లూథర్ చిన్న ప్రశ్నోత్తరి, డేవిడ్ పి. కుస్కి
కాపీరైట్: విస్కాన్సిన్ ఇవాంజెలికల్ లూథరన్ సినడ్

తాళపు చెవుల వాడుక మరియు ఒప్పుకోలు
కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము

తాళపు చెవులు
మొదటిది: తాళపు చెవుల వలన ఉపయోగమేంటి?
తాళపు చెవుల వలన ఉపయోగమేంటంటే, అది క్రీస్తు భూమిపైనున్న తన సంఘమునకు పశ్చాత్తాప్తులైన పాపులకు వారి పాపములను క్షమించడానికి, పశ్చాత్తాపము పొందని వారికి వారు పశ్చాత్తాపము పొందని స్థితిలో ఉన్నంత వరకు పాప క్షమాపణను ఇవ్వకుండా తిరస్కరించడానికి, ఇచ్చిన ఆయన ప్రత్యేకమైన అధికారమును హక్కునై యున్నది.

దీనిని గూర్చి ఎక్కడ వ్రాయబడి ఉంది? 
[యేసు] ఈ మాట చెప్పి [ఆయన శిష్యుల] మీద ఊది–పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచి యుండునని వారితో చెప్పెను అని పరిశుద్ధ సువార్తికుడైన యోహాను తన సువార్త 20:22,23 వచనాలలో వ్రాసెను.

తాళపు చెవులు బహిరంగముగా వాడుట
రెండవది: క్రైస్తవ సంఘము తాళపు చెవులను ఏ విధముగా ఉపయోగిస్తుంది?
ఎవరైతే తమ పాపములను బట్టి పశ్చాత్తాపపడతారో మరియు మళ్లుకోడానికి ఇష్టపడతారో వారిని క్షమించడానికి మరియు పాపముల విషయమై స్పష్టముగా పశ్చాత్తాపము పొందక ఉన్నవారి విషయములో వారు పశ్చాత్తాపము పొందు నిమిత్తము వారిని సంఘము నుండి బహిష్కరించడానికి క్రైస్తవ సంఘము తమ సేవకై పిలువబడిన క్రీస్తు సేవకునితో క్రీస్తు ఆజ్ఞ ప్రకారము, తాళపు చెవులను వాడుతుంది.

ఇది జరిగినపుడు, మన ప్రియ ప్రభువైన క్రీస్తు ఆయనే మన యెడల జరిపించినట్లుగా పరలోకమందు ఇది సరియైనదియును నిక్కమైనదనియు నేను నమ్ముచున్నాను.

దీనిని గూర్చి ఎక్కడ వ్రాయబడి ఉంది?
“భూమి మీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమి మీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు మత్తయి సువార్త 18:18 నందు చెప్పాడు.

ఒప్పుకోలు
మొదటిది: ఒప్పుకోలు అంటే ఏంటి?
ఒప్పుకోలు రెండు భాగములను కలిగి ఉంది. మొదటిగా, మనము మన పాపములను ఒప్పుకోవడం; రెండవదిగా, దేవుడు తనకు తానే ప్రకటించినట్లుగా, పాస్టర్ గారి నుండి మనము పాపక్షమాపణను లేక క్షమాపణను పుచ్చుకోవడం. మన పాపములు పరలోకమందున్న దేవుని ఎదుట క్షమింపబడి యున్నవని సందేహించక, దృఢముగా నమ్మవల్సి ఉన్నాం .

రెండవది: మనము ఏయే పాపములను ఒప్పుకోవల్సి ఉన్నాం?
దేవుని ఎదుట మన పాపములన్నిటిలో మనము అపరాధులమని ఒప్పుకోవల్సి ఉన్నాం. మనము ఎరిగియుండని పాపములనైనను, ప్రభువు ప్రార్థనలో వేడుకొనునట్లు ఒప్పుకోవాలి.

కాని పాస్టర్ గారి ఎదుట మనకు తెలిసిన మరియు మన హృదయములో భావించుచున్న మన పాపములను మాత్రమే మనము ఒప్పుకోవాలి.

మూడవది: మనము యెట్లు ఈ పాపములను గుర్తిస్తాం?
పది ఆజ్ఞల ప్రకారము జీవితములో నీకు ఏ స్థానమున్నదో గమనించండి. నీవు తండ్రివా, తల్లివా, కుమారుడవా, కుమార్తేవా, ఉద్యోగివా, లేక యజమానివా? నీవు అవిధేయుడవుగానో, నమ్మకరహితుడవుగానో లేక సోమరిగానో ఉన్నావా? మాటద్వారా గాని, క్రియద్వారా గాని, నీవు ఎవరినైనా గాయపరచితివా? అవినీతిపరుడవుగా గాని, అజాగ్రత్తగా గాని వృధాపుచ్చుట నైనను మరి ఏవిధముగా నైనను నీవు తప్పు చేసావా?

నాల్గవది: పశ్చాత్తాప్తుడైన పాపికి పాస్టర్ గారు పాప క్షమాపణను యెట్లు ధ్రువపరుస్తాడు?
“క్రీస్తు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుధ్ధాత్మయొక్కయు నామమున నీ పాపములు క్షమించుచున్నాను ఆమెన్,” అని అతడు చెప్తాడు.

ప్రియమైన సహోదర సహోదరీలకు క్రీస్తులో వందనాలు! దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దాని స్వచ్ఛతలో, బైబిలు బోధిస్తున్నట్లుగా ప్రజలందరికీ, అన్ని భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా అందించాలనే ఉద్దేశంతో ఈ పరిచర్య కొనసాగుతోంది. ఈ సేవకు ఎంతో సమయం, శ్రమ, ప్రార్థన, ఆర్థిక వనరులు అవసరం. కాబట్టి, ఈ పరిచర్యను మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించడానికి, సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడానికి, ప్రజలకు అందించడానికి అవసరమైన జ్ఞానాన్ని, ఆత్మీయ బలాన్ని, ఆరోగ్యాన్ని, సహకారాన్ని, తగిన వనరులను దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించండి. ఈ పరిచర్య ద్వారా అనేకమంది దేవుని వాక్యాన్ని తెలుసుకొని, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లభించే పాపక్షమాపణను, రక్షణను విశ్వసించి, విశ్వాసంలో ఎదగాలని ప్రార్థిద్దాం. మీ ప్రార్థనల ద్వారా, అలాగే దేవుడు మీకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి, మీకు ఇష్టమైన సహకారం ద్వారా ఈ సేవలో భాగస్వాములు కావలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. “దేవుని వాక్యము వ్యాపించుచు మహిమపరచబడునట్లు ప్రార్థించుడి” — 2 థెస్సలొనీకయులకు 3:1. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక! కృతజ్ఞతలతో,
రెవ. కూరపాటి విజయ్ కుమార్.

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl