ఆస్తిక పరిణామ సిధ్ధాంతాన్ని అంగీకరించడంలో వేదాంతపరమైన సమస్యలు ఏమిటి?

దేవుని గొప్ప లక్షణాలలో సర్వశక్తిమంతత్వము (ఊహించలేని అనంతమైన ఆయన శక్తిని) సర్వాంతర్యామి (ఒకే టైములో అంతటను ఉండటం) సర్వమును యెఱుగుట (జరుగుతున్న జరగబోవుతున్న ప్రతి విషయము ఆయనకు ముందే తెలిసి ఉండటం) సమస్తమును చూడగలగటం అనే లక్షణాలు మరియు ఆయన గుణ గణాలు శాస్త్రియముగా మనుష్యులమైన మనకు అర్ధం కాని విషయాలు, మన సైన్స్ శాస్త్రియముగా నిరూపించ లేని విషయాలు. కాబట్టే వీటిని అర్ధం చేసుకోవడంలో మనుష్యులు ఇబ్బంది పడుతూవున్నారు. దేవునిని అర్ధం చేసుకోవడమంటే నీటిలో కొట్టుకు పొతూవున్నప్పుడు నీటిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలాంటిది. సహజ వివరణలను ఉపయోగించి సహజ దృగ్విషయాలను పరిశోధించడానికే సైన్స్ పరిమితం అనే విషయాన్ని మనుష్యులు ఎరిగియున్నప్పటికిని అతిశయించటం ఎంతవరకు సబబో చెప్పండి.

హేతుబద్ధంగా పరిణామ సిధ్ధాంతాన్ని చూడడమంటే, దేవుడు జీవులను సృష్టించేందుకు అత్యంత సుదీర్ఘమైన బాధాకరమైన వాటి మనుగడకు పరిణామ ప్రక్రియను ఉపయోగించుకొనియున్నాడేమో, సైన్స్ కూడా ఈ సృష్టి ఉనికి లోనికి రావడానికి కోట్ల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు అని చెప్తూవుంది కదా, మరి ఈ విషయాన్ని క్రైస్తవులుగా మనం నమ్మితే తప్పేంటి అని మీలో కొందరు ప్రశ్నించొచ్చు.

దేవునికి the slow process of evolution and the “survival of the fittest” అనే క్రూరమైన పద్ధతి అవసరం లేదు. అంటే జీవులు కాలక్రమేణా (జన్యుపరంగా ప్రవర్తనలో) మార్పు చెందుతూ పరిస్థితులకు తగ్గట్లుగా రూపాంతరం చెందుతూ మరింత సంక్లిష్టంగా అవి పెరిగేకొద్దీ, అవి వనరుల కోసం పోటీ పడుతూ పర్యావరణ మార్పులకు అనుగుణంగా మనుగడ కొరకు పోటీ సాగిస్తూ ఇప్పటి స్థాయికి చేరుకొన్న క్రూరమైన పద్ధతిని దేవుడు ఎన్నుకోలేదనే విషయాన్ని బైబులు చెప్తూ వుంది.

డార్వినియన్ పరిణామం అనేది మనిషి జంతువు అంటే కోతినుండి నెమ్మదిగా మానసికముగా అభివృద్ధి చెంది ఉద్భవించి యున్నాడని చెప్తూవుంది. అయితే ఇప్పటివరకు ఎవ్వరు దీనిని నిరూపించలేకపోయారు. ఈ పరిణామ క్రమములో ఎన్నో మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. ఒకవేళ డార్వినియన్ Evolution theory అనేది నిజమైతే మనిషి నెమ్మదిగా మానసికముగా అభివృద్ధి చెందిన ఒక జంతువు మాత్రమే.      

కొందరు చెప్తున్నట్లుగా దేవుడు కోట్ల సంవత్సరాలలో విశ్వాన్ని అందులోని వాటిని సృష్టించడానికి పరిణామ ప్రక్రియను ఉపయోగించాడనే చెప్పడంలో ఒప్పుకోవడంలో సీరియస్ థియోలాజికల్ problems ఎన్నో ఉన్నాయి. బాధాకరమైన విషయమేమిటంటే క్రైస్తవత్వములోని అనేక తెగలు మరియు చర్చిలు Evolution అనే ఈ సిద్ధాంతాన్ని అంగీకరించటం నిజముగా విచారించదగిన విషయం.

Evolutionలో ఉన్న థియోలాజికల్ problems ఏమిటంటే, ఇది బైబులుతో విభేదిస్తూ ఉంది. ఎలా విభేదిస్తూ ఉందో వివరంగా చెప్తాను:

యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అని కీర్తనలు 33:6,9 చెప్తూవుండగా అట్లే యెషయా 45: 12 భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని అని చెప్తూవుండగా, మనం Evolution theoryని నమ్మినట్లయితే దేవుని మాటలను తృణీకరిస్తూ ఉన్నట్లేగా. అంటే జ్ఙాని సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ సృష్టిని ఆరు రోజులలో అంటే 144 గంటలలో చేసియున్నాడని బైబులు చెప్తూవుంటే, పరిణామ సిధ్ధాంతము దేవుని జ్ఙానమును సర్వశక్తిమంతత్వమును తగ్గిస్తూ ఈ సృష్టిని చెయ్యడానికి దేవుడు కోట్ల సంవత్సరాలను తీసుకున్నాడని అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సృష్టి ఈ స్థాయికి రావడానికి దేవుడు అందుకు అవసరమైన పరిస్థితులను కల్పిస్తూ మార్పులు చేస్తూ వచ్చిన ఒక మామూలు ఆవిష్కర్తగా ఆయనను గురించి చెప్తూ వుంది.

అట్లే దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకొనిన ఏడవ దినమును పరిశుద్ధముగా ఆచరింపుము అనే దేవుని ఆజ్జ్యకు విలువలేదని అర్ధమే లేదని Evolution theory తృణీకరిస్తూవుంది, ఒప్పుకొందామా? మొక్కలు కీటకాల కంటే ముందు పుట్టాయి. పరిణామ సిధ్ధాంతము ప్రకారము మొక్కలు పుట్టిన తరువాత లక్షల సంవత్సరాలలో కీటకాలు పుట్టుకొచ్చాయి. మరి ఈ రెండింటి మధ్యనున్న లక్షల సంవత్సరాలలో మొక్కలు కీటకాలు అందించే పరాగ సంపర్కం లేకుండా ఎలా జీవించాయి? అనే ప్రశ్నను Evolution theory వివరించడం లేదు.

అలాగే ఈ Evolution theory ఆదికాండము మొదటి అధ్యాయాలలో చెప్పబడిన సృష్టి వృత్తాంతం, మన మూలాల యొక్క నిజమైన Account కాదని ఆదాము హవ్వలు నిజం కాదని మనిషి కోతినుండి అభివృద్ధి చెందియున్నాడని చెప్తూవుంది.

ఆదాము హవ్వలు దేవుని జ్ఞానములో పరిపూర్ణమైన నీతిలో మరియు పరిశుద్ధతలో మరియు దేవుని స్వభావము యొక్క సహజ శాస్త్రీయ జ్ఞానముతో ఆయన పోలికలో సృజింపబడియున్నారని మరణము లేనివారిగా ఉన్నారని ఈ స్థితిలో వాళ్ళు సాతానుచే శోధింపబడి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన్నప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఇది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుగా బైబులు చెప్తూ “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను”అని (రోమా 5:12) తెలియజేస్తూవుంది. అంటే బైబిల్ మరణాన్ని “పాపం యొక్క జీతంగా” (రోమా ​​​​6:23) చెప్తూ కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని (1 కొరింథీయులు 15:26)లో చెప్తూ ఉంటే మనిషి కోతి నుంచి ఉద్భవించక ముందే ఈ సృష్టిలో పరాన్నజీవులు, మాంసాహారులు, వ్యాధి మరియు మరణం ఉన్నాయని Evolution theory చెప్తూవుంది.

ఆదాము హవ్వలు నిజం కానప్పుడు మొదటి పాపానికి వారిని మనం నిందించలేము. పాపం లోకములోనికి ఎలా ప్రవేశించిందనే ప్రశ్నకు ఈ పరిణామ ప్రక్రియలో ఎటువంటి జవాబు లేదు. పరిణామ సిధ్ధాంతము ప్రకారము మనిషి దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్న ఒక జంతువు కాబట్టి నిజముగా మనలో పాపాలు ఉంటే మన పాపాలకు మనం జవాబుదారిగా ఉండనక్కర లేదు, ఎందుకంటే అప్పుడు పాపమనేది జీవులలో ఉన్న ఒక లోపము అవుతుంది. ఆ లోపానికి మనిషి బాధ్యత వహించనక్కర లేదు. అప్పుడు పాపి అనే సమస్యే లేదు. మనఃసాక్షియే లేదు. మరణాన్ని నిర్వచించాల్సి వస్తే దేవుని గొప్ప సృష్టి సాధనాలలో ఒకటిగా, మంచిదిగా అవసరమైన విషయంగా నిర్వచించాల్సి ఉంది.

పరిణామ సిద్ధాంతం యేసు సిలువ మరణం యొక్క ఉద్దేశ్యానికి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మరణం పాపానికి శిక్ష అని మనం చెల్లించవలసిన పాపానికి శిక్ష చెల్లించడానికే యేసు సిలువపై మరణించాడని బైబిల్ చెప్తూవుంది. రక్షణ ప్రణాళిక మానవులను నిత్యజీవం లోనికి తిరిగి తీసుకురావడానికి రూపొందించబడింది. Evolution theory ప్రకారం ఆదామే నిజం కాకపోతే, క్రీస్తు లేనే లేడు రక్షణే లేదు కదండి.

పాతనిబంధన మరియు క్రొత్తనిబంధన రెండింటి రచయితలు సృష్టి వృత్తాంతాన్ని ఖచ్చితమైన చరిత్రగా స్పష్టంగా అంగీకరించారు: దావీదు (కీర్తన 33:6, 9లో; నెహెమ్యా (నెహెమ్యా 9:6లో; యెషయా 45:18లో), పౌలు (కొలొస్సయులు 1:15-17లో), యేసు (మత్తయి 19:4లో) ఆదాము హవ్వలను గురించి ప్రస్తావిస్తూ, “సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెనని” వారిని గురించి తెలియజేస్తూవుంటే మనమేమో Evolution theoryని అంగీకరిస్తూ Evolution theoryని నమ్ముతూ  తప్పేంటి అని అడుగుతున్నాం. కరెక్టే నంటారా. ఆలోచించండి.

మనం బైబిల్ Creation account యొక్క ఖచ్చితత్వాన్ని తోసిపుచ్చినట్లయితే, లేఖనాల యొక్క ఇతర భాగాల విషయములోను యేసు మరియు ఇతర బైబిల్ రచయితలు చెప్పిన వాటి విషయములో ఇది నిజమా ఇలా జరిగేందుకు ఆస్కారముందా అని ప్రశ్నించుకొంటూ ఇలా కాకపోయి ఉండొచ్చు అని ఒక ముగింపుకు వచ్చి లేఖనాలపై మనలను మనం న్యాయమూర్తులుగా ఉంచుకొనే ప్రమాదముంది, ఆలోచించండి.

దేవుడు మానవులకు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆదాము హవ్వలు దేవునికి లోబడాలా లేదా అనే విషయములో దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. Evolution theory, ఫ్రీ విల్ అనేది ఒక భ్రమ అని చెప్తూ మనం ఎంచుకొనే choices కేవలం మన జన్యువులు లేదా మన చుట్టుపక్కల వాతావరణం ద్వారా నిర్ణయించబడిన Actions లేదా Behaviors మాత్రమే నిర్ణయిస్తాయని చెప్తూవుంది.

బైబిలుకు దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు అని బైబులు చెప్తూవుంటే Evolution theory  బైబిలును తిరస్కరిస్తూ ఉంది. పరిశుద్ధ లేఖనాలలోని ప్రతి అధ్యాయాన్ని ప్రతి మాటను దేవుని మాటలుగా మనం విశ్వసించకపోతే, అశాస్త్రీయమైన Evolution లేఖనాలలోని అద్భుతాలు, యేసు పునరుత్థానం మరియు సువార్త వంటి చాలా విషయాలలో సందేహాలను లేవనెత్తుతూ ఉంటే విశ్వాసులమైన మనం కొన్ని లేఖన భాగాలను సందేహిస్తూ వాటిని తృణీకరిస్తూ క్రైస్తవులుగా మనలను మనం పిలుచుకొందామా? 

విజ్జులైన మీరు ఆలోచించండి. క్రైస్తవుడిగా ఉండడం అంటే బైబిల్ను దేవుని ప్రామాణికమైన, నమ్మదగిన వాక్యమని మరియు క్రీస్తు మన సృష్టికర్త మరియు రక్షకుడని విశ్వసించడం. మనం దేవుని పోలికలో దేవునిచే సృజింపబడినవారం తప్ప ఒక కోతి నుండి కోట్ల సంవత్సరాలలో జన్యుపరంగా, ప్రవర్తనలో మార్పు చెందుతూ పరిస్థితులకు తగ్గట్లుగా రూపాంతరం చెందుతు వనరుల కోసం పోటీ పడుతూ పర్యావరణ మార్పులకు అనుగుణంగా మనుగడకొరకు పోటీ సాగిస్తూ ఇప్పటి స్థాయికి చేరుకొన్న మానసికముగా అభివృద్ధి చెందిన ఒక జంతువుము మాత్రము కాదు. నమ్మండి.

Theistic evolution theory ని నమ్మడంలో Theistic evolution theory ని అంగీకరించడంలో ఎన్నో థియోలాజికల్ ప్రాబ్లెమ్ స్ వున్నాయి, విజ్జులైన మీరు ఆలోచించండి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.