నా భవిష్యత్ పాపాలు క్షమించబడ్డాయా?

క్రైస్తవులు మొదటినుండే యేసు మన పాపాల కొరకు మరణించాడని నేర్చుకుంటారు (1 కొరింథీ 15:3,4 – లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను). నిశ్చయంగా, దీని అర్థం యేసు మన గత పాపాలు మరియు తప్పుల కొరకు మరణించాడని, కానీ ఆయన మన భవిష్యత్ పాపాల కొరకు కూడా మరణించాడని దీని అర్థమా? యేసు మన పాపాల కొరకు మరణించాడని బైబిలు చెప్పినప్పుడు, ఇందులో మన గత, వర్తమాన, మరియు భవిష్యత్ పాపాలన్నీ చేరి ఉంటాయి. కానీ చాలా సంఘాలు ఇలా బోధించవు.

వారిలో కొందరు, ఈ బైబిలు బోధ ప్రజల పాప స్వభావానికి స్వేచ్ఛనిస్తుందని ఆందోళన చెందుతారు. “యేసు వారి గత పాపాలతో పాటు భవిష్యత్ పాపాల కొరకు కూడా మరణించాడని మనం ప్రజలకు చెబితే, ‘మనం ఏమి చేసినా ఫర్వాలేదు, ఎందుకంటే మన పాపాలు ఇప్పటికే క్షమించబడ్డాయి!’ అని అనుకుంటూ వారు పాపం చేస్తూనే ఉంటారు” అని భయపడతారు.

ఈ తప్పుడు ఆలోచన ఆధారంగా, కొందరు సంఘ నాయకులు యేసు కేవలం మన గత పాపాల కొరకు మాత్రమే మరణించాడని తప్పుగా బోధిస్తారు. “దేవుడు మన గత పాపాలైన గత రుణాలను మాత్రమే క్షమిస్తాడని, ప్రభువు ప్రార్థనలో మనం ప్రార్థించేది దీనికోసమే—దేవుడు మన (గత) ఋణాలను క్షమించాలని (మత్తయి 6:12) అని చెప్తూ అందుకే మనం ప్రతిరోజూ దేవుణ్ణి క్షమించమని అడగాలి” అని చెప్తారు.

వారు కొన్నిసార్లు, 2 పేతురు 1:9 చూపెడుతూ, ‘ఎవనికైతే విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయ ఉండవో, వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృిష్టిలేనివాడునగును’ అని చెప్తూవుంది కదా. మన గత పాపానికి మనం క్షమించబడ్డామని, కానీ మన భవిష్యత్ పాపానికి కాదని ఆ వచనం స్పష్టంగా చెబుతోంది” అని వాదిస్తారు.

దేవుడు మనకు చెప్పేది ఇది కాదు. ఇలాంటి ఆలోచన కనీసం రెండు కారణాలను బట్టి స్పష్టంగా తప్పు.

మొదటిగా, యేసు బలి అన్ని పాపాలను కప్పివేసింది—దీనికి మినహాయింపు లేదు. అన్ని అంటే అన్ని—గత, వర్తమాన, మరియు భవిష్యత్. కొలొస్సయులకు 2:15, “మీ అపరాధముల వలనను, మీ శరీర సున్నతి లేకపోవుట వలనను చనిపోయిన మిమ్మును, దేవుడు మన అపరాధములన్నిటిని క్షమించి, ఆయనతోపాటు బ్రతికించెను” (ESV) అని చెబుతోంది. దేవునిచే ప్రేరేపించబడిన బైబిలు రచయితలందరూ ఈ విషయంలో ఏకగ్రీవంగా ఉన్నారు.

హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త కూడా ఇదే విషయాన్ని 9:24-26లో చెప్తూ, “అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింప లేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధ స్థలము లోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయిన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుట వలన పాపనివారణ చేయుటకై యొక్కసారే ప్రత్యక్షపరచ బడెను” అని స్పష్టపరుస్తూ, పాత నిబంధన కాలపు బలుల కంటే క్రీస్తు బలి శ్రేష్ఠమైనదని చెప్పాడు.

పాపం “ఒక్కసారే… తొలగించబడింది.” అంటే సమస్త పాపం—నీ పాపం, నా పాపం, మన పూర్వీకుల పాపం మరియు మన మునిమనవళ్ల పాపం. గత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన సమస్త పాపం.

దేవుడు మన భవిష్యత్తు పాపాలను క్షమించలేదని బోధించడం తప్పు అనడానికి మరొక కారణం : మనం క్షమాపణ కోరినప్పుడు మాత్రమే దేవుడు మన పాపాలను క్షమిస్తాడనుకుంటే, 1) చనిపోయే ముందు క్షణం మన పాపాలను ఒప్పుకోగలిగితే తప్ప, మనం మన పాపాలలోనే చనిపోతాము; మరియు 2) దీని అర్థం మనకు లభించే క్షమాపణ యేసు సిలువపై చేసిన పని ద్వారా కాకుండా, మన ఒప్పుకోలు ద్వారా సంపాదించబడినది అవుతుంది. ఇది ‘క్రియల ద్వారా నీతిని పొందే’ విధానం వంటిది మరియు ఇది ప్రజలను క్రీస్తు నుండి వేరు చేస్తుంది (గలతీయులకు 5:4, మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు.)

కాబట్టి, యేసు మన భవిష్యత్తు పాపాల కోసం చనిపోయాడా? అవును, కచ్చితంగా చనిపోయాడు. ఈ సత్యం భవిష్యత్తులో పాపం చేయడానికి మనకు ఎలాంటి సాకును ఇవ్వదు. దానికి బదులుగా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపడానికి మనం సమస్త పాపం నుండి విముక్తి పొందామని ఇది మనకు ప్రతిరోజూ గుర్తుచేస్తుంది. మనం వెల చెల్లించి కొనబడ్డామని, ఇప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో మన జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నామని ఇది మనకు గుర్తుచేస్తుంది (1 కొరింథీయులకు 6:20, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి).

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl