యేసు ప్రతి ఒక్కరి పాపాల కొరకు మరణించాడు (1 కొరింథీయులకు 15:3, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను). నిశ్చయంగా, దీనర్థం యేసు మన గత పాపాలు మరియు తప్పుల కొరకు మరణించాడని. కాని ఆయన ప్రతి ఒక్కరి భవిష్యత్తు పాపాల కొరకు కూడా మరణించాడా? అని ప్రశ్నించొచ్చు. బైబిలు యేసు ప్రతి ఒక్కరి పాపాల కొరకు మరణించాడని చెప్పినప్పుడు, అది ప్రతి ఒక్కరి పాపాలన్నింటినీ—గత, వర్తమాన, భవిష్యత్తు పాపాలను—కలిగి ఉంటుంది. అయితే అన్ని సంఘల నాయకులు ఈ బోధనను అంగీకరించరు.

వారిలో కొందరు ఈ బైబిలు బోధన ప్రజల పాప స్వభావానికి స్వేచ్ఛ ఇస్తుందని ఆందోళన చెందుతూ, “యేసు ప్రతి ఒక్కరి గత పాపాలకే కాకుండా భవిష్యత్తు పాపాలకోసం కూడా మరణించాడని మనం చెబితే, ‘విశ్వాసులు మనం ఏమి చేసినా పరవాలేదు; ఎందుకంటే మన పాపాలు ఇప్పటికే క్షమించబడ్డాయి!’ అని అనుకుని పాపంలోనే కొనసాగుతారు” అని అనుకుంటారు.

ఈ తప్పుడు ఆలోచన ఆధారంగా, కొందరు సంఘ నాయకులు యేసు కేవలం మన గత పాపాల కొరకు మాత్రమే మరణించాడని తప్పుగా బోధిస్తారు. వారు లేఖన సత్యాన్ని మార్చి, “దేవుడు మన గత ఋణాలను మాత్రమే క్షమిస్తాడు; అవే గత పాపాలు. ప్రభువు ప్రార్థనలో మనం ‘మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము’ అని ప్రార్థించేది దీనికోసమే (మత్తయి 6:12) అని చెప్తారు. అందుకే మనం ప్రతిరోజూ దేవుని క్షమాపణను కోరాలి” అని చెప్తారు. వారు కొన్నిసార్లు, 2 పేతురు 1:9 కోట్ చేస్తూ, ‘ఈ గుణములు లేని వాడు దృష్టి తక్కువవాడై అంధుడై, తన పూర్వ పాపముల నుండి శుద్ధి పొందిన విషయాన్ని మరచిపోయాడు’ (ESV) అని వాదిస్తారు. ఈ వచనం మన పూర్వ పాపాలు క్షమించబడ్డాయని చెబుతోంది; కాని భవిష్యత్తు పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం లేదు.”

ఇది కనీసం రెండు కారణాల వల్ల ఇటువంటి బోధ స్పష్టంగా తప్పు. మొదటిగా, దేవుడు మనకు ఇలా చెప్పలేదు.

యేసు బలి అన్ని పాపాలను కప్పివేసింది—దీనికి ఎటువంటి మినహాయింపు లేదు. “అన్నీ” అంటే అన్నీ—గత, వర్తమాన, భవిష్యత్తు పాపాలు. కొలస్సయులకు 2:13, “అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను” అని చెబుతోంది. దేవుని ప్రేరణతో వ్రాసిన బైబిలు రచయితలందరూ ఈ విషయములో ఏకాభిప్రాయంతో ఉన్నారు.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక రచయిత కూడా ఇదే విషయాన్ని బోధిస్తున్నాడు. హెబ్రీయులకు 9:24-26లో, క్రీస్తు బలి పాత నిబంధన బలులకన్నా శ్రేష్ఠమైనదని అతడు చెప్తూ ఇలా ప్రకటించాడు: “అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింప లేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. 25అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. 26అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను.”

పాపం “ఒకసారి సమస్తమునకు తొలగించబడింది.” దీనర్థం అన్ని పాపాలు—నీ పాపం, నా పాపం, మన పూర్వీకుల పాపం, మన భవిష్యత్ తరాల పాపం. అన్ని పాపాలు—గత, వర్తమాన, భవిష్యత్తు.

దేవుడు మన భవిష్యత్తు పాపాలను క్షమించలేదని బోధించడం తప్పు కావడానికి మరొక కారణం ఇదే: దేవుడు మనం క్షమాపణ అడిగినప్పుడు మాత్రమే మన పాపాలను క్షమిస్తే, 1) మనం చనిపోయే ముందు క్షణంలోనే మన పాపాలను ఒప్పుకొనగలిగితే తప్ప మనం మన పాపాలలోనే మరణిస్తాము; 2) అప్పుడు మన క్షమాపణ క్రీస్తు సిలువపై చేసిన కార్యం వల్ల కాదు, మన ఒప్పుకోలు వల్ల సంపాదించబడినదౌతుంది. ఇది క్రియల ద్వారా నీతిమంతులమవుతామని భావించే ఒక రూపం; ఇది ప్రజలను క్రీస్తు నుండి దూరం చేస్తుంది (గలతీయులకు 5:4, మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు).

అయితే యేసు మన భవిష్యత్తు పాపాల కొరకు కూడా మరణించాడా? అవును, ఆయన నిశ్చయంగా మరణించాడు. ఈ సత్యం మనకు భవిష్యత్తులో పాపం చేయడానికి కారణం కాదు. బదులుగా, మనం అన్ని పాపాల నుండి విముక్తులమై దేవునికి ఇష్టమైన జీవితం గడపవలెనని ఇది మనకు ప్రతిరోజూ జ్ఞాపకం చేస్తుంది. మనం ఒక ధర చెల్లించి కొనబడినవారమని, ఇప్పుడు మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన విధంగా ఉపయోగించడానికి స్వేచ్ఛ కలిగినవారమని ఇది గుర్తుచేస్తుంది (1 కొరింథీయులకు 6:20, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి).

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl