
ఆత్మహత్య చేసుకుంటే, స్వర్గానికి వెళ్ళరా?
ఆత్మహత్య అనేది చాలా సంక్లిష్టమైన విషాదకరమైన సమస్య. దీనికి పలు కారణాలు ఉండొచ్చు. ఇది సాధారణంగా భావోద్వేగ, మానసిక, సామాజిక, జీవసంబంధమైన మరియు కొన్నిసార్లు ఆధ్యాత్మిక అంశాల వత్తిడి పై ఆధారపడి ఉంటుంది.
ఆత్మహత్యకు దోహదపడే పలు కారణాలు :
- మానసిక ఆరోగ్య రుగ్మతలు :
డిప్రెషన్ – ఆత్మహత్యకు సంబంధించిన ప్రముఖ మానసిక ఆరోగ్య పరిస్థితి.
బైపోలార్ డిజార్డర్ – మానసిక స్థితిలో మార్పులు తీవ్రమైన నిరాశకు దారితీస్తాయి.
స్కిజోఫ్రెనియా – ముఖ్యంగా భ్రాంతులు లేదా మతిస్థిమితం లేనప్పుడు.
పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)
పదార్థ వినియోగ రుగ్మతలు – మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం మనిషి నిర్ణయాలను బలహీనపర్చుతుంది మరియు నిరాశను మరింత తీవ్రతరం చేస్తుంది. - భావోద్వేగ బాధ మరియు నిరాశావాదం :
పనికిరానితనం, సిగ్గు లేదా అపరాధ భావనలు, పరిస్థితులు ఎప్పటికీ మెరుగుపడవు అనే నమ్మకం, ఇతరులకు భారంగా అనిపించడం, గాఢమైన ఒంటరితనం లేదా వేరుచేయబడటం. - దుర్భరమైన గాయాలు మరియు దుర్వినియోగం :
బాల్య దుర్వినియోగం లేదా నిర్లక్ష్యం, లైంగిక లేదా శారీరక దుర్వినియోగం, గృహ హింసకు గురికావడం, ప్రియమైన వ్యక్తిని అకస్మాత్తుగా కోల్పోవడం, ముఖ్యంగా ఆత్మహత్య ద్వారా. - జీవిత పరిస్థితులు మరియు ఒత్తిళ్లు :
జీవిత సంబంధ సమస్యలు (విడిపోవడం, విడాకులు, తిరస్కరణ), ఆర్థిక ఇబ్బందులు లేదా ఉద్యోగ నష్టం, చట్టపరమైన ఇబ్బందులు లేదా జైలు శిక్ష, చదువులలో వైఫల్యం లేదా అధిక ఒత్తిడి, దీర్ఘకాలిక బెదిరింపులు లేదా వివక్షత. - శారీరక అనారోగ్యం లేదా దీర్ఘకాలిక నొప్పి :
ప్రాణాంతక అనారోగ్యం (ఉదా. క్యాన్సర్), బలహీనపరిచే దీర్ఘకాలిక నొప్పి, కదలికలను కోల్పోవడం లేదా స్వాతంత్య్రాన్ని కోల్పోవడం. - జీవసంబంధమైన లేదా జన్యుపరమైన అంశాలు :
కుటుంబ ఆత్మహత్య చరిత్రగల వారు, మెదడులో రసాయన అసమతుల్యత (సెరోటోనిన్ వంటివి), ఉద్రేకం లేదా భావోద్వేగ నియంత్రణ సరిగా లేకపోవడం. - సాంస్కృతిక లేదా మతపరమైన ఒత్తిళ్లు :
ప్రతిష్టకు మచ్చ రావడం, సాంస్కృతిక అంచనాలలో ఓడిపోవడం (ఉదా. అవమానింపబడటం), వ్యక్తిత్వము కొరకు చేసే పోరాటాలు (లింగం, లైంగికత), అపరాధ భావనకు లేదా భయానికి దోహదపడే మత విశ్వాసాలు. - మద్దతు లేదా సహాయం లేకపోవడం :
ఎవరూ వినడం లేదా అర్థం చేసుకోవడం లేదని భావించడం, మానసిక ఆరోగ్య సంరక్షణకు పరిమిత ప్రాప్యత, పేలవమైన సంబంధాలు.
హెచ్చరిక సంకేతాలు :
చనిపోవాలనే కోరిక గురించి మాట్లాడటం. ప్రియమైన వారి నుండి దూరంగా ఉండటం. నిరాశ తర్వాత ఆకస్మిక మానసిక స్థితి మెరుగుపడటం (తుది నిర్ణయాన్ని సూచించవచ్చు). ఆస్తులను త్యజించడం. ప్రమాదకర లేదా నిర్లక్ష్య ప్రవర్తన. “నేను ఒక భారం” లేదా “నేను ఇక్కడ లేకుంటే బాగుండేది” వంటి మాటలు చెప్పడం.
ఆత్మహత్య బలహీనత కాదు—ఇది తరచుగా తీవ్రమైన బాధ మరియు ఆశ లేకపోవడం. కాని ఆశ తిరిగి రావచ్చు, స్వస్థత సాధ్యమవుతుంది మరియు మీరు ఒంటరిగా లేరు. కరుణ, అనుబంధం మరియు చికిత్స పరిస్థితులను మారుస్తాయి.
ఎవరైనా ఆత్మహత్య చేసుకుని పరలోకానికి వెళ్లిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయా? ఆత్మహత్యను గురించి బైబిల్ ఏం చెప్తుంది?
బైబిల్ ఆత్మహత్యను గురించి ఏమి చెప్పటం లేదు. కాని అది తమ ప్రాణాలను తీసుకొనిన వ్యక్తుల ఉదాహరణలను కలిగి ఉంది. జీవితం, బాధ, ఆశ మరియు దేవుని దయ గురించి చెప్తుంది. ఇవి దేవుడు ఆత్మహత్యను ఎలా చూస్తాడో అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి.
- ఆత్మహత్యకు బైబిల్ ఉదాహరణలు :
బైబిలు ఆరు ఆత్మహత్యలను గురించి తెలియజేస్తుంది: న్యాయాధిపతులు 9:52-54 వచనాలలో పేర్కొనబడి ఉన్న అబీమెలెకు, అట్లే 1 సమూయేలు 31:4,5 వచనాలలో పేర్కొనబడి ఉన్న రాజైన సౌలు మరియు సౌలు ఆయుధాలను మోసేవాడు, అట్లే 2 సమూయేలు 17:23లో పేర్కొనబడి ఉన్న అహీతోపెలు, అట్లే 1 రాజులు 16:15-20 వచనాలలో పేర్కొనబడి ఉన్న జిమ్రీ మరియు యూదా ఇస్కరియోతు, మత్తయి 27:3-5. బైబులు వీరి చర్యలను సమర్థించటం లేదా కీర్తించటం లేదు. కొందరు న్యాయాధిపతులు 16:25-30లో ఉన్న సమ్సోనుది కూడా ఆత్మహత్యే అని చెప్తుంటారు. సమ్సోనుది ఆత్మహత్య కాదండి. సమ్సోనుదు త్యాగం. అతని చివరి దశ నిరాశ నిస్సహాయతను ప్రతిబింబించలేదు కాని దేవునిపై అతనికున్న విశ్వాసాన్ని ప్రతిబింబించింది. ఈ కారణంగా అతడు హెబ్రీయులకు 11:32లో పేర్కొనబడిన విశ్వాస వీరులలో ఒకనిగా ప్రస్తావించబడ్డాడు. అయితే, పైన పేర్కొన్న మిగిలిన ఆరుగురి విషయంలో ఇలా జరగలేదు. వాళ్ళు నిరాశతో అవిశ్వాసంతో ప్రవర్తించారు. వారు చేసిన తప్పులను బట్టి వారికి పరలోకముపై ఎలాంటి ఆశ కూడా లేదనేది విశదమే. - జీవితం మరియు బాధ గురించి బైబిల్ సూత్రాలు
మానవ జీవితం పవిత్రమైనది : ఆదికాండము 1:27, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. నిర్గమకాండము 20:13, నరహత్య చేయకూడదు, (స్వీయ హాని చేసుకోకూడదు).
దేవుడు మీ బాధలను పట్టించుకుంటాడు : కీర్తన 34:18, విరిగిన హృదయముగల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగల వారిని ఆయన రక్షించును. 1 పేతురు 5:7, ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
ఎల్లప్పుడూ ఆశ ఉంది : యిర్మీయా 29:11, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. రోమీయులు 8:38–39, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనల్ని ఏదీ వేరు చేయలేదు.
బాధ అర్థరహితం కాదు : రోమీయులు 5:3–5, అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడు దము. 5ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది. బాధ పట్టుదల, వ్యక్తిత్వం మరియు ఆశను ఉత్పత్తి చేస్తుంది. 2 కొరింథీయులు 1:3–4, మనం ఇతరులను ఓదార్చగలిగేలా దేవుడు మనల్ని ఓదారుస్తాడు. - కష్టాల్లో ఉన్నవారికి బైబిలు ప్రోత్సాహం : మీరు ఒంటరివారు కాదు – కీర్తన 23:4: “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను …. మీరు నాతో ఉన్నారు. దేవుడు ఓదార్పు మరియు సహాయాన్ని అందిస్తాడు : యెషయా 41:10, నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను. దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. మీ జీవితంలో ఒక ఉద్దేశ్యం ఉంది : ఎఫెసీయులు 2:10: దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
ఒకని ఆత్మహత్య ఒక కుటుంబాన్ని అతను/ఆమె పై ఆధారపడియున్న వారిని మరియు సమాజాన్ని బాధతో కల్లోల పరుస్తుంది. “ఆత్మహత్య చేసుకుంటే, స్వర్గానికి వెళ్తారా”, అనే ప్రశ్నకు ఇక్కడ ఇప్పుడు Yes or No అనే జవాబు చెప్పలేం. ఆత్మహత్య గురించి మాట్లాడుకొనే ముందు, ఒకడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో గుర్తు చేసుకొందాం. ఇది ఇక్కడ మనకు ఎంతో సహాయపడుతుంది. ఒకడు మరణించే ముందు వాడు “క్రీస్తులో బయలుపరచబడిన దేవుని కృపను అంగీకరించిన వాడై ఉండొచ్చు లేదా ఆ కృపను తిరస్కరించిన వాడై ఉండొచ్చు“. ఈ స్థితిలో మరణం మానవ జీవితాన్ని అంతం చేస్తుంది. మరణించిన తరువాత ఎవడు తన ఛాయస్ ని, దేవునిని మార్చుకోలేడు. లూకా 16:19-31లోని ధనవంతుడు మరియు లాజరస్ యొక్క ఉపమానంలో ఈ విషయాన్ని గమనించొచ్చు.
అయితే బైబిల్లో పేర్కొన్న ఆత్మహత్య ఉదాహరణలన్నీ Negetiveగా ఉన్నప్పటికి, తన ప్రాణాలను తీసుకొనే ప్రతి వ్యక్తి శాశ్వతంగా నిత్యజీవాన్ని కోల్పోతాడని దీని అర్థం కాదు. క్రీస్తులో బయలుపరచబడిన దేవుని కృపను అంగీకరించిన ఒక వ్యక్తి మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడనుకోండి. శరీరంలోని ఇతర అవయవాల వలె వీళ్ళకి మెదడు సరిగా పనిచేయదు. భావోద్వేగ సంక్షోభ సమయంలో వాళ్ళు ఆవేశంగా ప్రవర్తించి తన ప్రాణాన్ని తీసుకోవచ్చు.
ప్రతి సందర్భంలోనూ మరణించిన వ్యక్తి అవిశ్వాసంతో వ్యవహరించాడని మనం చెప్పలేము. అంతిమముగా అవిశ్వాసమే ఒకనిని శాశ్వతమైన శిక్షకు గురిచేస్తుందే తప్ప వాని నిర్దిష్టమైన ఒక పాపం వానిని శిక్షావిధికి ఖండించదు. సిలువవేయబడిన పునరుత్థానుడైన రక్షకుని యందలి విశ్వాసమే ఒకనిని రక్షిస్తుంది. మన స్థానములో జీవించి మరణించిన క్రీస్తుని బట్టే ఒకడు స్వర్గానికి వెళ్తాడు తప్ప ఒకని సత్ప్రవర్తనను బట్టి గాని లేదా వాని మంచి మరణాన్నిబట్టి గాని ఒకడు స్వర్గానికి వెళ్ళడు. ఆత్మహత్య చేసుకుంటే స్వర్గానికి వెళ్తారా? అనే ప్రశ్నకు కొందరు ఇది వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది అని చెప్తారు.
ఆత్మహత్యను “క్షమించరాని పాపం” అని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు. క్షమించరానిదిగా వర్ణించబడిన ఏకైక పాపం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దైవదూషణ (మార్కు 3:29). ఆత్మహత్య ఒక విషాదం, ఆటోమేటిక్ గా ఖండింపబడటం కాదు. రక్షణ కృప ద్వారానే, అన్ని పాపాలను ఒప్పుకుని మరణించడం ద్వారా కాదు (ఎఫెసీయులు 2:8–9). విరిగిన స్థితిలో కూడా దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆయన కృపగలవాడు, న్యాయవంతుడు మరియు కరుణామయుడు.
చాలాకాలం క్రితం 14yrs యంగ్ క్రిస్టియన్ గర్ల్ చర్చి నుండి ఇంటికి వచ్చి sucide నోట్ వ్రాసి ఇంట్లో ఉన్న గన్ తో షూట్ చేసుకొని చనిపోయింది. ఆమె తన sucide నోట్ లో ఏమి వ్రాసిందో తెలుసా, “నేను ఇప్పుడే యేసుతో పరలోకములో ఉండాలనుకొంటున్నాను” అని వ్రాసింది. How can we judge this? ఏదిఏమైనా ఆత్మహత్య చేసుకుంటే స్వర్గానికి వెళ్తారా? అనే ప్రశ్నకు దేవునికి మాత్రమే జవాబు తెలుసు అనేదే నా జవాబు.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl