ప్రశ్న : దేవుడు తన ధర్మశాస్త్రమును ప్రజలందరికి ఎట్లు ఇచ్చాడు?

రోమా 2:14,15, ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.

జవాబు: తన ధర్మశాస్త్రమును వారి హృదయముల యందు వ్రాయుట ద్వారా ప్రజలందరికి ఇచ్చాడు.(స్వాభావికమైన ధర్మశాస్త్రము)

ప్రశ్న : దేవుడు ఎందుకు ప్రతివానికి మనసాక్షిని కూడా ఇచ్చాడు?

రోమా 2:14,15, ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పు చుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.

జవాబు : దేవుని ధర్మశాస్త్రమునకు సాక్ష్యముగా ప్రతి వానిలో ఒక స్వరముగా ఉండులాగున ప్రతి వ్యక్తికి దేవుడు మనసాక్షిని ఇచ్చాడు.

ప్రశ్న : ఒక వ్యక్తి యొక్క మనఃసాక్షి ఎందుకని సంపూర్ణముగా ఆధారపడ తగినది కాదు?

రోమా 1:21,22, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయ మాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

ఎఫెసీయులకు 4:18,19, వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన వారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

జవాబు 1: ఒకని మనఃసాక్షి పాపమును బట్టి మొద్దుబారుటచే అతడు పాపము చేయునప్పుడు అది అతనిని ఏ మాత్రమును బాధించదు గనుక ఒకని మనఃసాక్షి సంపూర్ణముగా ఆధారపడ తగినది కాదు.

1 కొరింథీయులకు 8:7, కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.

రోమా 14:2, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు.

జవాబు 2: ఒకని మనఃసాక్షి దేవుని వాక్యము పాపమని చెప్పని దానిని కూడా పాపమని వానికి చెప్పవచ్చును గనుక ఒకని మనఃసాక్షి సంపూర్ణముగా ఆధారపడ తగినది కాదు.

ప్రశ్న : ఎందుకు, అప్పుడు, దేవుడు తన ధర్మశాస్త్రమును మనకు రెండవసారి నిర్దిష్టమైన రీతిలో ఇచ్చాడు?

రోమా 7:7, ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియక పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.

రోమా 2:18, ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేప్ఠమైన వాటిని మెచ్చుకొను చున్నావు కావా?

జవాబు : ఆయన చిత్తమేమైయున్నదో పరిపూర్ణముగా మనమెరుగునట్లు దేవుడు తన ధర్మశాస్త్రమును మనకు రెండవ సారి నిర్దిష్టమైన రీతిలో ఇచ్చాడు.

ప్రశ్న : దేవుడు తన ధర్మశాస్త్రమును మనకు దయచేసి రెండవ నిర్దిష్టమైన రీతి ఏది?

నిర్గమ కాండము 20. (దేవుడు ధర్మశాస్త్రమును సీనాయి పర్వతము వద్ద ఇచ్చాడు.)

ద్వితీయోపదేశకాండము 5:22, ఈ మాటలను యెహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు.

యోహాను 1:17, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను.

రోమా 13:8-10. (ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చుటకుగాను దేవుడు మనలను కోరుచున్నాడను దానిని గూర్చి పౌలు వ్రాయుచున్నాడు.

జవాబు: దేవుడు తన ధర్మశాస్త్రమును బైబులు నందు లిఖింపజేయుట ద్వారా దానిని రెండవ నిర్దిష్టమైన రీతిలో మనకు దయచేసాడు. (లిఖింపబడిన ధర్మశాస్త్రము)

ధర్మశాస్త్ర సారాంశము

ప్రశ్న : దేవుడు మనకు బైబులు నందు దయచేసి ధర్మశాస్త్రము యొక్క సంక్షిప్త సారాంశమేది?

ద్వితీయోపదేశకాండము 5:1-22. ప్రత్యేకముగా 22వ వచనము: ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు.

ద్వితీయోపదేశకాండము 10:4,5, ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.

జవాబు : దేవుడు తన ధర్మశాస్త్రము యొక్క సంక్షిప్త సారాంశముగా పది ఆజ్ఞలను మనకు దయచేసాడు.

మోషే యొక్క ధర్మశాస్త్రము

సీనాయి పర్వతము మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మూడు రకములైన ధర్మశాస్త్ర నియమములను యిచ్చి యున్నాడు.

మొదటిగా, ఆయన వారిని ఒక జనాంగముగా పరిపాలించుట కొరకు పౌర సంబంధమైన ఆజ్ఞలను యిచ్చి యున్నాడు. ఉదాహరణకు: ఒకనిని గాయపర్చినను లేక ఒకనికి నష్టము కలుగజేసినను అట్టి నేరములకు శిక్ష విధించుటకుగాను పౌర సంబంధమైన ధర్మశాస్త్రము నియమింపబడింది (నిర్గమ కాండము 21:22 చూడండి, నరులు పోట్లాడుచుండగా గర్భవతియైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రాని యెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను).

రెండవదిగా, దేవుడు ఇశ్రాయేలీయులకు శుద్ధికరణాచార సంబంధమైన ఆజ్ఞలను కూడా యిచ్చియున్నాడు. ఇందులో ఇశ్రాయేలీయులు తమ దేవునిని ఎప్పుడు, ఎక్కడ, ఏవిధముగా ఆరాధించాలో చెప్పబడింది. యాజకులకు, బలులకు, సబ్బాతు దినములకు, ప్రత్యక్ష గుడారమునకు సంబందించిన నియమాలు ఛాయలుగా, చిత్రములుగా, వాగ్దానము చేయబడిన మెస్సయ్యను సూచించుచు సేవించుటకు ఇవ్వబడింది.

మూడవదిగా, దేవుడు నీతి సంబంధమైన ఆజ్ఞలను కూడా ఇశ్రాయేలీయులకు యిచ్చియున్నాడు. సృజించి నప్పుడే అన్ని కాలాలలో ప్రజలందరి కొరకైన దేవుని చిత్తమై ఉండులాగున మానవుని హృదయములో దేవుడు నీతి సంబంధమైన ఆజ్ఞలను లిఖించాడు. దేవుడు నీతి సంబంధమైన ధర్మశాస్త్రమును ఇశ్రాయేలు ప్రజల కొరకు పది ఆజ్ఞల రూపములో ఇచ్చాడు. ఈ పది ఆజ్ఞలలో ప్రజలందరి కొరకైన ఆయన పరిశుద్ధ చిత్తము ప్రత్యేకమైన రీతిలో యెట్లు అన్వయింపబడునను దానిని ఆయన ఎన్నుకొనిన ప్రజలుగా ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేశాడు.  

దేవుడు క్రొత్త నిబంధనలో సీనాయి పర్వతము మీద మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము ఇకను వర్తించదని స్పష్టముగా తెలియచేసాడు (కొలొస్సి 2:16,17, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములో నైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశ మియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది; గలతి 3:23-25, విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలు పరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము; 5:1, ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి). అలాగైతే ఎందుకు మనము పది ఆజ్ఞలను ఉపయోగిస్తూ ఉన్నాం? ఎందుకంటే, పది ఆజ్ఞలు దేవుని నీతి సంబంధమైన ధర్మశాస్త్రము రూపమును, ప్రజలందరి కొరకైన ఆయన పరిశుద్ధ చిత్తమునై ఉన్నాయి. గుర్తు చేసుకోండి పాతనిబంధనలో పౌర మరియు శుద్ధికరణాచార సంబంధమైన ఆజ్ఞలు ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే దేవుని చేత ఇవ్వబడి యున్నాయి. ఈ కారణాన్ని బట్టి, పది ఆజ్ఞలలోని ప్రాముఖ్యమైన సారంశము క్రొత్త నిబంధనలో అవే మాటలలో కాకుండా లేక సీనాయి పర్వతము మీద దేవుడిచ్చిన అదే క్రమములో కాకుండా తిరిగి చెప్పబడి ఉన్నాయి, (మత్తయి 19:18, యేసు–నరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము; రోమా 13:8-10, ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల వద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే; గలతి 5:19, శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము).

సీనాయి పర్వతము మీద ఇవ్వబడిన పది ఆజ్ఞల క్రమాన్ని ఉపయోగించుటకు లూథరు ఎన్నుకొన్నాడు ఎందుకంటే దేవుని నీతి సంబంధమైన ఆజ్ఞలు సులభ సారాంశ క్రమములో ఇక్కడ మనము బైబులునందు కలిగియున్నాము. దేవుని నీతిసంబంధమైన ఆజ్ఞలను పిల్లలకు భోదించుటకు ఈ విధానము సులభముగా ఉండునని అతడు తలంచాడు. అందుకే మోషే పది ఆజ్ఞ్యల విషయమై వాడిన మాటలను మనము వాడుతున్నాము. కాని ఈ మాటలు ప్రత్యేకమైన విధానములో దేవుడు నీతి సంబంధమైన ఆయన ఆజ్ఞల యొక్క సారాంశమును పాత నిబంధన ప్రజలకు ఇచ్చియున్నాడని మనము మనసులో ఉంచుకొనవలసి యున్నది. విశేషముగా దీనిని మనము మూడవ ఆజ్ఞను చదువునప్పుడు జ్ఞపకముంచుకోవలసియున్నది.

ప్రశ్న : దేవుని ధర్మశాస్త్రము యొక్క సంక్షిప్త సారాంశము ఏమై యున్నది?

మత్తయి 22:37-40, అందుకాయన–నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.

రోమా 13:9,10, ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల వద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్నయెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

జవాబు : “నీ దేవునిని నీ పొరుగువానిని ప్రేమించుము” అనునది దేవుని ధర్మశాస్త్రము యొక్క సంక్షిప్త సారాంశమై యున్నది.

ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట

ప్రశ్న : నీ దేవుడైన యెహోవాను నేనే (నిర్గమ కాండము 20:2) అను మాటలతో ఆయన తన ఆజ్ఞలను మనకు పరిచయము చేస్తున్నపుడు దేవుడు ఏ విషయాన్ని మనకు జ్ఞపకం చేస్తూ ఉన్నాడు?

కీర్తనలు 95:6,7, ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.

యెషయా 43:11, నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

1 యోహాను 4:8,9, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.

జవాబు : ఈ మాటలతో తన ఆజ్ఞలను దేవుడు మనకు పరిచయము చేయునప్పుడు మన ప్రియమైన సృష్టికర్త మరియు రక్షకుడై యున్నవాడు ఈ ఆజ్ఞలను మనకు ఇచ్చియున్నాడని ఆయన మనకు జ్ఞాపకము చేయుచున్నాడు.

ప్రశ్న : మన ప్రియమైన సృష్టికర్త మరియు రక్షకుడైయున్నవాడు మనకు ఈ ఆజ్ఞలను ఇచ్చియున్నాడని దేవుడు మనకు ఎందుకని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు?