జుడాయిజంలోని దేవాలయం మరియు సమాజ మందిరాలు అను విభిన్నమైన పరిపక్వమైన వ్యవస్థల నుండి అపోస్టోలిక్ యుగం యొక్క ప్రారంభ క్రైస్తవ సంఘము ప్రారంభమయ్యింది. సంఘము సార్వత్రికo. ఆరాధనలో దైవభాగస్వామ్యం, ధర్మశాస్త్రం, సువార్త రూపాల క్రింద ఈ ఆరాధన అనే ప్రక్రియ నిర్దిష్టంగాక్లుప్తముగా ఉండాలి. ఈ రోజులలో 2 రకాలైన ఆరాధనలు ఈ లోకములో వున్నాయి. 1. లిటర్జికల్ చర్చి ; 2. నాన్-లిటర్జికల్ చర్చి.

లిటర్జికల్ చర్చి అంటే ఏమిటి?

లిటర్జికల్ చర్చి ఆరాధన ఒక నిర్దిష్ట క్రమమును, నిర్దిష్ట పదాలు మరియు ప్రత్యేక ప్రార్థనలతో దృఢమైన నిర్మాణాన్ని అనుసరిస్తుంది. లిటర్జికల్ చర్చి ఆరాధనలో సాధారణంగా మాన్యువల్‌ ప్రార్థనలు, పఠనాలు లేదా ఆచారాలను కలిగి ఉండే ఒక అధికారిక ఆరాధన. ఇది ప్రపంచవ్యాప్త ఆరాధనా క్రమం. లిటర్జికల్ ఆరాధనలలో పాల్గొనే క్రైస్తవులు చర్చి సంప్రదాయాలకు శతాబ్దాలుగా అనుసంధానించబడి వుంటారు.

నాన్-లిటర్జికల్ చర్చి అంటే ఏమిటి?

నాన్-లిటర్జికల్ చర్చి ఆరాధన లిటర్జికల్ చర్చిలా నిర్మాణాత్మకమైనది కాదు, తక్కువ నిర్మాణంతో ఉంటుంది. నాన్-లిటర్జికల్ ఆరాధనలోని వివిధ భాగాలను మార్చవచ్చు. ఉదాహరణకు, ప్రసంగం ఆరాధనలో ప్రధాన భాగం కావచ్చు. ప్రార్థనలు ఆరాధన పాస్టర్ గారి స్వంత మాటల్లోనే ఉండవచ్చు స్క్రిప్ట్ లేకుండా. దాని బైబిల్ పఠనాలు, ప్రార్థనలు దాని పరివర్తనల పరిధిని అనుసరిస్తుంది. నాన్-లిటర్జికల్ చర్చి ఆరాధనలలో వారి సిధ్ధాంతాలు మరియు బహిరంగ ఆరాధన యొక్క అనుసరణ అలాగే వారు ఆరాధనలో ఉపయోగించే భాష గాని మత కర్మలకు గాని మాన్యువల్‌ ఉండదు.

లిటర్జికల్ చర్చి

  1. లిటర్జికల్ చర్చి ప్రతి ఆరాధనలో వాక్యము మరియు సంస్కారములు అను రెండింటి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
  2. లిటర్జికల్ చర్చి ఆదిమ సంఘముతో దాని ఐక్యతను మరియు సహవాసాన్ని వ్యక్తపరుస్తుంది.
  3. లిటర్జికల్ చర్చి ప్రతి ఆరాధనలో  పాప క్షమాపణ అను సువార్తను నొక్కి చెబుతుంది.
  4. లిటర్జికల్ చర్చి ప్రతి సంవత్సరం ప్రసంగాల ద్వారా సంపూర్ణముగా “దేవుని నిత్య సంకల్పాన్ని” సమీక్షిస్తుంది.
  5. లిటర్జికల్ చర్చి అనేది క్రీస్తు-కేంద్రీకృతమైనది.
  6. లిటర్జికల్ చర్చి దాని కీర్తనలు మరియు పాటలను ప్రకటించడం మరియు ప్రార్థించడం అను రెండింటి కొరకు  ఉపయోగిస్తుంది.
  7. లిటర్జికల్ చర్చి ఆరాధకుడితో పాటు బోధకుడు మరియు భాగస్వామి అను ఇద్దరిని నడిపిస్తుంది.
  8. లిటర్జికల్ చర్చి ఆరాధించే వారికి మరియు ఆరాధనకు నాయకత్వం వహించే వారి మధ్య సంభాషణను సృష్టిస్తుంది.
  9. మన ఆరాధనలో దేవుని పనే మనిషి పని కంటే ముఖ్యమైనదని లిటర్జికల్ చర్చి గుర్తిస్తుంది.

లిటర్జికల్ చర్చి దేవుని వాక్యం నుండి తీసుకోబడిన ఒక సెంట్రల్ థీమ్ చుట్టూ ప్రతి ఆరాధనను ఒకటిగా చేస్తుంది.

లిటర్జికల్ ఆరాధనలోని ప్రయోజనాలు_ లిటర్జికల్ ఆరాధనలోని పదాలు చాలా సంవత్సరాలుగా ఉపయోగించ బడుతున్నాయి, కాబట్టి లిటర్జికల్ చర్చిస్ లోని వాళ్ళు ప్రాముఖ్యమైన ఈ పదాల గురించి వారి అవగాహనను నిరంతరం అభివృద్ధి చేస్తుంది.

లిటర్జికల్ ఆరాధనలోని ప్రతికూలతలు_ ప్రజలకు చాలా బోరింగ్‌గా మారవచ్చు. ఆధునిక కాలానికి సరిపోక పోవచ్చు- చాలా పరిమితం చేయబడింది కాబట్టి ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్చలేరు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.