జన్మ పాపము

ఈ సిద్ధాంతానికి బైబిలే ఆధారం. ఇది ఆదికాండము 3 వ అధ్యాయములో ఆదాము హవ్వలు  ఏదేను తోటనుండి నుండి బహిష్కరింపబడినప్పటినుండి మొదలయ్యింది. ఆదాము హవ్వలు అనే మొదలు అపవిత్రమై శాపగ్రస్తమయినప్పుడు ఈ మొదలునుండి వచ్చే అన్ని కొమ్మలు అపవిత్రముగానే శాపగ్రస్తముగానే ఉంటాయి తప్ప పాపము చెయ్యక మునుపు ఆదాము హవ్వలు ఉన్నటువంటి దీవెనకరమైన స్థితిని పుణికి పుచ్చుకొని వుండవు.

ఆదాము హవ్వలు దేవుని ఆజ్జ్యను అతిక్రమించడం, ఆజ్ఞాతిక్రమమే పాపము అని రోమా 6:23 చెప్తూవుంది. వాళ్ళు దేవుని ఆజ్జ్యను ఉదేశ్యపూర్వకముగా మీరడమంటే చెడగొట్టుకోవడమే, వాళ్ళు తమ స్వీయ స్వయంకృత అపరాధ మూలముగా తమస్వభావమునకు లోపములను కలుగచేసుకొనేటట్లు అదిచేసింది. ఉదాహరణకు, ఒక యంత్రము లో వున్న మీటను ఎటు త్రిప్పకండి, యంత్రము చెడిపోతుంది అని మనకు చెప్పబడియున్నప్పటికి త్రిప్పామను కోండి. యంత్రము చెడిపోతుంది, చెడిపోయిన తరువాత మనం చేయగలిగినది ఏమి ఉండదు. దానిని తాయారు చేసిన వాడు మాత్రమే దానిని బాగుచేయగలడు. అతడు రావలసిందే. మంచి చెడు ఫలమును కోరుకోవడమంటే, దేవునిఆజ్జ్యను ధిక్కరించడమే దేవుని ఆజ్జ్యను ఉదేశ్యపూర్వకముగా అతిక్రమించడమే. వాళ్ళు ఫలమును తిన్న తరువాత, వాస్తవంలో వారి స్వభావము మునుపటికంటే భిన్నముగా మారిపోయింది తప్ప, వాళ్ళు ఆశించినట్లుగా వాళ్ళ స్థితి మారలేదు వాస్తవ పరిస్థితులు మారలేదు. వాళ్ళు తమ్మును తాము చేజేతులా పాడుచేసుకొని యున్నారని శిక్షకు పాత్రులుగా శాపగ్రస్తులుగా చేసుకొన్నామనే విషయం వాళ్లకి అర్ధమయ్యి, ఆయన తీర్పు తీర్చునని యెరిగి ఆయన వచ్చినపుడు ఆయన యెదుటికి రాలేక దాక్కున్నారు. తమ్మును తాము బాగుచేసు కోలేని రీతిగా పాడుచేసుకొని యుండుటనుబట్టి ఆదాము హవ్వలు భయపడ్డారు, క్రియల ద్వారా దేవుని ఆజ్జ్యలను నెరవేర్చుటకు కావలసిన సామర్ధ్యాన్ని పోగొట్టుకోవడమే కాకుండా నిర్దోషత్వమును నీతిని కోల్పోయారు. వాళ్లకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు, ఎలా బాగుచేసుకోవాలో అర్ధం కాలేదు, వాళ్ళు పాడుచేసుకొనినది దేవుడు వారి కిచ్చిన ధన్యకరమైన ఒరిజినల్ స్థితిని. ఆ కారణాన్ని బట్టే పరిశుద్ధ గ్రంధము జన్మ పాపాన్ని ఒక a) లోపంగా, నీతి లేకపోవడం అని; b) చెడుకోరికలు అని చెప్తూవుంది. పతనం తర్వాత జన్మించిన ప్రతిఒక్కరు పాపులుగా పాపమునుబట్టి కళంకితులుగా వున్నారు.

దావీదు కీర్తన 51:5లో దీనిని గురించే మాట్లాడుతూ, “నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్నుగర్భమున ధరించెను“అని చెప్పియున్నాడు. అపోస్తులుడైన పౌలు కూడా రోమా పత్రిక 5:12లో, “ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని ఇతడు కూడా దావీదు చెప్పిన విషయాన్నే చెప్తూ వున్నాడు. దీని అర్ధం, ఆదాము హవ్వల నుండి ప్రతిఒక్కరు, జన్మతః పాపులుగా అంటే (లోపముతో వంశపారంపర్యవ్యాధితో జన్మిస్తున్నవారిగా) వున్నారని, ఆదాము హవ్వలనుండి అందరికి వారసత్వం గా వచ్చిన చెడిపోయిన స్వభావంనుబట్టి మానవాళి అంతా పూర్తిగా చెడిపోయివున్నారని, మనం, మనం చేసే ప్రతిదీ పాపంతో కలుషితమై ఉందని, కాబట్టే ప్రతిఒక్కరు మరణము యొక్క అధికారము క్రింద వున్నారని ఈ మాటలు తెలియజేస్తూ వున్నాయి. దీనినే జన్మతా వచ్చే పాపము అని అంటూ వున్నాం.

లేఖనాలు జన్మతా వచ్చే పాపాన్ని గురించి తెలియజేస్తూ, దీనిని, a) రోమా 7:17లో, కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమేగాని నేను కాదు, (indwelling sinగా) b) రోమా 7:23లో, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొను చున్నది, (law in the members గా) c) యాకోబు 1:14-15 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింప బడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును (lust గా) తెలియజేస్తూవున్నాయి.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.