బైబులు రెండు ప్రధాన భాగములను కలిగియున్నది.

6. పాత నిబంధన అనగా నేమి?

  • హెబ్రీయులకు1:1_పూర్వకాలమందు నానాసమయములలోను (నానాభాగాలుగా) నానావిధములు  గాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు.
  • అపొస్తులుల కార్యములు 3:18_ అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోటముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.

పాత నిబంధన బైబులు నందు ఒక భాగమైయుండి, క్రీస్తు రాకడకు ముందు వ్రాయబడి దేవుని వాగ్ధానమైన రక్షకుని గూర్చి తెలియజేయుచున్నది.

7. క్రొత్త నిబంధన అనగానేమి?

  • పొస్తులుల కార్యములు 3:18_ అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.
  • హెబ్రీయులకు 9:15_ ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.
  • యోహాను 20:31_ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

క్రొత్త నిబంధన బైబిలులో ఒక భాగమైయుండి, క్రీస్తు వచ్చిన తరువాత వ్రాయబడి యేసునందు తన వాగ్దానమును దేవుడు యెట్లు నెరవేర్చియున్నాడను దానిని గూర్చి తెలియజేయుచున్నది.

8. పాత నిబంధన క్రొత్త నిబంధనలను మనకు ఇచ్చుటకు దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడు?

  • హెబ్రీయులకు 1:1,2_ పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను (యుగములును (11:3) నిర్మించెను.
  • 2 పేతురు 3:2_ పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.

దేవుడు పాత నిబంధనను మనకు ఇచ్చుటకుగాను తన ప్రవక్తలను మరియు క్రొత్త నిబంధనను మనకు ఇచ్చుటకుగాను యేసు యొక్క అపొస్తలులను ఉపయోగించుకున్నాడు.

ప్రవక్తలు    39             క్రీస్తు      27     అపొస్తలులు

______________________________ + _____________________________

 పాత నిబంధన పుస్తకములు      క్రొత్త నిబంధన పుస్తకములు

క్రీ.పూ 1400 ________________________________________________________100క్రీ.శ

బైబులు అను పదము బిబ్లియా అను గ్రీకు మాట నుండి వచ్చింది. ఆ మాటకు పుస్తకములు అని అర్ధం. బైబులు 66 పుస్తకములను కలిగియున్నది. ఇవి మనుష్యులచేత క్రీస్తు పూర్వము 1400 నుండి క్రీస్తు శకము 100 మధ్య కాలములో వ్రాయబడ్డాయి.

పాత నిబంధన 39 పుస్తకములను కలిగియున్నది. ఇది హీబ్రూ భాషలో వ్రాయబడియున్నది. ఇందు 3 ముఖ్య భాగాలు వున్నాయి. ఆదికాండము నుండి ఎస్తేరు వరకు 17 పుస్తకాలను  చారిత్రిక గ్రంధములు అని అంటారు. యోబు నుండి పరమగీతము వరకు 5 పుస్తకాలను పద్య గ్రంధములు అని పిలుస్తారు. యెషయా మొదలుకొని మలకి వరకు ప్రవక్తల 17 పుస్తకాలను  ప్రవక్తల గ్రంధములు అని పిలుస్తారు. క్రొత్త నిబంధన 27 పుస్తకములను కలిగియున్నది, ఇది గ్రీకు భాషలో వ్రాయబడి యున్నది. ఇందు కూడా 3 ముఖ్య భాగాలున్నాయి. మత్తయి నుండి అపోస్తులులకార్యముల వరకు ఈ 5 పుస్తకాలను చారిత్రిక గ్రంధములు అని పిలుస్తారు. రోమీయులకు వ్రాసిన పత్రిక నుండి యూదా వ్రాసిన పత్రిక వరకు 21 పుస్తకములను పత్రికలు అని పిలుస్తారు. ప్రకటనను ప్రవచన గ్రంధము అని పిలుస్తారు.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.