బైబిల్ సంశయవాదులు గతంలో క్రైస్తవులకు జ్ఞానం లేకపోవడం వల్ల బైబిల్ విశ్వాసులను వెర్రివారిగా చూడడానికి ప్రయత్నించారు (కొన్నిసార్లు విజయం సాధించారు).

కయీన్‌కు భార్య ఉంది. ఆదికాండము 4:17 కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను. ఇంకా ఆదాము హవ్వల పిల్లలు – కయీను, హేబెలు మరియు షేతు – అందరూ మగవారే. ఆదాము హవ్వలకు ఇతర పిల్లలు ఉన్నారని ఆదికాండము చెబుతున్న వాస్తవంలో ఈ పజిల్‌కు పరిష్కారం కనుగొనబడింది.

షేతు జన్మించిన తరువాత, అతడు కుమారులను కుమార్తెలను కనెను, ఆదికాండము 5:4. కాబట్టి, కయీను తన సోదరిని లేదా మేనకోడలిని వివాహం చేసుకొనే అవకాశం ఉంది.

కయీనుకు భార్యను సమకూర్చడం కోసం మరొక జాతి మానవులు లేదా సెమీ మానవులు ఉండవలసిన అవసరం లేదు. ఆదికాండాన్ని లిటరల్ హిస్టరీగా అంగీకరించని కొందరి ప్రశ్న ఇది.

కయీను తన సోదరిని వివాహం చేసుకుని ఉండవచ్చనే ఆలోచనను కొందరు వ్యతిరేకిస్తారు. జీవసంబంధ మైన వైకల్యాలతో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉన్నందున నేటి మన కాలపు చట్టాలు దానిని ఖండిస్తున్నాయి. కాని ప్రపంచపు తొలి చరిత్రలో పరిస్థితి అలా లేదు. దగ్గరి బంధువులు వివాహం చేసుకోకూడదని దేవుని చట్టం మోషే కాలం వరకు ఇవ్వబడలేదు (లేవీయకాండము 18-20).

యుగాలుగా మనుషుల జన్యువులలో లోపాలు ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ జన్యుపరమైన లోపాలు మానవులందరికీ ఒకేలా ఉండవు, కాని తల్లి తండ్రుల బంధం దగ్గరైతే, కొన్ని తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి మరియు తల్లి ఇద్దరి జన్యువులలో లోపాలు ఉన్నప్పుడు పిల్లలకు శారీరక వైకల్యాలు సంభవిస్తాయి. అదే దగ్గరి సంబంధము కానట్లయితే అది చాలా తక్కువగా ఉంటుంది. లోపం తల్లిదండ్రుల నుండి వారసత్వంగా సంక్రమించే అవకాశం ఉంది. వారి పిల్లల (పురుషులు)లో కూడా కనిపిస్తుంది. ఆదాము హవ్వల వంటి తొలి మానవుల విషయంలో – పరిపూర్ణంగా సృష్టించబడిన – మరియు వారి తక్షణ వారసుల విషయంలో, ఈ జన్యుపరమైన లోపాలు ఉద్భవించడానికి చాలా తక్కువ సమయం ఉంది మరియు చాలా సన్నిహిత బంధువులు వివాహం చేసుకున్నప్పటికీ వైకల్యానికి చాలా తక్కువంటే తక్కువ అవకాశం ఉంది.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.