపిస్తుంది. కాని హీబ్రూ వాక్యాలు సాధారణంగా క్రియతో ప్రారంభమవుతాయి. ఇక్కడ పద క్రమం ఉద్ఘాటన కోసం తలక్రిందులుగా ఉంటుంది. దాని అర్ధం దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నప్పుడు, సంపూర్ణ ప్రారంభం ప్రారంభమయ్యిందని (స్టార్టింగ్ పాయింట్ ని) వక్కాణించడమే.

దేవుడు ఆకాశాలను, భూమిని సృష్టించాడు.” సృష్టించాడు అని అనువదించబడిన హీబ్రూ క్రియ చాలా ప్రత్యేకమైనది. బైబిల్లో ఆ క్రియ (1) దేవుని కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించబడింది మరియు (2) ఎల్లప్పుడూ అసాధారణమైన, పూర్తిగా ప్రత్యేకమైన దాని మూలాన్ని వ్యక్తపరుస్తుంది. కొన్నిసార్లు దేవుడు తాను సృజించిన పదార్థాన్ని ఉపయోగించి సృష్టించాడు. ఉదాహరణకు, ఆయన ఆదామును సృష్టించినప్పుడు, ఆయన నేల మంటిని ఉపయోగించాడు. కాని ఈ ప్రారంభ వచనంలో వివరించిన కార్యాచరణ ప్రారంభంలో, దేవుడు మాత్రమే ఉన్నప్పుడు జరిగింది కాబట్టి అవి శూన్యం నుండి సృష్టించబడ్డాయి.

ఆకాశాలు మరియు భూమి” అనే వ్యక్తీకరణ విశ్వాన్ని దాని ప్రారంభ స్థితిలో సూచిస్తుంది. దేవుడు తన స్వంత కారణాల వల్ల, తన సృష్టిని దాని పూర్తి రూపంలో చేయడం సముచితమని భావించలేదు. దేవుడు తన సంకల్పం యొక్క చర్య ద్వారా, మనకు తెలిసినట్లుగా విశ్వాన్ని ఏర్పరిచే అన్ని భాగాలను మొదటిగా సృష్టించాడు, వాటిలో పదార్థం, శక్తి, స్థలం మరియు సమయం ఉన్నాయి. మొదటి రోజున, దేవుడు తన ముడి పదార్థాలన్నింటినీ సృష్టించాడు, ఒక గృహనిర్మాత ఇంటిని నిర్మించే ముందు నిర్మాణ సామగ్రిని ఒక స్థలంలో సమీకరించినట్లుగా ఆయన వాటిని సృష్టించాడు. పదార్థం (కృష్ణ పదార్థం, వ్యతిరేక పదార్థం), శక్తి, సమయం (టైం), స్పేస్ (స్థలం), గురుత్వాకర్షణ, అణువులు, పరమాణువులు, మూలకాలు వాటి లక్షణాలు, సూత్రాలు (రసాయన శాస్త్రం & భౌతిక శాస్త్రం) మరియు ప్రతిచర్యలు (ఫ్యూజన్/శక్తి) మొదలైనవి.

అయితే బిగ్‌బ్యాంగ్ మూలంగా ఈ సృష్టి ఉనికిలోనికి వచ్చిందని మన సైన్స్ చెప్తుంది_ ఒక అణువు ఉనికిలోకి వచ్చిందని, అది ట్రిలియన్ డిగ్రీల వేడితో మండిందని, అప్పుడు బిగ్ బ్యాంగ్ (మహా విస్ఫోటనం) జరిగిందని చెప్తుంది. ఆ అణువు ఎక్కడి నుండి వచ్చిందో లేక అది ఎలా ఉనికిలో ఉందొ లేక ఆ అణువుకు ముందు పరిస్థితి ఏమిటో సైన్స్ జవాబు చెప్పటం లేదు. అణువుకు ముందు సమయం లేదు. కాబట్టి అణువుకు ముందు ఏమి జరిగిందో మనకు తెలియదు. ఆ మహా విస్ఫోటనం చాలా శక్తితో విస్తరించిందని, అంతరిక్ష సమయం ఉనికిలోకి వచ్చిందని, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం యొక్క సూత్రాలు ఉనికిలోకి వచ్చాయని, శక్తి మాత్రమే విస్తరిస్తోందని సైన్స్ చెప్తుంది. ఐనెస్టీన్_ E= mc2 ప్రకారం శక్తి పదార్థ కణాలుగా మారొచ్చు. మేటర్ + యాంటి మేటర్ కణాలు = శక్తి విడుదలలు. మేటర్ + యాంటి మేటర్ కణాలు, ప్రోటాన్ + న్యూట్రాన్ + ఎలక్ట్రాన్ ద్వారా హైడ్రోజన్ మరియు హీలియం మేఘాలు ఉనికిలోకి వచ్చాయని, అవి 100 మిలియన్ కాంతి సంవత్సరాల పొడవుకు విస్తరించాయని, అందుకు 380000 కోట్ల సంవత్సరాలు పట్టిందని, అప్పుడు ట్రిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత నుండి విశ్వం 4900 ఉష్ణోగ్రతకు పడిపోయిందని సైన్స్ చెప్తుంది. అప్పుడు హైడ్రోజన్ + హీలియం ఫ్యూజ్ అయ్యి = ఆవర్తన పట్టిక లోని ఆక్సిజన్ కార్బెన్ మరియు మెగ్నిసియం మొదలైన మూలకాలు ఏర్పడ్డాయని, నక్షత్రాలను ఏర్పర్చాయని, తరువాత జింక్ క్రోమియం గోల్డ్ వంటి బరువైన మూలకాలు గ్రహాలపై జీవం సృష్టించడానికి ఏర్పడ్డాయని సైన్స్ చెప్తుంది. బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం పూర్తిగా నిరూపితం కాలేదు. ఈ మధ్య కాలములో సృష్టి రహస్యాన్ని ఛేదించడానికి మానవుడు అంతరిక్షంలోని పంపిన జేమ్స్ వెబ్ టెలీస్కోప్ (25 డిసెంబర్ 2021) బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం తప్పని చెప్తూ సవాలు చేస్తూవుంది.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంలో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl