దేవుడు మొదటి దినాన్న సృజించిన వెలుగు అంటే ఏమిటి?

ఆదికాండము 1:3–5 3 దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4 వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. 5 దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.

  1. కొందరు వెలుగుతో ఈ సృష్టి ఎలా ప్రారంభంఔతుంది? అది అసంభవం అని ప్రశ్నిస్తుంటారు?
  2. మరికొందరు ఈ విశ్వం ఇప్పుడున్న రూపాన్ని సంతరించుకోవడానికి దేవుడు సృజించిన ప్రాధమికమైనవి ఏంటి? వాటిని దేవుడు ఎప్పుడు సృజించాడు? బైబులు వాటి గురించి చెప్తూవుందా? అని ప్రశ్నిస్తుంటారు.
  3. కొందరు నాల్గవ రోజు వరకు సూర్యుడు మరియు నక్షత్రాలు సృష్టించబడ లేదు కదా మరి మొదటి రోజున దేవుడు సృష్టించిన వెలుగు అంటే ఏంటి? అని ప్రశ్నిస్తుంటారు?
  4. మరికొందరు సూర్యుడు అప్పటికింకా సృష్టింపబడలేదు కదా మరి అస్తమయమును ఉదయమును ఎలా కలిగాయి? అని ప్రశ్నిస్తుంటారు?

ఆదికాండము 1:1 వచనంలో, “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అనే వ్యక్తీకరణ విశ్వాన్ని దాని ప్రారంభ స్థితిలో సూచిస్తూ, ఒక ఇంటిని నిర్మించేవాడు అందుకు అవసరమైన పదార్ధములను కూర్చుకొని ఎలాగైతే నిర్మాణాని మొదలు పెడతాడో అలాగే మొదటి రోజున దేవుడు తన ముడి పదార్థాలన్నింటిని (భౌతిక రసాయన సూత్రాలతో) సృష్టించియున్నాడని, పదార్ధము నిరాకారముగాను శూన్యముగాను ఉండెనని చీకటి అగాధ జలము పైన కమ్మియుండెనని బైబులు చెప్తూవుంది.

ఈ విశ్వంలో  ప్రాధమికమైనవి, ప్రాముఖ్యమైనవి, పదార్థం, శక్తి, స్పేస్ మరియు టైం. మనకు తెలిసిన ఈ విశ్వం ఈ రూపాన్ని సంతరించుకొనే క్రమములో, ఈ ముడి పదార్ధములన్ని జోడించబడి దేవుడు అనుకొనినట్లుగా రూపాన్ని సంతరించుకొనే క్రమములో అనుసంధానించబడాలి, నలుదిక్కులకు చెదరిపోతూ విస్తరింపబడాలి, అనంతమైన స్పేస్ సృష్టించి ఉనికిలో కనబడాలి. ఆ కనెక్షన్ లోనే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెనని బైబులు స్పష్టముగా చెప్తూవుంది.

వీటి మధ్యన ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోవడానికి ముందుగా, ఈ విశ్వం ఈ రూపములో ఉండడానికి అవసరమైన పదార్ధము, విశ్వంలో 27% కృష్ణ పదార్ధముగా ఉందని, ఇది కంటికి కనిపించదని మరియు శక్తి 68% కృష్ణశక్తిగా ఉందని ఈ శక్తియొక్క మూలం ఏమిటో ఇప్పటికి తెలియదని మిగతా 5% మాత్రమే కనబడే పదార్ధముగా ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంది. ఆ పదార్ధములో ఏయే పార్టికల్స్ ఉండి ఉండొచ్చొ సైన్స్ ఈ రోజులలో శాస్త్రీయముగా చెప్తూ వాటిని అణువులని, పరమాణువులని, మేటర్ పార్టికల్స్ అని, యాంటి మేటర్ పార్టికల్స్ అని, ప్రోటాన్ న్యూట్రాన్ ఎలెక్ట్రాన్స్ వంటివిగా తెలియజేస్తూవుంది.

పదార్థములో_ మేటర్ పార్టికల్స్, యాంటి మేటర్ పార్టికల్స్ ఉన్నాయని, మేటర్ పార్టికల్ లో ఉన్న ప్రోటాన్ న్యూట్రాన్ ఎలెక్ట్రాన్స్ మధ్య చర్య జరుగులాగున వాటిని ఫ్యూజ్ చేయడానికి వెలుగును సృష్టించగా తేలికైన హైడ్రోజన్ హీలియం అణువులు తయారయ్యాయని, ఇవన్నీ ధూళి మేఘాలుగా విస్తరిస్తూ, ఒకచోటికి చేరి దానివలన ఏర్పడిన గురుత్వాకర్షణ శక్తి మూలముగా చుట్టుప్రక్కల ఉన్న మిగిలిన అణువులను ఆకర్షిస్తూ గ్రహాలుగా నక్షత్రాలుగా రూపుదిద్దుకొంటూ ఉన్నాయనే విషయాన్ని మనం ఇప్పుడు శాస్త్రీయముగా  తెలుసుకున్నాం. ఇలా ఏర్పడిన నక్షత్రాల మధ్యలో ఉండే ఒత్తిడి వేడి వలన నక్షత్రాలలో ఉండే హైడ్రోజన్ హీలియం అణువులు ఫ్యూజ్ అయ్యి పీరియాడిక్ టేబుల్ లోని ఆక్సీజెన్ కార్బన్ మెగ్నీషియమ్ వంటి మరికొన్ని ఎలెమెంట్స్ తయారయ్యాయని తరవాత గ్రహాలు వాటి మీద జీవాలు ఏర్పడడానికి అవసరమైన గోల్డ్ జింక్ క్రోమియం ప్లాటినం యురేనియంవంటి బరువైన అణువులు తయారయ్యాయని ఇప్పుడు మనం శాస్త్రీయముగా తెలుసుకున్నాం.   

స్పేస్_ అనేది అన్ని దిక్కులలో విస్తరించి ఉన్న కంటికి కనబడని అనంతమైన పొడవైన దుప్పటిగా చెప్పొచ్చు. ఇది కోటానుకోట్ల నక్షత్రాల బరువును మోస్తూ వాటివాటి ఉష్ణోగ్రతలను బట్టి కాలిపోని కంటికి కనబడని ఒక విచిత్రమైన దుప్పటి ఇది. స్పేస్ యొక్క ప్రాథమిక లక్షణాలు ఏమిటంటే: కఠినమైన శూన్యత, ఉష్ణోగ్రత – 488F, అతి తక్కువ పీడనంతో ఉంటుంది. అంతేగాక స్పేస్ సౌండ్ ప్రూఫ్, నిశ్శబ్ద ప్రదేశం. స్పేస్ లో, గ్రహాలు, ఉల్కలు, నక్షత్రాలు వంటి వివిధ ఖగోళ వస్తువులు ఉన్నాయి. వాటివలన విపరీతమైన రేడియేషన్ని (ప్లాస్మాని) అంటే తక్కువ సాంద్రత కలిగిన కణాలు ప్రధానంగా హైడ్రోజన్ హీలియంతో పాటు విద్యుదయస్కాంత వికిరణం, అయస్కాంత క్షేత్రాలు, న్యూట్రినోలు, ధూళి మరియు కాస్మిక్ కిరణాల ప్లాస్మాను కలిగి ఉంటుంది. స్పేస్ యొక్క పొడవు వెడల్పు ఎత్తును గురించి ఖచ్చితముగా మనకేమి తెలియదు. స్పేస్ యొక్క రంగు నలుపు, చీకటి. గమనించండి, చీకటి సృష్టింపబడిందని చెప్పబడలేదు. చీకటి స్పేస్ అంత ఉండెనని చెప్పబడింది. స్పేస్ మనం ఒక సముద్రం అనుకుంటే దాని చివరను కనుక్కోవటం అసాధ్యం. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను అనే ఈ మాటలు స్పేస్ అనేది కాంతి లేని సముద్రం వలె అనంతమైన చీకటిలో ఆవరించిన విస్తారమైన అగాధం అని తెలియజేస్తూవుంది. జలము అనేది ఎనర్జీ ని సూచిస్తూవుంది.

కృష్ణశక్తి _ అనేది స్పేస్ యొక్క లక్షణమనే సంగతిని మొదటిగా ప్రతిపాదించినవాడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. కృష్ణశక్తి అనేది మనిషికి తెలియని ఒక రకమైన క్రొత్త డైనమిక్ ఎనర్జీ ఫ్లూయిడ్. దీనికి స్థిరమైన ఒక ఆకారం అంటూ లేదు మనము ఊహించలేని బాహ్య ఒత్తిడిని సులభంగా తీసుకోగల ఒక కంటికి కనబడని ద్రవ పదార్ధము.

వెలుగుకు నిర్వచనాన్ని మనం చూసినట్లయితే, అది “తరంగదైర్ఘ్యాలతో కూడిన ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ గా” నిర్వచించబడింది. కాంతికి మరొక ప్రత్యామ్నాయ భౌతిక వర్ణన ఏమిటంటే, రేడియేషన్ ఇది ఫోటాన్‌ లు అని పిలువబడే శక్తిగా ద్వంద్వ స్వభావాన్ని కలిగి కణం మరియు తరంగం అనెడి విభజించతగిన రెండింటిగా విడుదల చేయబడటమే అని చెప్తూవుంది. కాంతి కణాల వలె ప్రవర్తిస్తుంది తరంగాల వలె ప్రవర్తిస్తుంది కూడా. పదార్థంతో కాంతి పరస్పర చర్యలు విశ్వం యొక్క నిర్మాణాన్ని రూపొందించడంలో విశ్వం స్పేసులో విస్తరింపబడుటకు సహాయపడింది అనడంలో నిస్సందేహముగా ఎలాంటి సందేహము లేదు సైన్స్ కూడా ఏకీభవిస్తూవుంది.

ఈ రోజులలో విశ్వం గురించిన దాదాపు మొత్తం సమాచారం విద్యుదయస్కాంత వికిరణం (కాంతి) రూపంలో భూమికి చేరుతువున్నదని ఆ రేడియేషన్‌ను వివరించడం ద్వారా, ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వంయొక్క ప్రారంభ యుగాలను ఊహిస్తూ విశ్వంయొక్క సాధారణ విస్తరణను కొలవడానికి ప్రయత్నిస్తూ నక్షత్రాల రసాయన కూర్పును మరియు నక్షత్ర మాధ్యమాన్ని నిర్ణయిస్తూ ఉన్నారు. తరువాత, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అని బైబులు చెప్తూవుంది. దేవుడు వెలుగును రూపొందించిన ఉద్దేశ్యాన్ని అది సంపూర్ణంగా అందించియున్నదనే విషయాన్ని ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి.

సృష్టికర్త చేతి నుండి వచ్చినది పరిపూర్ణమైనదని ఆదికాండము మొదటి అధ్యాయం మనకు ఏడుసార్లు గుర్తు చేస్తువుందనే విషయాన్ని మర్చిపోకండి.

దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. కాంతి కాలాన్ని Period of lightని దేవుడు పగలనియు చీకటి కాలాన్ని Period of darknessని దేవుడు రాత్రి అనియు పేరు పెట్టెను అని ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను అంటే మొదటిగా కాంతి కాలమున్నదని అది ముగిసిన తరువాత చీకటి కాలము వచ్చినదని ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి. ఉదయము అనే మాట చీకటి కాలాన్ని ముగింపుకు తెస్తూవుంది. 

మోషే దినము అనే మాటను ఇక్కడ రెండు అర్ధాలలో ఉపయోగించాడు. మొదటిగా ఇది దేవుని ఆజ్ఞను అనుసరించిన కాంతి కాలాన్ని సూచిస్తూ ఉంది. అట్లే కాంతి కాలాన్ని మరియు చీకటి కాలాన్ని కలిపి ఒక దినము అనే అర్ధములో కూడా వాడాడు. తరువాతి అధ్యాయంలో ఇంకా విస్తృతమైన అర్థంలో ఉపయోగించాడు. బైబిల్ దినము అనే మాటను వివిధ అర్థాలతో ఉపయోగించినప్పటికీ, మిలియన్ల లేదా వేల సంవత్సరాల నిడివి ఉన్న కాలాన్ని సూచించడానికి అది ఎక్కడా ఆ పదాన్ని ఉపయోగించ లేదు అనే విషయాన్ని మర్చిపోకండి.

బిగ్ బాంగ్ థియరీ యేమని చెప్తూవుందంటే, ఆదిలో ఏమిలేవని అంటే పదార్ధము శక్తి స్పేస్ టైం ఈ భౌతిక సూత్రాలు ఏవిలేవని అప్పుడు ఒక అణువుకన్నా ఒక చిన్న పరిణామములో ఒక బిందువు ఉద్భవించిందని అది విపరీతమైన ఎనర్జీ తో కొన్ని ట్రిలియన్స్ డిగ్రీల టెంపరేచర్ తో ఉండేదని అది ఉన్న ప్రదేశాన్ని కూడా అది కొన్ని ట్రిలియన్స్ డిగ్రీల టెంపరేచర్ స్థాయికి  తీసుకు వెళ్లిందని చెప్తూవుంది. అయితే శూన్యము నుండి ఆ బిందువు తనకు తానుగా ఎలా ఉద్భవించింది, ఏమి జరిగింది, అందుకు దోహదపడిన కారణాలు ఏమిటి? అది ఎలా ఫ్యూజ్ అయ్యింది? అది ఎలా విభిన్నమైనవాటిగా విభిన్నమైన స్వభావాలతో మార్పు చెందింది, అనే దానిని సైన్స్ ఇప్పటికి చెప్పలేకపోతుంది. ఈ మధ్య కాలములో జేమ్స్ వెబ్ టెలీస్కోప్ ఈ సిద్ధాంతాన్ని తప్పు అని చెప్తూవుంది.

అదే సమయములో శూన్యము నుండి బిందువు ఏర్పడడానికే అవకాశమే లేనప్పుడు దేవుడేలా ఉన్నాడు అని సైన్స్ ప్రశ్నిస్తూవుంది, జోక్ కాకపోతే ఏమిటండి, ఈ ప్రశ్నకు జవాబుగా, ఈ సృష్టిలో ప్రతిదీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో రూపింపబడివుండటం, విభిన్నమైన లేఔట్స్, అవన్నీ భౌతిక నియమాలకు కట్టుబడి వ్యవస్థీకృతముగా ఉండటం అనేక సంస్థాగత కాన్ఫిగరేషన్లు వాటిని అర్ధం చేసుకొనేందుకు అవసరమైన ఒక నిర్దిష్టమైన మాన్యువల్ ఉండడం ఆశ్చర్యము కలిగించుట లేదా? అది దైవము యొక్క ఉనికిని నిర్ధారించడం లేదా?

ఈ రోజు, మనం వాడుకొంటున్న ప్రతిదాని వెనుకా దానిని సృష్టించిన మనకు తెలిసిన శాస్త్రవేత్తలు ఉన్నారు. మరి సమస్తమును కట్టినవాడు దేవుడే అని సృష్టికర్త అనేవాడు ఒకడు ఉన్నాడని బైబులు హెబ్రీ 3:3,4లో చెప్తూ, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధజలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని చెప్తూ పదార్థం, శక్తి, స్పేస్ టైం మరియు వెలుగుకు మధ్యనున్న కనెక్షన్ గురించి స్పష్టముగా చెప్తూవుంది కదండి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl