
దేవుడు మాత్రమే శాశ్వతుడు మరియు సృష్టించబడనివాడు అని బైబిల్ చెబుతుంది (ఆదికాండము 1:1; యోహాను 1:1-2).
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అను ఆదికాండము 1:1 దేవుని గురించి ఏయే విషయాలు తెలియజేస్తూ ఉన్నదంటే, 1. ఆదిలో దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నాడని, ఆయన ప్రమాదవశాత్తు ఉద్భవించిన వాడు కాడని; ఆయన ఉనికికి మూలము లేదని; ఆయన స్వయం అస్తిత్వం ఉన్నవాడని; ఆయన సంపూర్ణ స్వయం సమృద్ధి గలవాడని; సంపూర్ణ స్థిరత్వం ఉన్నవాడని; ఆయనకి జీవనోపాధి అవసరం లేదని; ఆయన అదృశ్యుడని శాశ్వతుడని చెప్తూవుంది; 2. ఈ వచనంలో ఇక్కడ దేవుడు అనే మాటకు, హీబ్రూ బైబిలులో ఎలోహిం అనే పదం వాడబడింది. అది దేవుడు అనే మాట బహు వచనమని, పులింగమని తెలియజేస్తూ ఏకవచన అర్థంతో ఉపయోగించబడి ఆయన అవిభాజ్యుడని కూడా చెప్తూవుంది; 3. ఆయన సర్వశక్తిమంతుడని, ఒక ప్రదేశానికే పరిమితం కాకుండా ప్రతి ప్రదేశంలో ప్రత్యక్షంగా వున్నవాడని; ఆయన అనంతుడని; ఆయన ఏ రూపాన్ని అయినా తీసుకోగలడని; ఆయనను సమయం లేదా స్థలం బంధించలేదని; ఆయనను కొలవలేమని; ఆయన సద్గుణాలలో, సమర్థతలో, దృష్టి జ్ఞానంలో మరియు శక్తిలో మాత్రమే కాకుండా, ఆయన తన భగవద్ద్దతమైన అంతస్తత్త్వములో మరియు వ్యక్తిగత స్వభావములో కూడా అనంతము; అపారము; మరియు పరిపూర్ణుడై యున్నాడని, యిర్మీయా 23:24 చెప్తూ, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా– నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశములయందంతట నున్నవాడను కానా? యిదే యెహోవావాక్కు అని తెలియజేస్తూవుంది; 4. శూన్యము నుండి ఇప్పుడు మనం చూస్తున్న సమస్తమును ఆయన ఒక పాయింట్ అఫ్ టైములో సృజించియున్నాడని, (ఆయన సృష్టికర్తయైయున్నాడని); 5. ఆయన సృజించిన వాటిలో ఉన్న వాటి సంక్లిష్టతనుబట్టి ఆయన మహా జ్ఞానుడని; 6. ఆయన జీవమునకు మూలమని చెప్తూవుంది; దేవుని ఈ గుణగణాలను బట్టి ఆయన అసాధారణ మైనవాడు అని అర్ధమవు తువుంది. అసాధారణమైన ఆ దేవుని రూపమేలా ఉంటుంది అనే ప్రశ్న మనకు సహజముగా రావొచ్చు. దీనికి జవాబు, యోహాను 4:24 చెప్తూ, దేవుడు ఆత్మయై యున్నాడని తెలియజేస్తూవుంది. అంటే భగవంతునికి శరీరం లేదని ఆయన పదార్థంకాడని; పదార్ధ సమ్మిళితమైన వాడు కాడని; భాగాలతో కూడుకొన్నవాడు కాడని తెలియజేస్తూవుంది.
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెనను, యోహాను 1:1,2 దేవుని గురించి ఏయే విషయాలు తెలియజేస్తూ ఉన్నాయంటే, ఏదైనా ఉనికిలో ఉండకముందే, దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నాడని, ఒక పాయింట్ అఫ్ టైములో, ఆయన సృజించుట ప్రారంబించాడని, దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నప్పుడు, యేసు కూడా ఆయనతో ఉన్నాడని, దేవుడు పులింగము బహువచనమనే దానిని ఈ వచనాలు చెప్తూవున్నాయి. వాక్యం అనే మాట, యేసు దేవుడని, ఆయన దేవుడు మాత్రమే కాదు, ఆయన దేవునితో ముఖాముఖిగా ఉన్నాడని, పరస్పర సంబంధంలో ఉన్నాడని, భిన్నంగా ఉన్నాడని తండ్రితో ఒక్కడే అని చెప్తూవున్నాయి. కొలొస్సయులకు 1:15, ఆయన అదృశ్య దేవుని స్వరూపుడని; తీతుకు 2:13, ఆయన మహా దేవుడని; హెబ్రీయులకు 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునైయుండి, తన మహత్తు గల మాటచేత, సమస్తమును నిర్వహించుచు, ఉన్నవాడని; కొలొస్సయులకు 1:17 ఆయన అన్నిటికంటె, ముందుగా ఉన్నవాడని, ఆయనే సమస్తమునకు, ఆధారభూతుడని యేసుని గురించి స్పష్టముగా తెలియజేస్తూవున్నాయి. సమస్తమును ఆయన మూలముగా కలిగెను అను మాటలు, దేవుడు లేకుండా చేసినది ఏదీ లేదని, చెప్తూ, సృష్టించబడినవి మరియు సృష్టించబడనివి, అను రెండు విషయాలను గురించి మాట్లాడుతూ, సృష్టింపబడినవి జీవులు అని, వాటి సృష్టికర్త దేవుడని; క్రీస్తు, సృష్టించబడలేదని, ఆయన సృష్టిని చేసాడని; ఆయన దేవుడని చెప్తూవున్నాయి.
దేవుడు సమస్తమును ఆరు రోజులలో సృష్టించాడని బైబిల్ భోదిస్తూవుంది (ఆదికాండము 1; నిర్గమకాండము 20:11). ఇందులో దేవదూతలు కూడా ఉన్నారని కొలొస్స 1:16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వము లైనను ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెనని చెప్తూవుంది. దేవుడు దేవదూతలను సృష్టించినది సృష్టి చేసిన మొదటి వారములో ఏ రోజున అనేది బైబిల్ మనకు చెప్పటం లేదు.
దేవదూతల సృష్టి సమయం మనకు ఒక రహస్యం, అయితే వారి ఉనికి కాదు. భూమిపై దేవుని పిల్లలకు సేవ చేయడంలో వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారని తెలుసుకోవడం ఎంతో అద్భుతమైన విషయం (కీర్తనలు 103:20; హెబ్రీయులు 1:14)!
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl