ఆత్మహత్య చేసుకుంటే, స్వర్గానికి వెళ్ళరా?

బైబిల్ ఏం చెప్తుంది? ఎవరైనా ఆత్మహత్య చేసుకుని పరలోకానికి వెళ్లిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయా?

బైబిలు ఆరు ఆత్మహత్యలను గురించి తెలియజేస్తూవుంది: న్యాయాధిపతులు 9:52-54 వచనాలలో పేర్కొనబడి ఉన్న అబీమెలెకు, అట్లే 1సమూయేలు 31:4,5 వచనాలలో పేర్కొనబడి ఉన్న రాజైన సౌలు మరియు సౌలు ఆయుధములను మోయువాడు, అట్లే 2సమూయేలు 17:23లో పేర్కొనబడి ఉన్న అహీతోపెలు, అట్లే 1రాజులు 16:15-20 వచనాలలో పేర్కొనబడి ఉన్న జిమ్రీ మరియు యూదా ఇస్కరియోతు, మత్తయి 27:3-5. కొందరు న్యాయాధిపతులు 16:25-30లో ఉన్న సమ్సోనుదు కూడా ఆత్మహత్యే అని చెప్తుంటారు. సమ్సోనుది ఆత్మహత్య కాదండి. సమ్సోనుదు త్యాగం. అతని చివరి దశ నిరాశ నిస్సహాయతను ప్రతిబింబించలేదు కాని దేవునిపై అతనికున్న విశ్వాసాన్ని ప్రతిబింబించింది. కారణంగా అతడు హెబ్రీయులకు 11:32లో పేర్కొనబడిన విశ్వాస వీరులలో ఒకనిగా  ప్రస్తావించబడ్డాడు. అయితే, పైన పేర్కొన్న మిగిలిన ఆరుగురి విషయంలో ఇలా జరగలేదు. వాళ్ళు నిరాశతో అవిశ్వాసంతో ప్రవర్తించారు, చేసిన తప్పులను బట్టి వారికి పరలోకముపై ఎలాంటి ఆశ కూడా లేదనేది విశదమే.

ఒకని ఆత్మహత్య ఒక కుటుంబాన్ని అతను/ఆమె పై ఆధారపడియున్న వారిని మరియు సమాజాన్ని బాధతో కల్లోల పరుస్తుంది. “ఆత్మహత్య చేసుకుంటే, స్వర్గానికి వెళ్తారా”, అనే ప్రశ్నకు ఇక్కడ ఇప్పుడు Yes or No అనే జవాబు చెప్పలేం. ఆత్మహత్య గురించి మాట్లాడుకొనే ముందు, ఒకడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో గుర్తు చేసుకొందాం. ఇది ఇక్కడ మనకు ఎంతో సహాయపడుతుంది. ఒకడు మరణించే ముందు వాడు “క్రీస్తులో బయలుపరచబడిన దేవుని కృపను అంగీకరించిన వాడై ఉండొచ్చు లేదా కృపను తిరస్కరించిన వాడై ఉండొచ్చు“.  స్థితిలో మరణం మానవ జీవితాన్ని అంతం చేస్తుంది. మరణించిన తరువాత ఎవడు తన ఛాయస్ ని దేవునిని మార్చుకోలేడు. లూకా 16:19-31లోని ధనవంతుడు మరియు లాజరస్ యొక్క ఉపమానంలో మనం విషయాలను చూస్తాము.

అయితే బైబిల్‌లో పేర్కొన్న ఆత్మహత్య ఉదాహరణలన్ని Negetiveగా ఉన్నప్పటికి, తన ప్రాణాలను తీసుకొనే ప్రతి వ్యక్తి శాశ్వతంగా నిత్యజీవాన్ని కోల్పోతాడని దీని అర్థం కాదు. క్రీస్తులో బయలుపరచబడిన దేవుని కృపను అంగీకరించిన ఒక వ్యక్తి మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడనుకోండి. శరీరంలోని ఇతర అవయవాల వలె వీళ్ళకి మెదడు సరిగా పనిచేయదు. భావోద్వేగ సంక్షోభ సమయంలో వాళ్ళు ఆవేశంగా ప్రవర్తించి తన ప్రాణాన్ని తీసుకోవచ్చు.

ప్రతి సందర్భంలోనూ మరణించిన వ్యక్తి అవిశ్వాసంతో వ్యవహరించాడని మనం చెప్పలేము. అంతిమముగా అవిశ్వాసమే ఒకనిని శాశ్వతమైన శిక్షకు గురిచేస్తుందే తప్ప వాని నిర్దిష్టమైన ఒక పాపం వానిని శిక్షావిధికి ఖండించదు. సిలువవేయబడిన పునరుత్థానుడైన రక్షకునియందలి విశ్వాసమే ఒకనిని రక్షిస్తుంది. మన స్థానములో జీవించి మరణించిన క్రీస్తుని బట్టే ఒకడు స్వర్గానికి వెళ్తాడు తప్ప ఒకని సత్ప్రవర్తననుబట్టి గాని లేదా వాని మంచి మరణాన్నిబట్టి గాని ఒకడు స్వర్గానికి వెళ్ళడు. ఆత్మహత్య చేసుకుంటే స్వర్గానికి వెళ్తారా? అనే ప్రశ్నకు కొందరు ఇది వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది అని చెప్తారు.

చాలాకాలం క్రితం 14yrs యంగ్ క్రిస్టియన్ గర్ల్ చర్చి నుండి ఇంటికి వచ్చి sucide నోట్ వ్రాసి ఇంట్లో ఉన్న గన్ తో షూట్ చేసుకొని చనిపోయింది. ఆమె తన sucide నోట్ లో ఏమి వ్రాసిందో తెలుసా, “నేను ఇప్పుడే యేసుతో పరలోకములో ఉండాలనుకొంటున్నానుఅని వ్రాసింది. How can we judge this? ఏదిఏమైనా ఆత్మహత్య చేసుకుంటే స్వర్గానికి వెళ్తారా? అనే ప్రశ్నకు దేవునికి మాత్రమే జవాబు తెలుసు అనేదే నా జవాబు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.