పాఠము 1

బైబిల్ బ్యాక్ గ్రౌండ్ ద్వారా ప్రాథమికమైన బైబులు చరిత్రను జియోగ్రఫీతో పాటు అప్పటి ప్రజల అనుదిన జీవన విధానమును, బైబులు కాలం నాటి ఆచారములను అధ్యయనం చేధ్ధాం మరియు బైబులు మన దగ్గరకు ఎలా వచ్చిందో తెలుసుకొందాం. బైబులును చక్కగా అర్ధం చేసుకొనే క్రమములో మొదటిగా ఇశ్రాయేలు దేశమును గురించి దాని చుట్టూ ఉన్న దేశాలను గురించి ఒక అవగాహన కలిగి ఉండవలసి యున్నాము. ఈ మొదటి పాఠములో మనం ఇశ్రాయేలు చుట్టూ ప్రక్కల వుండే ఇతర దేశాలను గురించి మొదటిగా తెలుసుకొందాం.

  • ప్రాముఖ్యమైన స్థలములో ఇశ్రాయేలు ఎందుకని ఉందొ సంక్షిప్తముగా తెలుసుకొందాం. 
  • “నెలవంక ఆకారములో ఉన్న సారవంతమైన ప్రాంతము” యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొందాం.
  1. ఇశ్రాయేలు దేశము దాని చుట్టూ ప్రక్కల వుండే ఇతర దేశాలు

దిగువున ఉన్న ప్రపంచ పటములో 1. ఉత్తర అమెరికా 2. దక్షిణ  అమెరికా 3. యూరప్  4. ఆఫ్రికా  5. ఆసియా  6. ఆస్ట్రేలియాను గుర్తించండి. ఇశ్రాయేలు దేశము వ్యూహాత్మకంగా యూరప్ ఆఫ్రికా ఆసియా ఖండాలా మధ్యలో ఉండటాన్ని గమనించండి.

                                               ప్రపంచ పటంలో  ఇశ్రాయేలు స్థానం

  • ఇశ్రాయేలు మరియు ప్రాచీన తూర్పు ప్రాచ్యము

దేవుని ప్రణాలికా ఉదేశ్యము ప్రకారము, ఇశ్రాయేలు దేశము చాలా ప్రాముఖ్యమైన స్థలములో ఉంది. ఇశ్రాయేలు ఉన్న ప్రాంతము నేడు తూర్పు ప్రాచ్యముగా పిలువబడుతూ ఉంది. దీనికై దిగువున ఇవ్వబడిన తూర్పు ప్రాచ్యము యొక్క పటమును చూడండి. ప్రపంచములోని ఈ ప్రాంతములోనే ప్రాచీన చరిత్రలోని ప్రాముఖ్యమైన ఎన్నో సంఘటనలు జరిగాయి. ఏదెను తోట ఈ ప్రాంతములోనే ఉండి ఉండొచ్చు. ప్రపంచములోని ఈ ప్రాంతములోనే బైబిలులోని అనేకమైన సంఘటనలు జరిగాయి. ఇశ్రాయేలు తూర్పు ప్రాచ్యమునకు మధ్యలో ఉన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

పైన ఉన్న పటంలో, బైబులు కాలం నాటి ప్రాముఖ్యమైన ప్రాంతాల పేర్లను చాల స్పష్టముగా చూడగలరు. (తరచుగా నాగరికతకు పుట్టినిల్లుగా పరిగణింపబడుతూ ఉన్న) మెసపటోమియాలో అత్యంత శక్తివంతమైన రాజ్యాలైన సుమేరియా బబులోను అస్సిరియా ఉండేవి. ప్రాచీన నాగరికత కలిగిన దేశమైన ఐగుప్తు యేసు జన్మించుటకు ౩౦౦౦ సంవత్సరాలకు పూర్వమే ఉనికిలో ఉంది. సిరియాగా పిలువబడుతున్న దేశం (ఇదే ప్రాంతములో ఉన్న నేటి సిరియా దేశము కంటే పెద్దది మహా శక్తివంతమైనది) దమస్కు, తూరు, సీదోను, హిత్తీయుల శక్తివంతమైన రాజ్యాలకు నిలయముగా ఉండేది. పశ్చిమాన, యూరప్ లో, శక్తివంతమైన రాజ్యాలైన గ్రీసు మరియు రోమ్ ఉండేవి. ఈ రెండూ మన రక్షకుని రాకడకు ముందు తూర్పు ప్రాచ్యములో జరిగిన సంఘటనలపై మరియు క్రీస్తు పునరుత్థానం తరువాతి శతాబ్దాలలో క్రైస్తవ చర్చి స్థాపనలో కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపాయి.

ప్రాచీన కాలములో ఈ శక్తివంతమైన రాజ్యాలు ఒకదాని ఫై ఒకటి ప్రభావాన్ని కలిగి ఉండెడివి. తరచుగా ఇది వర్తక రూపము లో ఉండెడిది అట్లే అనేక సందర్భాలలో ఇది యుద్ధము రూపములో కూడా ఉండెడిది. వారి కలయికకు కారణము యేదైన ప్పటికిని, ఈ transactions లావాదేవీలు జరగడానికి తరచుగా ఈ రాజ్యాల యొక్క వ్యాపారులు, సైన్యాలు ఇశ్రాయేలు యొక్క ప్రధాన మార్గాల్లోనే ప్రయాణించాల్సి ఉండటం ప్రాచీన ప్రపంచంలో ఇశ్రాయేలు దేశము యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా చూపెడుతూ ఉంది. దేవుడు అబ్రాహామును ఇశ్రాయేలు దేశానికి నడిపించి, ఈ దేశాన్ని అతని సంతానానికి ఇచ్చేందుకు బహుశా ఇది ఒక కారణం కావచ్చు. వ్యాపారులు సైన్యాలు ఇశ్రాయేలు గుండా వెళ్ళినప్పుడల్లా వారికి ఇశ్రాయేలు దేవుని గురించి వినడానికి అవకాశం ఉండెడిది. తాను ఇశ్రాయేలుకు బయలుపరచియున్నట్లే ఈ దేశాలన్నీ కూడా ఆయనను మరియు వారి పట్ల ఆయన కున్న చిత్తాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునియందు భయభక్తులు కలిగిన జీవితాలను గడపాలని వారి మాటలు క్రియల ద్వారా ఆయన సత్యాలను పంచు కోవాలని కోరుకున్నాడు. తద్వారా, ఇశ్రాయేలు ఉదాహరణ ద్వారా ఇతర దేశాలు కూడా నిజమైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసుకుంటారు. వారిని వారి దేశాన్నిదేవుడు  వ్యూహాత్మక ప్రదేశంలో ఉంచిన కారణంగా ఇశ్రాయేలీయులు దేవుడు కోరుకున్నది చేసే అద్భుతమైన అవకాశాన్ని కలిగియున్నారు.

  • నెలవంక ఆకారములో ఉన్న సారవంతమైన ప్రాంతము

                                    నెలవంక ఆకారములో ఉన్న సారవంతమైన ప్రాంతము

నేడు మధ్య ప్రాచ్యము అని పిలువబడుతూవున్న తూర్పు ప్రాచ్యమునకు మరొక అదనపు ఫీచర్ (గొప్పతనము) వుంది. ఇది మెసొపొటేమియా మొదలుకొని సిరియా మరియు ఇశ్రాయేలు దాకా విస్తరించి వుంది. నెలవంక ఆకారములో ఉన్న ఈ సారవంతమైన ప్రాంతమును Fertile Cresent గా పేర్కొంటారు. ఈ నీడ ఉన్న ప్రాంతం చాలా సారవంతమైన భూమి, వివిధ రకాల పంటలను పండించడానికి చాలా అనువైనది. నెలవంక ఆకారములో ఉన్న ఈ సారవంతమైన ప్రాంతము నకు బయట ఉన్న నేలలో ప్రధానంగా పర్వతాలు, అరుదైన వృక్షసంపద మరియు ఎడారి ఉంది.

కాబట్టే నెలవంక ఆకారములో ఉన్న సారవంతమైన ప్రాంతం చాలా విలువైన ఆస్తిగా మారింది. శక్తివంతమైన దేశాలు తమ జనాభాకు మద్దతు ఇవ్వడానికి ఈ ప్రాంతాన్ని జయించటానికి ప్రయత్నించాయి. నెలవంక ఆకారములో ఉన్న సారవంతమైన ప్రాంతములో నీరు మరియు ఆహారం పుష్కలంగా ఉన్నందున, అనేక పెద్ద నగరాలు ఈ ప్రాంతంలో వెలిసాయి. ఇశ్రాయేలు ఈ సారవంతమైన ప్రాంతములోని గొప్ప వనరులను అనుభవించుటకే కాకుండా దాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి ఈ ప్రాంతంలో జాగ్రత్తగా ఉంచబడిందని గుర్తించండి. దేవుడు తన ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని జాగ్రత్తగా ఎంచుకొని యున్నాడు.

ప్రశ్నలు

  1. ఇశ్రాయేలు చుట్టూ ఉన్న 3 ఖండాలు ఏవి____________, _____________, మరియు ______________.
  2. ఇశ్రాయేలు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తరచుగా __________________________________________ అంటారు.
  3. ఇశ్రాయేలు చుట్టూ ఉన్న ఐదు ముఖ్యమైన భౌగోళిక ప్రాంతాలు ఏవి 1)______________ 2) _____________

3)_________________ 4) ________________ 5) ____________________.

  1. ఇశ్రాయేలు పంటలు పండించడానికి అనుకూలమైన ప్రాంతంలో ఉంది దీనిని____________అంటారు.

5. తూర్పు ప్రాచ్యములోని శక్తివంతమైన దేశాలు ఇశ్రాయేలు నేలను _______________________ మరియు        

    _____________________ ఉపయోగించుకొన్నాయి.

6. ఇశ్రాయేలు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని “సారవంతమైన నెలవంక” అని ఎందుకు పిలుస్తారో వివరించండి?

   ____________________________________________________________________________

   ____________________________________________________________________________

7. దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని తన ప్రజలకు నివాసంగా ఎందుకు ఎంచుకున్నాడో 2 కారణాలను ఇవ్వండి?

   1. __________________________________________________________________________

   2. __________________________________________________________________________

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.