అవుట్‌లైన్;    థీమ్: యేసే మెస్సయ్య.

యేసుని జననం మరియు బాల్యము (1–2 అధ్యాయములు).

యేసుని వంశావళి (1:1–17); యేసుని పుట్టుక (1:18—25); జ్ఞానుల రాకడ (2:1-12); యేసు ఐగుప్తుకు వెళ్లడం (2:13-15); హేరోదు శిశువులను చంపించడం 2:16-18); యేసు నజరేతుకు తిరిగి రావడం (2:19-23).

యేసుని పరిచర్య ప్రారంభం (3:1—4:11).

బాప్తిస్మమిచ్చు యోహాను (3:1–6); బాప్తిస్మమిచ్చు యోహాను బోధలు (3:7-12); యేసుని బాప్తిస్మము (3:13–17); యేసుని టెంప్టేషన్ (4:1–11).  

గలిలయలో యేసు పరిచర్య (4:12—14:12).

గలిలయలో యేసుని పరిచర్య ప్రారంభం (4:12–17); యేసు తన మొదటి శిష్యులను పిలవటం (4:18-22); గలిల యలో యేసుని పరిచర్య (4:23-25); కొండమీది ప్రసంగము (5–7); మిరాకిల్స్ అఫ్ హీలింగ్: కుష్ఠరోగిని శుద్ధు నిగా చెయ్యటం (8:1-4); శతాధిపతి దాసుని స్వస్థపర్చడం (8:5-13); పేతురు అత్తను స్వస్థపర్చడం (8:14-17); శిష్యత్వం యొక్క వెల (8:18-22); మిరాకిల్స్ అఫ్ పవర్: తుఫానును నిమ్మళపర్చడం (8:23-27); దయ్యము లను పందులలోనికి వెళ్లగొట్టడం (8:28-34); పక్షవాయువుతో బాధపడుతున్న వానిని క్షమించటం (9:1-8); మత్తయిని పిలవటం (9:9-13); యోహాను శిష్యులు యేసుని శిష్యులపై ఫిర్యాదు చెయ్యడం (9:14-17); మిరాకిల్స్ అఫ్ రెస్టోరేషన్: అధికారి యొక్క చనిపోయిన కుమార్తెను బ్రతికించడం (9:18-26); గ్రుడ్డివారికి ద్రుష్టి నివ్వడం (9:27-31); మూగవానికి మాటలనివ్వడం (9:32-34); శిష్యుల ఆవశ్యకత (9:35-38); 12మంది అపొస్తలులు పంపబడుట (10:1-4); 12మంది అపొస్తలులు నిర్దేశింపబడుట (10:5-11:1); చెరలోనున్న యోహాను తన శిష్యులను యేసునొద్దకు పంపుట (11:2-15); ఈ తరమువారిని గూర్చిన యేసుని పోలిక ( 11:16-19); కొరాజీనా, బేత్సయిదా, కపెర్నహూము పట్ల యేసుని గద్ధింపు (11:20-24); తన దగ్గరకు వచ్చుటకు యేసుని ఆహ్వానము (11:25-28); విశ్రాంతిదినమున చేయకూడనిది అను దానిపై వివాదము (12:1-8); విశ్రాంతిదినమున ఊచచెయ్యిగల వానిని స్వస్థపర్చుట పై వివాదము (12:9-13); పరిసయ్యులు ఆయనను సంహరించుటకు ఆలోచన చెయ్యడం (12:14-21); దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే యేసు దయ్యములను వెళ్లగొడుతూ వున్నాడని యేసుని నిందించడం (12:22-30);  పరిసయ్యులు క్షమింపబడని పాపమును చెయ్యడం (12:21-37); పరిసయ్యులు యేసునుండి సూచకక్రియను కోరుకోవడం (12:38-45); యేసుని నిజమైన సహోదరులు ఎవ్వరు ( 12:46-50); ఉపమానాలు: విత్తువాడు విత్తనములను విత్తుట (13:1-23); గోధుమలమధ్యను గురుగులు విత్తటం ( 13:24-30); ఆవగింజను గూర్చిన ఉపమానము (13:31,32); పులిసిన పిండిని గూర్చిన ఉపమానము (13:33-35); గోధుమలమధ్యను గురుగులు విత్తటంను గూర్చిన వివరణ (13:36-43); పొలములో దాచబడిన ధనమును గూర్చిన ఉపమానము (13:44); మంచి ముత్యమునకు సంబందించిన ఉపమానము (13:45,46); నానావిధము లైన చేపలను పట్టిన వలను గూర్చిన ఉపమానము (13:47-50); ఇంటి యజమానునిని గూర్చిన ఉపమానము (13:51-53); యేసు నజరేతువారిచే తృణీకరింపబడటం (13:54-58); యేసు పట్ల హేరోదు ప్రతిస్పందించడం (14:1-12).

గలిలయ నుండి యేసు ఉపసంహరణ (14:13—17:21);

గలిలయ నుండి గలిలయ సముద్రం తూర్పు తీరానికి (14:13-15:20); యేసు 5000 మందికి ఆహారము పంచి పెట్టుట (14:13-21); యేసు నీళ్లపై నడచుట (14:22-33); యేసు గెన్నేసరెతుదేశములో అనేకులను స్వస్థ పరచుట (14:34-36); పెద్దలపారంపర్యాచారముపై వాదన (15:1-20); తూరు సీదోనుల ప్రాంతములో కనాను స్త్రీ కుమార్తెను స్వస్థపరచుట (15:21–28); గలిలయ సముద్రతీరమునకు వచ్చి దెకపొలిలో యేసు అనేకులను స్వస్థ పరచుట (15:29-31); యేసు 4000మందికి ఆహారము పంచిపెట్టుట (15:32-39); పరిసయ్యులు, సద్దూక య్యులు ఆయనను శోధించుటకు ఆకాశ ము నుండి యొక సూచక క్రియను తమకు చూపుమని అడగటం (16:1-4); దెకపొలి నుండి యేసు ఉపసంహరణ (16:5-12); యేసు ఫిలిప్పుదైన కైసరయప్రాంతములకు రావటం (16:13—17:20); మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొను చున్నారని తన శిష్యులను అడగటం (16:14-20); యేసు తన మరణమును గురించి ప్రవచించడం (16:21-23); యేసుని వెంబడింపగోరిన వారికి దొరకు బహుమానము (16:24-26);  రెండవ రాకడకు సంబందించిన ప్రవచనము (16:27,28); యేసుని రూపాంతరము (17:1-13); చాంద్రరోగిని స్వస్థపర్చడం (విశ్వాసమును గూర్చిన బోధ) (17:14-21);

గలిలయలో యేసు చివరి పరిచర్య (17:22—18:35)

యేసు తన మరణమును గురించి ప్రవచించడం (17:22-23); ఆలయ పన్నును గురించిన యేసు బోధ (17:24-27); తగ్గింపుని గురించిన యేసు బోధ (18:1-5); అభ్యంతరపరచుటను గూర్చిన బోధ (18:6-20); క్షమించుటను గూర్చిన బోధ ( 18:21-35);

గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చుట. యూదయ, పెరియాలో యేసు పరిచర్య (చ. 19–20)

విడాకుల గురించిన బోధ (19:1–12); చిన్న పిల్లలకు సంబంధించిన బోధ (19:13–15);  ఐశ్వర్యమును గురించిన బోధ (19:16–26); అపొస్తలుల బహుమానము (19:27-30); ద్రాక్షతోటలో పనివారిని గురించిన ఉపమానము (20: 1-16); తన మరణమును గురించి యేసు ప్రవచించడం (20:17–19); జెబెదయి కుమారుల తల్లి విన్నపము (20: 20-28); యెరికోనుండి వెళ్లుచుండగా, యిద్దరు గ్రుడ్డివారికి దృష్టిని ఇవ్వడం (20:29-34);

హోలీ వీక్ (21–27)

యేసు రాజుగా యెరూషలేములోనికి ప్రవేశించడం (21:1–11); ఆలయ ప్రక్షాళన (21:12–17); అంజూరపు చెట్టును శపించడం (21:18-22); యేసు అధికారాన్ని ప్రశ్నించడం (21:23-27); ఇద్దరు కుమారులకు సంబందించిన ఉపమానము (21:28-32); ఇంటి యజమానుడు ద్రాక్షతోటను గురించిన ఉపమానము (21:33-46); వివాహ విందుకు సంబందించిన ఉపమానము (22:1-14);  పరిసయ్యులు హేరోదీయులు యేసుని శోధించుట (22:15-22); సద్దూకయ్యులు యేసుని శోధించుట (22:23-33); పరిసయ్యులు యేసుని శోధించుట (22:34-46); యేసు శాస్త్రుల పరిసయ్యుల స్వభావమును గురించి శిష్యులకు జనసమూహములకు తెలియ జేయటం (23:1-12);  యేసు పరిసయ్యులును ఖండించడం (23:13-36); యేసు యెరూషలేమును గురించి ప్రలాపించటం (23:37-39); యేసు దేవాలయ నాశనమును గురించి ప్రవచించడం (24:1,2); ఒలీవల కొండ పై జరిగిన సంభాషణ ఏంటి ఎప్పుడు అనే శిష్యుల ప్రశ్నలు (24:3); “ఏంటి” అనే ప్రశ్నకు యేసుని జవాబు (24:4-31)_ శ్రమలు (24:4-26), రెండవ రాకడ (24:27-31); “ఎప్పుడు” అనే ప్రశ్నకు యేసుని జవాబు (24:32-51)_ అంజూరపు చెట్టును గూర్చిన ఉపమానము (24:32-35); నోవహు దినములను గురించి (24:36-44); ఇద్దరు దాసులను గురించిన ఉదాహరణ (24:45-51); యేసు తన రెండవ రాకడలో తీర్పును గురించి చెప్పడం (25:1-46)_ 10 మంది కన్యకల ఉపమానము (25:1-13);  తలాంతులను గురించిన ఉపమానము (25:14-30); సమస్త జనములకు తీర్పు (25:31-46); మత నాయకులు యేసుకు విరోధముగా కుట్ర చేయుట (26:1-5);  మరణమునకై మరియ యేసుని అభిషేకించుట (26:1–13);

యేసు అరెస్టు, విచారణలు మరియు మరణం (26:14-27:66)

యేసుని అప్పగించుటకై యూదా అంగీకారము (26:14-16); శిష్యులు పస్కాను ఆచరించుట (26:17-35)_  పస్కాను సిద్ధపర్చడం (26:17-19); పస్కాను ఆచరించడం (26:20-25); ప్రభురాత్రి భోజనాన్ని స్థాపించడం (26:26-29); పేతురు గద్ధింపు (26:30-35); యేసు గెత్సేమనేలో అరెస్ట్ చెయ్యబడుట (26:36-56)_ యేసు ముమ్మారు ప్రార్ధించుట (26:36-46); యేసు ద్రోహపూరితముగా అరెస్ట్ చెయ్యబడటం (26:47-56); యేసు విచారణలు (26:57-27:25)_ కయిప ముందు విచారణ (26:57-75)_ ఇద్దరు అబద్ద సాక్ష్యులు (26:57-68); పేతురు ముమ్మారు ప్రభువును తృణీకరించడం (26:69-75); పిలాతు ముందు విచారణ (27:1-25)_ యేసు పిలాతు యెదుటికి తేబడుట (27:1,2); యూదా పశ్చాత్తాపపడటం (27:3-10); పిలాతు విచారణ (27:11-14); బర్నబా విడుదల (27:15-25); యేసు సిలువ వేయబడటం (27:26-56)_ యేసు కొరడాలతో కొట్టబడటం (27:26-28); యేసు గొల్గొతాకు తీసుకొని వెళ్లబడటం (27:29-33); యేసు సిలువవేయబడటం (27:34-44); యేసు మరణించడం (27:45-50); యేసు మరణముతో ముడిపడియున్న సూచనలు (27:51-56); యేసును సమాధి చెయ్యటం (27:57-66);

పునరుత్థానం (28)

భూకంపం మరియు దేవదూతల ప్రకటన (28:1–7); స్త్రీలకు యేసుని ప్రత్యక్షత (28:8-10); గార్డ్స్ రిపోర్ట్ మరియు యూదు పెద్దల లంచం (28:11–15); యేసు శిష్యులకు ప్రత్యక్షమవ్వడం (28:16,17); ది గ్రేట్ కమిషన్ (28:16–20)

దేవుని వాక్యాన్ని వ్యాఖ్యాన రూపములో దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.