భూమి వయస్సు ఎంత?

శాస్త్రవేత్తలేమో భూమి వయస్సు కొన్ని కోట్ల సంవత్సరాలని చెప్తూవున్నారు. బైబిల్ పండితులు ఏమో భూమి వయస్సు అంతుండదని చెప్తూవున్నారు. ఎవరు కరెక్ట్?

భూమి వయస్సును అంచనా వెయ్యడానికి బైబిల్ పండితులకు ఉన్న ఏకైక “సోర్స్” బైబిల్లోని వివిధ వంశావళులే. బైబిల్ పండితులు బైబిల్లోని వివిధ వంశావళులను పరిశీలించడం ద్వారా భూమి వయస్సును గరిష్టముగా అంచనా వేసి చెప్పేదేమిటంటే భూమి వయస్సు కొన్ని కోట్ల సంవత్సరాలు కాదని బైబిల్లోని వంశావళుల ఆధారంగా భూమి వయస్సు 6,000 సంవత్సరాలకు దగ్గరగా ఉండొచ్చని చెప్తూవున్నారు.

సెక్యూలర్ సైంటిస్ట్స్ ఏమో భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలని చెప్తూ వున్నారు. అందుకు వాళ్ళు రేడియో మెట్రిక్ డేటింగ్ అనే పద్దతిని ఎంచుకొని రాళ్లను డేటింగ్ చేసి భూమి వయస్సును నిర్ధారించారు. రేడియో మెట్రిక్ డేటింగ్ అంటే ఒక శిలలో ఉన్న నిర్దిష్ట రేడియో ధార్మిక ఐసోటోపుల యొక్క సాపేక్ష నిష్పత్తులను నిర్ణయించడం ద్వారా భూమి యొక్క వయస్సును తెలుసుకొనే పద్ధతిని రేడియో మెట్రిక్ డేటింగ్ అంటారు.

రేడియో మెట్రిక్ డేటింగ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకొందాం_ శిలల్లో ఉన్న కొన్ని రేడియో ధార్మిక మూలకాలు కాలక్రమేణా అదే శిలల్లో ఉన్న ఇతర మూలకాలలోకి క్షీణించిపోతాయని శాస్త్రవేత్తలు తెలుసుకొన్నారు; అసలైన రేడియో ధార్మిక మూలకాలను పేరెంట్ ఎలిమెంట్స్ అని పేరెంట్ ఎలిమెంట్స్ ఇతర మూలకాలలోకి క్షీణించినప్పుడు ఏర్పడే కొత్త మూలకాలను డాటర్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు ఈ రేడియో ధార్మిక మూలకాల క్షీణత రేటును నిర్ణయిస్తూ ఈ పద్ధతి ద్వారా కొన్ని శిలల వయస్సును మిలియన్ బిలియన్ సంవత్సరాలని చెప్తూ వున్నారు.

ఈ రేడియో మెట్రిక్ డేటింగ్‌తో ఉన్న సమస్య ఏమిటంటే, ఈ పద్ధతి కనీసం మూడు ఊహాగానాలపై  ఆధారపడి ఉంది, కాబట్టి ఈ పద్దతి ఖచ్చితమైనదని చెప్పటం సాధ్యం కాదు. మొదటి assumption ఏమిటంటే, ఒక శిల మొదటిగా ఏర్పడినప్పుడు ఆ శిలలో ఎంత పేరెంట్ ఎలిమెంట్ మరియు డాటర్ ఎలిమెంట్ ఉందో ఊహించి చెప్పటం తప్ప ఖచ్చితముగా ధృవీకరించడం సాధ్యం కాదు; Ex: ఒక భూవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక పర్వత ప్రాంతం నుండి ఒక శిలను తెచ్చి ప్రయోగశాలలో దానిలో ఉండే ఇతర ఇండివిడ్యువల్ మినరల్స్ను వేరుచేస్తాడు. అలా వేరు చేసినప్పుడు అప్పుడు ఒక పేరెంట్ ఎలిమెంట్ మాత్రమే మిగులుతుంది. దానిని మాస్ స్స్పెక్ట్రోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి, ఆ ఖనిజంలో పేరెంట్ ఎలిమెంట్ డాటర్ ఎలిమెంట్ మొత్తం ఇంత ఉండవచ్చని ఊహించి ఆ నిష్పత్తిని బట్టి ఆ శిల వయస్సు ఇంత ఉంటుందని చెప్తాడు.

రెండవ assumption ఏమిటంటే, రేడియో మెట్రిక్ డేటింగ్ పద్ధతి రేడియో ధార్మిక క్షయం సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అన్ని రేడియో ధార్మిక ఐసోటోప్‌లు సగం -జీవితాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. మిగతా సగం పేరెంట్ ఎలిమెంట్ క్షీణించడానికి పట్టే సమయం తెలియజేస్తుంది అన్నమాట. ఒక శిలలో పేరెంట్ ఐసోటోప్ (రేడియోయాక్టివ్) మరియు డాటర్ ఐసోటోప్ (రేడియోజెనిక్) కొలవడం ద్వారా, ఆ శిల ఎంతకాలం క్రిందట ఏర్పడింది ఊహించి చెప్తాడు. శిల ఏర్పడినప్పటి నుండి క్షయం రేటు మారదు; కాని అది ఇంత అని మనం ఖచ్చితముగా ధృవీకరించడం సాధ్యం కాదు.

మూడవ assumption ఏమిటంటే, రేడియో మెట్రిక్ డేటింగ్ రసాయన శాస్త్రం మరియు వివిధ మూలకాల నిష్పత్తులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, జిర్కాన్, అనే ఒక ఖనిజాన్ని తీసుకోండి; దాని రసాయన సూత్రం ZiSiO4, అంటే ఒక జిర్కోనియం (Zi) ఒక సిలికాన్ (Si) నాలుగు ఆక్సిజన్ (O) అన్నమాట. జిర్కాన్ కోసం రసాయనికంగా నిలబడగల మూలకాలలో ఒకటి యురేనియం. యురేనియం చివరికి సీసంగా క్షీణిస్తుంది మరియు యురేనియం యొక్క రేడియో ధార్మిక క్షయం ఉత్పత్తి కాకుండా, జిర్కాన్‌లో సీసం సాధారణంగా జరగదు. అందువల్ల, జిర్కాన్ క్రిస్టల్‌లో యురేనియం సీసం నిష్పత్తిని కొలవడం ద్వారా, క్రిస్టల్‌లో వాస్తవానికి యురేనియం ఎంత ఉందో తెలుసుకొని యురేనియం యొక్క రేడియో ధార్మిక అర్ధ-జీవితాన్ని తెలుసుకోవడంతో పాటు, క్రిస్టల్ ఎంత పాతదో ఊహించి చెప్తాడు. శిల భూమిలో ఉన్న సమయంలో పేరెంట్ ఎలిమెంట్ మరియు డాటర్ ఎలిమెంట్ మొత్తాన్ని ఏది కూడా మార్చలేదు అనే assumptionఫై రేడియో మెట్రిక్ డేటింగ్‌ ఆధారపడి వుంది.

ఈ మూడు assumptions ఊహాగానాలలో మనం ఎక్కడైనా తప్పు చేస్తే అది తప్పుడు తేదీలను అందిస్తుందనే విషయాన్ని విస్మరించకూడదు.

కొన్ని చారిత్రాత్మక సంఘటనలు మరియు ఆవిష్కరణలు రేడియో మెట్రిక్ పద్దతి తప్పు అని చెప్తూవున్నాయి. ఉదాహరణకు, 1954లో న్యూజిలాండ్‌లోని మౌంట్ న్గౌరుహో అనే అగ్నిపర్వతం పేలినప్పుడు దాని లావా ప్రవాహాల నుండి ఏర్పడిన రాళ్లను రేడియో మెట్రిక్ డేటింగ్ ద్వారా పరిశీలించినప్పుడు అవి 3.5 మిలియన్ సంవత్సరాల నాటివని రేడియో మెట్రిక్ డేటింగ్ చెప్పడం హాస్యాస్పదం. అలాగే ఇటీవలి కాలంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఏర్పడిన గ్రాండ్ కెన్యన్ ఎగువన ఉన్న రాక్ 1 బిలియన్ సంవత్సరాల నాటిదని రేడియో మెట్రిక్ డేటింగ్ చెప్పటం ఈ పద్ధతి ఎంత తప్పో మనకు అర్ధమవుతూ ఉంది. ఆదికాండములో ఉన్న సృష్టిని నమ్మే శాస్త్రవేత్తలు రేడియో ధార్మిక డేటింగ్ యొక్క విశ్వసనీయతను పరీక్షించడానికి రేడియో ఐసోటోప్స్ మరియు భూమియొక్క వయస్సు అనే ప్రాజెక్టుని రూపొందించి పరీక్షించినప్పుడు ఆ పరీక్ష భూమి వయస్సు మిలియన్ బిలియన్ సంవత్సరాలు కాదని భూమి వయస్సు చాల చాల తక్కువని తెలియ జేసింది.

అలాగే భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాల కాదని వేల సంవత్సరాలు మాత్రమేనని చెప్పేందుకు అనేకమైన  శాస్త్రీయ “ఆధారాలు” కూడా ఉన్నాయి. భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలైతే, భూమి పొరలలో వజ్రాలలో కార్బన్ 14 కంటే చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది కాదనలేని వాస్తవo.

తరువాత, ఖనిజాలలో చాలా ఎక్కువగా హీలియం ఉంటుంది, సముద్రాలలో తగినంత ఉప్పు ఉండదు, అలాగే చమురు క్షేత్రాలలో చాలా చాల ఒత్తిడి ఉంటుంది. అంతేనా భూమి యొక్క పొరలలో నక్షత్ర ధూళి చాల చాల తక్కువగా ఉంటుంది. మన భూగ్రహం చాలా బలమైన అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంది కాబట్టి భూమికి ఉపగ్రహమైన చంద్రుడు భూమికి చాలా చాల దగ్గరగా ఉంటాడు, దానిని బట్టి భూగ్రహం యొక్క ఆకారం దాని ఖండాల ఆకారం అస్థవ్యస్థముగా ఉంటుంది. భూభ్రమణం యొక్క వేగం ఇప్పుడున్నలా కాకుండా చాల నెమ్మదిగా ఉంటుంది. ఇవన్నీ కాదనలేని వాస్తవాలు.

కాబట్టే, రేడియోమెట్రిక్ డేటింగ్‌ పద్దతిలో తప్పులున్నాయి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనిలో ఎర్రర్ మార్జిన్‌ రెండు మిలియన్ సంవత్సరాల కంటే తక్కువ, బిల్లియన్స్ కాదు అని శాస్త్రవేత్తలే చెప్తున్నారు.

అయితే మనుష్యులు సైన్స్‌ను విశ్వసించడానికి ప్రధానకారణం ఏంటంటే సైన్స్‌ ఎప్పటికప్పుడు తనను తాను సరిదిద్దు కొంటూ మార్చుకొనే దాని స్వభావమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మీకు తెలుసా? మన ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఏవి అనంత విశ్వములో ఉన్న బ్లాక్ హోల్స్లో పనిచేయవని. ఎందుకంటే సైన్స్ తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. తప్పులను సరిదిద్దుకోవాల్సింది ఎంతో వుంది. సైన్స్ అనేది అంతర్గతముగా లోపభూయిష్టమైన ఒక పక్రియ. దేనిపైనా ఇది నిశ్చయతను సాధించలేదు. నిజానికి దేవుని జ్ఞానము ఎదుట ఈ విషయములో మనం ఇంకా శిశువులమే అని ఒప్పుకోవాల్సి ఉన్నాం.

ఒకవేళ భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలని అంటే మనం పరిణామ సిద్ధాంతంకు సపోర్ట్ చేస్తున్నట్లేగా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, 4.5 బిలియన్ సంవత్సరాలలో ఆదిమ జీవ కణముల నుండి నిరోధింపలేని పురోగతి ప్రకారము మానవుడు బహుగా అభివృద్ధి చెందిన జంతువుగా తన గతికి తానే కర్తగా మార్పుచెందాడని చెప్పడమేగా. ఆలోచించండి, ఏది కరెక్టో, ఎవరు కరెక్టో?

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.