క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేప్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. (పరిశుద్ధ గ్రంధము BSI)

క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్గాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. (పవిత్ర బైబిల్ వెర్షన్)

విశ్వాసంలో నీవు పాల్గొనడం క్రీస్తులో మనకు ఉన్న ప్రతి మంచినీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం లో మరింత చురుకుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ 2019)

క్రీస్తు కొరకు మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో జతపనివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. (తెలుగు సమకాలీన అనువాదము)

నీ విశ్వాస విషయములో ఇతరులతో సహవాసం చేయడంవల్ల క్రీస్తు ద్వారా మీకు కలిగిన ప్రతి మంచి దానిని నీవు పూర్తిగా తెలుసుకోవాలని నా ప్రార్ధన. (పవిత్ర గ్రంధము వాడుక భాషలో)

విశ్వాసము నందు మీతోడి మా సహవాసము మనము క్రీస్తునందు కలిగివున్న ప్రతి ఆశీర్వాదమును మరింత సుభోదక మొనర్చును గాక అని నా ప్రార్థన. (రోమన్ క్యాథెలిక్ వెర్షన్)

6 ὅπως ἡ the κοινωνία τῆς πίστεώς σου ἐνεργὴς γένηται ἐν ἐπιγνώσει παντὸς ἀγαθοῦ τοῦ ἐν ἡμῖν εἰς Χριστόν   That the communication of thy faith may become effectual by the acknowledging of every good thing which is in you in Christ Jesus.

And I pray that the sharing of your faith may become effective for the full knowledge of every good thing that is in us for the sake of Christ. (Lutheran study bible)