
పరలోకంలో ఇతరులను, మన బంధువులును, స్నేహితులను గుర్తించగలమా?
పరలోకంలో ఇతరులను మనం గుర్తించడం గురించి బైబిల్లో చాలా తక్కువ సమాచారం ఉంది. మోషే మరియు ఏలీయాలు ఎవరో పేతురుకు తెలుసు, అతడు ఇంతకు ముందెన్నడూ వారిని వ్యక్తిగతంగా కలవలేదు (మత్తయి 17:4; మార్కు 9:5; లూకా 9:33).
పరలోకంలో ఉన్న మన బంధువులును, స్నేహితులను, ఇతర క్రైస్తవులను గుర్తించగలమని మరియు మన భూసంబంధమైన జీవితాల్లో మనం వారితో ఎలా ప్రవర్తించి ఉంటామో మనకు జ్ఞపకముంటుందని కూడా కొందరు చెప్తుంటారు. పరలోకంలో ప్రతిఒక్కరు వారి ప్రియులను స్నేహితులను కలుసుకొంటారు. నిత్యత్వం, మన స్నేహితులతో కుటుంబీకులతో సమయం గడపడానికి కాదు. పరలోకంలో దేవుని అద్భుతాలను చూడడంలో మరియు దేవునిని ఆరాధిస్తూ మనం మన సమయాన్ని మనం గడుపుతాం. విశ్వాసులందరితో కలసి దేవునిని ఆరాధిస్తూ ఉంటాం.
లూకా 16:19-31లో ధనవంతుడు లాజరు అబ్రాహాము యొక్క సంభాషణ పరలోకంలో ఇతరులను, మన బంధువులును, స్నేహితులను గుర్తించగలమనే విషయాన్ని తెలియజేస్తుంది. మరికొందరు 1 థెస్సలొనీకయులు 4:13-18ని కూడా సూచిస్తారు, సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి యుండు మనము నిద్రించిన వారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. ఇక్కడ పౌలు థెస్సలొనీకలోని క్రైస్తవులను ఓదార్చుతూ, వారు గతంలో మరణించిన క్రైస్తవులను చూస్తారని మరియు వారితో కలకాలం కలిసి ఉంటారనే హామీని ఇచ్చాడు.
మన నిత్యజీవితానికి సంబంధించిన ఏవైనా నిర్దిష్ట ప్రశ్నలకు బైబిల్ ఇప్పుడు సమాధానం ఇవ్వదు: “ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని యెరుగుదుము ”(1 యోహాను 3:2). మనం పరలోకంలో ఆయన (యేసు) వలే ఉంటామని బైబిల్ చెప్తుంది.
మరణ సమయంలో, శరీరం మరియు ఆత్మ వేరుగా ఉంటాయి (ప్రసంగి 12:7 మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును). చివరి రోజున, ప్రభువు మరణించిన వారందరి శరీరాలను లేపుతాడు. శరీరాలను మరియు ఆత్మలను తిరిగి కలుపుతాడు (యోహాను 5:28-29 దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలమువచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానము నకును బయటికి వచ్చెదరు). క్రైస్తవుల విషయానికొస్తే, దేవుడు వారి శరీరాలను మహిమపరుస్తాడు మరియు మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును (పాపాన్ని బట్టి మనలోవున్న లోపాలను తొలగిస్తాడు), ఫిలిప్పీయులు 3:21. కాబట్టి మన పునరుత్థాన శరీరము క్రీస్తు వలే ఉంటుంది, 1 కొరింథీ 15:47 మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చిన వాడు. 1 కొరింథీ 15:49,53, మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది. మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి యున్నది.
1 కొరింథీ 15:4-7, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను. వీళ్ళందరూ యేసును తన మహిమ శరీరములో గుర్తించారు, అట్లే మనం కూడ మన మహిమ శరీరాలలో ఇతరులచే గుర్తించబడతాము, ఇతరులను గుర్తిస్తాము. మనం ఖచ్చితంగా ఒకరికొకరు గుర్తించుకొంటాం.
మన ప్రియులతో స్నేహితులతో కలసి నిత్యత్వంలో నిత్య సంతోషముతో దేవునితో దేవుని సన్నిధానములో ఉండటం ఎంతో గొప్ప ధన్యత. ఈ ధన్యతను దేవుడు మన కందరికిని తన కృపలో అనుగ్రహించును గాక.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
I’m really inspired along with your writing talents and also with the layout to your weblog. Is that this a paid topic or did you modify it yourself? Anyway keep up the nice high quality writing, it’s rare to peer a nice weblog like this one nowadays!
Thank you.