మత్తయి 12:40 యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. ఎలా?

యేసు శుక్రవారం సిలువ వేయబడ్డాడు, ఆదివారం బ్రతికించబడ్డాడు. జవాబు ఇశ్రాయేలీయుల సంస్కృతిపై ఆధారపడి ఉంది. సమయాన్ని ట్రాక్ చేయడానికి ఆ సంస్కృతి యొక్క పద్ధతులపై ఆధారపడి ఉంది. యూదుల గణన పద్ధతిలో, ఇది మూడు రోజులు. యూదులు ఒక రోజు యొక్క ప్రారంభ మరియు ముగింపు పాయింట్ని  నిర్ణయించిన విధానం మరియు ఒక రోజులోని ఏదైనా భాగం మొత్తం రోజుకు సమానమని వారి అవగాహన కారణంగా ఇది జరిగింది. ఆదికాండము సృష్టి వృత్తాంతంలో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (ఆదికాండము 1:5) సాయంత్రం మరియు ఉదయంతో కూడిన రోజులను వివరిస్తుంది కాబట్టి, ఒక రోజు సాయంత్రంతో ప్రారంభమైందని యూదులు నమ్మేవాళ్ళు. శుక్రవారం సూర్యాస్తమయం శనివారం ప్రారంభం కావడంతో మరియు యూదులు సంధ్యా సమయానికి ముందే శిలువ నుండి యేసుని మృతదేహాన్ని  తొలగించారు, అంటే శుక్రవారం చాలా తక్కువ సమయం పాటు యేసు శరీరం సమాధిలో ఉందని అర్థం. ఒక రోజు. ఆయన శరీరం శనివారం అంతా యేసేపు సమాధిలో ఉంది. రెండు రోజులు. శనివారం సూర్యాస్తమయం ఆదివారం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో యేసు శరీరం సమాధిలో ఉంది. మూడు దినములు. యూదుల ఆలోచన ప్రకారం ఒక రోజులో కొంత భాగం, మొత్తం రెండవ రోజు మరియు మూడవ రోజులో కొంత భాగం మూడు రోజులకు సమానం. ఆయన, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను, 1 కొరింథీయులకు 15:4.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.