స్వర్గం పరిపూర్ణమైన స్థలం, అక్కడ పాపము లేదు, తిరుగుబాటు చేయాలనే ఆలోచన సాతానుకు ఎలా వచ్చింది? మరి అది తనతో పాటు చాలా మంది పతనానికి కారణమవుతుందని తెలిసి కూడా దేవుడు దానిని ఎందుకని అనుమతించాడు?

ఈ ప్రశ్నలకు బైబిలు సమాధానాలు ఇవ్వటం లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, దేవదూతల పతనాన్ని మరియు ఆదాము హవ్వల పతనాన్ని ఆయన ఖచ్చితంగా అడ్డుకోగలడు. ఆ పతనాలను ఎందుకు అడ్డుకోలేదో దేవుడు వివరించలేదు- అలా చేయాల్సిన బాధ్యత కూడా లేదు. రోమా  ​​11:33-36 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి.

బైబిల్ నుండి మనకు తెలిసిన విషయమేమిటంటే, దేవుడు సాతానును చితుకకొట్టుటకు రక్షకున్ని వాగ్దానం చేసాడు (ఆది 3:15 నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను), యేసుక్రీస్తు సరిగ్గా అదే చేశాడు (1 యోహాను 3:8 అపవాది మొదటనుండి పాపము చేయుచున్నాడు గనుక పాపముచేయు వాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను). ఆత్మ ద్వారా, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుట ద్వారా, క్రైస్తవులు దేవునితో పరిపూర్ణ నిత్య జీవము కొరకు నమ్మకంగా ఎదురుచూడవచ్చు. (ప్రకటన 21:3-4 అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని).