భాగం 2: ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పరలోకానికి వెళ్లగలడా?

భాగం 1లో మనం పేర్కొన్నట్లుగా, దేవుడు మనుష్యులను తీర్పు తీర్చినప్పుడు, వారి జీవితాంతంలో వారు యేసును తమ రక్షకునిగా విశ్వసించారా లేదా అనే ఆధారంపైనే ఆయన తీర్పు జరుగుతుందని బైబిలు బోధిస్తుంది (యోహాను 5:24; మార్కు 16:16; ప్రకటన 2:10). ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎప్పుడూ తాను క్రైస్తవ సంఘ సభ్యుడనని లేదా విశ్వాసినని చెప్పుకోకపోతే, అతడు లేదా ఆమె విశ్వాసి అని మరియు పరలోకంలో ఉంటారని చెప్పడానికి మనకు కారణం లేదు (అయితే ఈ వ్యక్తి హృదయాన్ని దేవుడు మాత్రమే చూడగలడు — 1 సమూయేలు 16:7). కాబట్టి ఏదో “సరైన సమయం” కోసం ఎదురు చూడకుండా, ఇతరులపట్ల క్రైస్తవ ప్రేమ మనకు అవకాశం ఉన్నప్పుడల్లా, అనుకూల సమయంలోనైనా ప్రతికూల సమయంలోనైనా, వారికి సువార్త ను ప్రకటిధ్ధాం (ఎఫెసీయులకు 5:15-16; కొలస్సయులకు 4:4-5; 2 తిమోతికి 4:2).

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తాను క్రైస్తవ సంఘ సభ్యుడని లేదా విశ్వాసినని చెప్పుకున్నట్లయితే, ఈ ప్రశ్నను మరింతగా పరిశీలించాల్సి ఉంటుంది.

బైబిలులో ఆత్మహత్యకు సంబంధించిన ఆరు సంఘటనలు ప్రస్తావించబడ్డాయి: గిద్యోను కుమారుడైన అబీమెలెకు (న్యాయాధిపతులు 9:50-56), రాజైన సౌలు (1 సమూయేలు 31:1-4), సౌలు రాజు యొక్క ఆయుధధారి (1 సమూయేలు 31:5), ద్రోహి సలహాదారుడైన అహీతోఫెలు (2 సమూయేలు 15:12,30-37; 16:15–17:23), ఉత్తర రాజ్యానికి ఏడు రోజుల రాజైన జిమ్రీ (1 రాజులు 16:8-20), మరియు యూదా ఇస్కారియోతు (మత్తయి 27:3-5; అపొస్తలుల కార్యములు 1:25). కొందరు ఈ జాబితాలో సమ్సోనును కూడా చేర్చుతారు (న్యాయాధిపతులు 16:21-31). అయితే సమ్సోను మరణాన్ని, దేవుని చేతులనుండి తన ప్రాణాన్ని తీసుకొని తన స్వంత చేతుల్లో పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నంగా చూడకూడదు (కీర్తన 31:15). సమ్సోనుకు అనేక లోపాలు ఉన్నప్పటికీ, అతని మరణం తన సహచర సైనికులను రక్షించడానికి శత్రువు విసిరిన గ్రెనేడ్‌పై పడితే తాను మరణించే అవకాశముందని తెలిసినా అలా చేసే సైనికుడి త్యాగంలాంటి కార్యంగా చూడాలి. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో సమ్సోను నిజమైన దేవునిపై ప్రార్థనాపూర్వక విశ్వాసాన్ని చూపించడమూ, హెబ్రీయులకు 11వ అధ్యాయంలో అతను విశ్వాసుల జాబితాలో ప్రస్తావించబడడమూ దీనికి ఆధారాలు (వచనం 32). అయితే పైన పేర్కొన్న మిగిలిన ఆరు సంఘటనల విషయంలో ఇది కనిపించదు. ఈ ఆరుగురు ఇశ్రాయేలు ప్రజల్లో భాగమైనప్పటికీ, వారు అవిశ్వాసంతో ప్రవర్తించినట్లుగా కనిపిస్తుంది. అలా అయితే, వారు మెస్సీయాలో ఉన్న పరలోక నిరీక్షణను విడిచిపెట్టినట్లే.

అయితే బైబిలులో ప్రస్తావించబడిన ఆత్మహత్య ఉదాహరణలన్నీ ప్రతికూలమైనవైనా, దీనర్థం తన ప్రాణాన్ని తానే తీసుకున్న ప్రతి వ్యక్తి నిత్య నాశనానికి గురవుతాడని కాదు. ఒక వ్యక్తి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉండవచ్చు — శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే మెదడు కూడా సరిగా పనిచేయకపోవచ్చు. లేదా తీవ్రమైన భావోద్వేగ సంక్షోభ సమయంలో ఒక వ్యక్తి తన నియంత్రణను కోల్పోయి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు. ఈ పరిస్థితులలో ప్రతి సందర్భంలోనూ ఆ వ్యక్తి అవిశ్వాసంతోనే ఇలా చేశాడని మనం ఖచ్చితంగా చెప్పలేం. చివరికి, మనుష్యులను నిత్య శిక్షకు గురిచేసేది అవిశ్వాసమే (2 థెస్సలొనీకయులకు 1:8-9; యోహాను 3:18), తప్ప ఏదైనా నిర్దిష్ట పాపం మాత్రం కాదు. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు: ఇలా చెప్పడం ద్వారా ఆత్మహత్య దేవుని చిత్తానికి విరుద్ధమైన పాపమని (మార్కు 7:21; 1 పేతురు 4:15) లేదా అది మిగిలిన కుటుంబ సభ్యులు, స్నేహితులపై విషాదకరమైన ప్రభావాన్ని చూపుతుందని నిరాకరించడం కాదు. (మీరు ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నట్లయితే, దయచేసి నమ్మకమైన క్రైస్తవ వ్యక్తిని సంప్రదించి మాట్లాడండి. ప్రభువు దృష్టిలో మీ జీవితం విలువైనది!) దీని అర్థం కేవలం పాపం మరియు అవిశ్వాసం మధ్య తేడాను గుర్తించడం మాత్రమే.

ఎందుకంటే చివరికి, మనం యేసు మెస్సీయాపై విశ్వాసం ద్వారా రక్షింపబడుతున్నాము. మనం మంచి జీవితం గడిపినందువల్ల కాదు; మంచి మరణం పొందినందువల్ల కూడా కాదు. యేసు మన స్థానంలో పరిపూర్ణంగా జీవించాడు, మనకు రావలసిన శిక్షను భరించి మరణించాడు, మరియు తరువాత మృతులలోనుండి లేచాడు. అందువల్లనే మనకు రక్షణ కలుగుతుంది.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl