ఒకడు మరణించిన క్షణం నుండి అంత్యదినము మధ్యన పరలోకములో లేదా నరకములో వుండే ఆత్మలు భూమిపై ఏమి జరుగుతుందో చూస్తూవుంటారనే విషయాన్ని గురించి బైబిల్ ఎక్కువ సమాచారాన్ని వెల్లడించడం లేదు. ఒకడు చనిపోయినప్పుడు, వాని శరీరం మరియు ఆత్మ ఒకదానినుండి మరోకొకటి విడిపోతాయని బైబిల్ చెప్తూ వుంది (ప్రసంగి 12:7 మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును). వాడు  యేసుక్రీస్తుపై విశ్వాసం లేదా అవిశ్వాసం ఆధారంగా పరలోకపు మహిమలను అనుభవిస్తూ ఉంటాడు లేదా నరకం యొక్క భయానకతను అనుభవిస్తూ ఉంటాడు (మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింప బడును).

బైబిల్ పరలోకాన్ని సంపూర్ణసంతోషము గల ప్రదేశమని వర్ణిస్తూ (కీర్తన 16:11 నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు; ప్రకటన 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని) చెప్తూవుంది. పరలోకంలో పరిపూర్ణ సంతోషములో వుంటూ భూమిపై జరుగుతూ ఉన్న పాపభరితమైన వాటిని చూడగలిగితే, ఆ పరిపూర్ణ సంతోషాన్ని ఎలా పొందగలరు? ఈ ప్రశ్నకు మద్దతుగా కొందరు, కీర్తన 88:10-12 వంటి భాగాలను సూచిస్తారు (మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తి లోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు; భూమిపై ఏమి జరుగుతుందో ఆత్మలకు తెలియదు.

పరలోకంలో ఉన్న ఆత్మలు తమ రక్షకుడైన దేవునితో వుంటారు (ఫిలిప్పీయులకు 1:23 ఈ రెంటిమధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు). వారు ఆయనను ఎప్పటికీ ముఖాముఖిగా చూస్తూవుంటారు  (1 యోహాను 3:1-2 మనము దేవుని పిల్లల మని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనయున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము). అది క్రైస్తవులు ఆసక్తిగా ఎదురుచూసే విషయం!

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.