మన పనులు మన రక్షణకు ఏ విధంగానూ తోడ్పడవు. మనం ఆనందించే ఈ రక్షణ దేవుడు చేస్తున్నది (తీతు 3:5,6 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను). మనం అనుభవిస్తున్న ఈ రక్షణ క్రైస్తవులందరు కలిగియున్నారు. ప్రకటన గ్రంథం దానిని చక్కగా వివరిస్తుంది. ఒక దర్శనంలో, అపొస్తలుడైన యోహాను తమ విశ్వాసం కోసం చంపబడిన క్రైస్తవులకు ‘తెల్లని వస్త్రాన్ని’ ఇవ్వడాన్ని వర్ణించాడు (ప్రకటన 6:11). ఈ వస్త్రం యేసు గెలిచిన నీతి వస్త్రాన్ని సూచిస్తుంది మరియు ఆయనపై విశ్వాసం ద్వారా ప్రజలు ఈ వస్త్రాన్ని “ధరించుకుంటారు”. ఆ అమరవీరుల్లో ప్రతి ఒక్కరు తెల్లని వస్త్రాన్ని అందు కున్నారు. కొందరు సగం వస్త్రాన్ని అందుకోలేదు; మరికొందరు రెండు వస్త్రాలు అందుకోలేదు. అందరూ సమానంగా రక్షణను అనుభవించారు. ద్రాక్షతోటలోని పనివారి గురించి యేసు చెప్పిన ఉపమానం (మత్తయి 20:1-16) కూడా దేవుని పిల్లలు ఆయన రక్షణను సమానంగా ఆనందిస్తారని భోదిస్తూవుంది.

క్రైస్తవులందరూ ఒకే రకమైన రక్షణ బహుమతిని అనుభవిస్తున్నప్పుడు, దేవుడు తన దయగల ఆశీర్వాదాలను అనుకూలీకరించడం గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. “పరలోకము యొక్క స్థాయిలను (లెవెల్స్) గురించి మాట్లాడే బదులు, దానియేలు 12:3 వంటి బైబిల్ భాగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం ఛేధ్ధాం; (బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశిం చెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు). బదులుగా, ‘మహిమ యొక్క స్థాయిలు’ అనే అంశాన్ని గురించి మాట్లాడుకొందాం. మత్తయి 25:23,28,29_ అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివాని యొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడును; లూకా 19:17,19_ అతడు–భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణములమీద అధికారివై యుండుమని వానితో చెప్పెను. అతడు–నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను; 1 కొరింథీయులు 3:12-15_ ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్య కాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలోనుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును; 2 కొరింథీయులు 9:6_ కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా3 పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును; ప్రకటన 14:13_అంతట–ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ‘మహిమ యొక్క స్థాయిలు’ అనే ఆ వ్యక్తీకరణ దేవుడు తన అనుచరుల నమ్మకమైన భూసంబంధమైన జీవితాలకు సంబంధించి వారిపై దయతో అనుగ్రహించే వ్యక్తిగత ఆశీర్వాదాలను వివరిస్తుంది. మరి దీని ప్రత్యేకత ఏమిటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.